మన అదృష్టం అండి, అలాంటి అమ్మ దొరకడం. పెద్దలు కు ఉన్న మంచి లక్షణాలు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,657; 104 తత్వాలు (Tatvaalu) and views 226,093.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మల్లెపువ్వు వాసన, మనిషి ని బట్టి నటించదు. మంచి తనం ఉన్న వారు, మంచి అనకుండా గౌరవించకుండా, చెప్పకుండా, ప్రోత్సహించకుండా ఊరుకోలేరు, అని రాము గోపీ తో ఇలా చెపుతున్నారు.

అవసర అవకాశ జీవచ్ఛవం లాగా స్వార్ధం తో బతకలేరు, ఎందుకంటే మనకు లేని మంచి, మన పిల్లలకు రాదని, వారికి స్పష్టముగా తెలుసు. అదే వారికి చివరి దశలో, గుది బండ అవుతుంది అని వీరికి తెలుసు.

మంచి మనసు పరుగెత్తి, దైవ సంకల్పం నెరవేరుస్తుంది, మంచి ని కొనసాగించడం కు ప్రోత్సాహం చేయడం కు. ఇదే ఉదాహరణ.

ఉదయం 156 వ వారం 108 ప్రదక్షిణలు దగ్గర, ఒక పెద్దావిడ ఒకరే విడిగా వచ్చి, దండం పెట్టి, అబ్బాయి, అమ్మ అదృష్టవంతురాలు అంది.

ఇలా 8 ఏళ్ల లో, ఎంతో మంది నేరుగా చూసిన వారు అన్నారు, వారి మంచి మనసును చాటారు, మనకు అలవాటు పడిపోయింది.

వారే మొదటి సారి పలకరింపు. 7 ఏళ్లుగా గుడి దగ్గర, అప్పుడు అప్పుడు చూస్తాం, వారిని.

ప్రతి నమస్కారం పెట్టి, ఎందుకండీ అలా అనిపించింది, అని విషయం తెలుసుకోవడానికి, అడిగాము.

ఎన్నోసార్లు ఏళ్లుగా చూస్తున్నాము, మీ ఇద్దరు ను గమనిస్తూ ఉన్నాము. అమ్మ ను ఎంత జాగ్రత్తగా, ఎంత పద్దతి గా, పసిబిడ్డ లాగా, ప్రతి శనివారం, దేవాలయం కు చేయి పట్టుకుని తెచ్చుకోవడం తీసుకుని వెళుతున్నావు, నవగ్రహ ప్రదక్షిణలు చేపిస్తున్నావు. అంత శ్రద్ధ ఓపిక ప్రేమ, ఎంతమంది కి ఉంటుంది అన్నారు. అమ్మ చేసుకున్న అదృష్టం, అది అన్నారు.

ధన్యవాదాలు. భలేవారు, అది మన అదృష్టం అండి, అలాంటి అమ్మ దొరకడం, పెద్దలు కు ఉన్న మంచి లక్షణాలు, మనకు జీన్స్ ద్వారా కొన్ని అయినా వస్తాయి. వారికే లేనివి, మనం మంచి అలవాటు చేసుకోవాలి అంటే, ఇంకా ఎక్కువ కష్టపడాలి, మానసిక నియంత్రణ తో.

మీరు వారం కు, ఒకసారి మాత్రమే చూస్తున్నారు, ఓ గంటన్నర ఇక్కడ. కానీ ఇంటికి దగ్గర, రోజూ మైలు నడకలో, అక్కడ ఉన్న పెద్దలు, కన్నీళ్ళు పెట్టుకుని, రోజూ దండం పెడతారు అండి అన్నా.

ఎందుకు అలా అన్నారు.

ఏళ్లుగా వారు ఒకరు మాత్రమే, నడకకు వస్తున్నారు. ఏనాడూ వారి పిల్లలు, వారి చేతులు పట్టుకుని, వారిని తీసుకుని రాలేదని వారి బాధ కావొచ్చు, అమ్మ ను చూసి ఆనందం కావచ్చు, తమకే ఆ గౌరవం జరిగింది అని వారి సంతోషం కావచ్చు.

వారు కూడా, అవును నిజమే, చేయి పట్టుకొని చిన్నగా జాగ్రత్తగా, నడిపించేవారు చాలా తక్కువ. శభాష్ అన్నారు.

పిల్లలు ఉంటే, వారిని కూడా ఇంతకన్నా, మంచి సంస్కారం గా పెంచాలని, వారు అన్నారు.

తప్పకుండా తల్లి, అందరూ మన పిల్లలే. అదే పని చేస్తున్నా 20 ఏళ్ళు గా, వారి చివరి దశలో, కన్నీళ్ళు కష్టాలు ఉండకూడదు అని. వారే అర్ధము చేసుకోకుండా, మనల్ని తూలనాడుతున్నారు, దూరముగా వెళుతున్నారు.

అయినా అమ్మా, గుణం అనేది భాగస్వామి మరియు పిల్లలు తో వస్తుందా, మనలో చిన్నప్పుడు నుంచి లేనిది. ప్రహ్లాదుడు వయస్సు ఎంత? భాగస్వామి మరియు పిల్లలు ఉన్నారా? పిన్న వయస్సు లోనే, తండ్రి కే గుణపాఠం చెప్పారు, కదా అన్నాము.

అవును, నిజం అబ్బాయి, అది వ్యక్తి గుణం, సద్గురువు సేవ. అమ్మ కన్నా, గొప్ప గురువు ఎవరు. మంచిది అంటూ నవ్వుతూ వెళుతున్నారు, మరలా నమస్కారం చేస్తూ. మనమూ ప్రతి నమస్కారం చేసాము.

వారు తమిళం. అమ్మ దూరంగా ఉండి, ఏమిటో వారిద్దరూ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ, దండాలు పెట్టుకుంటున్నారు, అని చూస్తూ దగ్గరకు వస్తే, తెలుగు లో చెప్పినా, వారు ఇలా అంటున్నారు, నిన్ను పొగుడుతున్నారు అని. మరలా అమ్మ, వారూ నమస్కారం చేసుకున్నారు నవ్వుకుంటూ.

గతము లో కూడా, ఒక ఉత్తరాది వారు, అమ్మకు ఏమి కావాలంటే, అవి వండుకుని తెస్తాను అని కనీసం 3 సార్లు 3 వారాలు అడిగారు. కొత్తవారుతో ఏమి సమస్యలో అని, అంతే గాక అమ్మ ఏవి పడితే అవి తినకూడదు, ఆహార నియమం తప్పకూడదు కాబట్టి, ధన్యవాదాలు తెలుపుతూ, మన్నించాలి అన్నాము.

మన పుణ్యం మనల్ని వీడదు, అలాగే పాపం కూడా. పాపాలతో ఎన్న పీఠాలు ఎక్కినా, ఎన్ని సంపాదించినా, చివరకు అన్ని ఉన్నా, ఒంటరిగా పతనమే, పతనమే, కన్నీళ్ళే. పంచభూతాలు వదలవు సుమా.
We are lucky to have such a mother. What are the good qualities of adults?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,657; 104 తత్వాలు (Tatvaalu) and views 226,093
Dt : 09-Oct-2022, Upd Dt : 09-Oct-2022, Category : General
Views : 411 ( + More Social Media views ), Id : 1571 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : lucky , mother , mom , qualities , adults , parents , children , respect
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content