విశ్వరూపం - నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో, యువకుల్లారా లేవండీ యువతను - NTR, Dasari - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,701; 104 తత్వాలు (Tatvaalu) and views 225,092.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

నిద్ర మరియు ప్రాపంచిక మత్తులో ఉన్న, నిస్తేజమైన ప్రజలలో చైతన్యం కలిగించాలి అంటే, ఎవరో ఒకరు పుణ్యాత్ముడు రావాలి, ఆ మార్పులు తెలియచేయాలి తీసుకు రావాలి, అవి తాను రోజూ ఆచరిస్తూ, ఇతరులకు ఆశ్చర్యము కలిగించాలి, మార్గదర్శకము కావాలి. ఆ పనులు అన్ని ధర్మము గా నిస్వార్ధము గా, అరిషడ్వర్గాలను జయించే విధముగా, అందరికీ ఆదర్శముగా ఉండాలి.

తాము చేస్తున్న పనులు ఏమిటో, ఎందుకు తనకే అన్ని కష్టాలు వస్తున్నాయో, మరి ఇతరులు అంత కన్నా కష్టాలు పడుతూ కూడా, సంతోషముగా ఎలా ఉన్నారు, ఎందుకు మన పిల్లలు మాత్రమే ఆత్మహత్యలు చేసుకుంటూ లేదా రోగాలు రొప్పులతో, మానసిక బలహీనులు గా ఉన్నారు, అని ప్రతి ఒక మనిషి ఆలోచన చేసి, ముందు తమ కుటుంబాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. తమకు తెలియకపోతే, తెలిసిన మంచి వారి మాట వినాలి, దాని ప్రకారం నడచుకోవాలి.

దేవుడి పేరు లేదా ధ్యానం/ పూజ నాటకాలు, రోజూ నోటితో మాటలు చెప్పడము కాదు, అరిషడ్వర్గాల బానిసత్వం తెంపడములో, పది మంది కష్ట సుఖాలను వినడం లోను, రోజూ వారి ఆచరణలో చూపించాలి సుమా. అదే నిజమైన మానసిక నైవేద్యం దేవునికి, రుపాయి ఖర్చు లేదు, ఏ ఊరు కష్టపడి ప్రయాణం తో పోనక్కరలేదు. అందుకే దేవుడు మనలోనే ఉన్నాడు అన్నది, మన త్యాగం లో గుణము లో నిస్వార్ధ సేవ లో చూపించాలి.

అలా కొత్త ఒరవడి మార్పులు తెచ్చిన వారు సొంత గా సంచలనం స్రుష్టించినవారు, ఈ 30 ఏళ్ళ కాలములో తెలుగు లో ఎంటీయార్, పీవీ నరసిమ్హా రావు. ఇప్పుడు ప్రధాని గా మోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా యోగీ, అమెరికాలో ట్రంప్.

ఈ పాటల్లో చూడండి ఎంత అర్ధము ఉన్నదో - ఎంత మంది ని ఉత్సాహపరచడం ఉన్నదో, కాలేజీ విద్యార్ధులను మంచి వైపు నడిపించడములో, లెక్చరర్ గా. మనసుతో పాటలు పాడుతూ, అవి ఆచరణలో కి వస్తేనే దేవుని అండ. లేదంటే ఏదో ఒకనాడు రాహు కేతు శని క్రమశిక్షణ చర్యలు లో భాగం అయ్యి, మన సొంత అతి తెలివి పనులతోనే పతనం అవుతాము సుమా.

1) పల్లవి:
నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు 2
అది మీరే మీరే మాస్టారు... మా దేవుడు మీరే మాస్టారు 2 ||నూటికో కోటికో||

చరణం 1:
దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు...
జాతే నా వెలుగన్నాడు జాతిపిత మన జాతిపిత...
దిక్కులు తెలియని సమయంలో...
తానే దిక్కుగ నిలిచాడు శాంతి ని నేతగ నిలిపాడు...
శాంతిదూత మన శాంతిదూత...
ఆ జాతిపిత బాపూజీ మీలో వెలిశాడు....
ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు....
ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు....
మా దేముడు మీరే మాస్టారు.... మా దేముడు మీరే మాస్టారు ||నూటికో కోటికో||

చరణం 2:
జరిగే జీవిత సమరంలో జారే నైతిక విలువల్లో
నీతిని నేతగా నిలపాలి నవయువతా.. యువనేతా..
డొక్కలు మాడే గుండెల్లో.. నిప్పులు వెలగని గుడిసెల్లో
ఆశను జ్యోతిగా నిలపాలి నవయువతా.. యువనేత..
ఈ యువతకు తాత గాంధీజీ, మీలో మిగిలారు
ఈ నవతకు నేతాజీ, మీలో రగిలారు
అందరూ, ఆ అందరూ, మీలో ఉన్నారు
దేశానికి మీరే సారధులు... దేశానికి మీరే సారధులు

నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు 2
అది మీరే మీరే మాస్టారు... మా దేవుడు మీరే మాస్టారు 2

2) ఉన్నా.నూ., నే. ఉన్నానూ.- ఉన్నా.నూ. నేనున్నా.నూ. 2
అందరిలో.., మీ అందరిలో,,,
మీ చూపుగా.., మీ రూపుగా.., మీ నీడగా.., మీ తోడుగా..
మీలో వెలిగే దీపం,
అదే నా.. విశ్వరూపం 2
యువకుల్లారా.. లేవండీ., యువతను నిద్దుర లేపండి. 2
భవితకు పునాది వెయ్యండి, జనతకు ఊపిరి పోయండి 2
ఉన్నా.నూ., నే. ఉన్నానూ.- ఉన్నా.నూ. నేనున్నా.నూ

దారి పొడుగునా ఎముకల గూడులు.. 2
అవి ఏ. అన్నవో.., ఏ. చెల్లివో.., నీ అమ్మవో.., మీ నాన్నవో..
తెలియని చీకటి పయనం మనదీ..
చీకటి బాపగా.., వెలుతురు లేపగా..
తుపాను రక్కసి గుండెలు చీల్చగా.. ||యువకుల్లారా|| ||ఉన్నా.నూ||

ఎండను మోసే ప్రతి రాయి.., ఒక గుండెకు ఊపిరి నివ్వాలి.. 2
చెమటను తుడిచే ప్రతి చేయీ.., నిరుపేదకు దీవెన కావాలి..
ముందడుగే మీ లక్ష్యం., కార్యసాధనే మీ గమ్యం
ఇది యువరధం., ఎవ్వరు ఆపిన - ఆగని బ్రహ్మ రధం. ||యువకుల్లారా|| ||ఉన్నా.నూ||

మనిషి తలచుకుంటే..,జరగనిదేదీ.. విద్యా.ర్ధులు చేయి కలిపితే, చేయలేనిదేదీ..
ప్రతి వ్యక్తి లో.ను ఒక వ్యక్తి.., అదే.. మీలో.. ఉన్న శక్తి...
లేపే వరకు తెలియదూ, లేచాక నిదురించదు 2
ఆ శక్తే.. ఆది శక్తై.., స్వార్ధపరుల వాకిట మహా శక్తై,
నవ సమాజ నిర్మాణం చెయ్యాలి 2
సమ సమాజానికి నవ పతాకం ఎగురవెయ్యాలి ||యువకుల్లారా|| ||ఉన్నా.నూ||

Actors : NTR / ఎన్ టీ ఆర్, Jayasudha/ జయసుధ ,
Music Director : K.Chakravarthi / కె.చక్రవర్తి ,
Lyrics Writer : Dasari Narayana Rao / దాసరి నారాయణ రావు ,
Singer : P.Suseela / పి. సుశీల, Sp balu / యస్ పి బాలు ,
Viswaroopam, 1981 NTR film

Viswaroopam nutiko kotiko okkaru eppudo yuvakullara levandi yuvatanu ntr dasari  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,701; 104 తత్వాలు (Tatvaalu) and views 225,092
Dt : 22-Jun-2022, Upd Dt : 22-Jun-2022, Category : Songs
Views : 680 ( + More Social Media views ), Id : 1436 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : viswaroopam , nutiko , kotiko , okkaru , eppudo , yuvakullara , levandi , yuvatanu , ntr , dasari
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content