వేమన వాస్తవ పలుకులు, ఈనాడు నిజం కాదా? ప్రపంచం మొత్తం , ప్రార్థనా మందిరాలు అన్ని మూత - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,881,047; 104 తత్వాలు (Tatvaalu) and views 226,224.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

శిలను ప్రతిమ చేసి, చీకటింటను పెట్టి, మొక్కవలదు మూఢభక్తులార; ఉల్లమందు బ్రహ్మముండుట ఎరుగరా - అనే పద్యం చూస్తే వేమన కవి గారి కి, యథార్థవాది - లోక విరోధి, అనే బిరుదు నామం ఎందుకు దక్కిందో అర్థమయిపోతుంది.

ఇప్పుడు చెప్పండి, నిజం మాట్లాడుతూ ఉంటే లేదా చెపుతూ ఉంటే, ఎంతో మందికి కోపాలు తాపాలు వస్తాయి. ఎందుకంటే తమను తామే మరచి, భ్రమలలో ఉంటారు కాబట్టి. కొంత కాలానికి అవి తొలగిన తర్వాత, వాస్తవం బయటకు వస్తుంది, కానీ జీవితం లేదా సమయం ముగుస్తుంది.

పైన చెప్పిన వేమన వాస్తవ పలుకులు, ఈనాడు కూడా నిజం కాదా? ప్రపంచం మొత్తం మీద, ప్రార్థనా మందిరాలు అన్ని మూతపడ్డాయి. తిండి కోసం, మందు కోసం, కుటుంబం కోసం, వృత్తి జీవనం కోసం ఆరాటపడుతున్నారు గాని, బాధపడుతున్నారు గానీ, ఎవరైనా ప్రార్ధనా మందిరాలు తెరవమని ఆందోళన చేశారా? చేయలేదు, చేయరు కూడా.

ఎందుకంటే అందరికీ అర్థం అయింది, ప్రార్ధనా మందిరం, మొదటి అవసరం కాదు, చివర మాత్రమే. సరే వాటి తో ఘనముగా వ్యాపారం చేసే వారూ, మిద్దెలు కట్టేవారూ ఉన్నారు, ఇప్పుడు వద్దు దాని గురించి. ముందు తిండి, బతుకు, కుటుంబం.

అందుకే ప్రపంచములో ని అన్ని ప్రభుత్వాలు కూడా, కరోనా సమయంలో మొదటి దశ ముగింపు లో, నాలుగు దశల లో అన్ని సంస్థలు తెరిపిస్తూ, కేవలము నాలుగో దశలో మాత్రమే, ప్రార్ధన మందిరాలు తెరవాలని చెప్పారు. అది ఏ మతమైనా ఒకటే పద్ధతి, తేడా లేదు.

అంటే దేవ దేవుడు లేడని అర్థం కాదు, దేవుడు ఉన్నారు, మన లోనే, మన హృదయం లోనే. ముందు మన లో, తల్లి దండ్రుల లో, తనకు సహాయం చేసిన వారిలో, దైవాన్ని చూడలేని వాడు, ఆలయంలో ఏనాటికీ దేవుని చూడలేడు, తాను చేసే పూజలు యాగాలు హోమాలు నిష్ప్రయోజనం.

అందుకే, ముందు మన లోనే ఉన్న దైవం ను సాధనతో, చూద్దాం, కనుగొందాం. ధ్యానం చేద్దాం. మన చుట్టూ ఉండే వాళ్ళ లో ఉండే, దైవ శక్తిని మేల్కొలుపుదాం.

బ్రతుకు బ్రతికించు. నలుగురు కు పంచుతూ తినాలి, మనకున్న ధనమైనా, విద్య అయినా, తిండి అయినా, ఆధ్యాత్మిక సంపద అయినా. చుట్టూ మంచి సమాజం లేని నాడు, మనం కూడా విలువ లేని వస్తువుల మే సుమా. సర్వేజనా సుఖినోభవంతు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,881,047; 104 తత్వాలు (Tatvaalu) and views 226,224
Dt : 23-May-2020, Upd Dt : 23-May-2020, Category : General
Views : 1464 ( + More Social Media views ), Id : 557 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vemana words true , world halls of worship , temples closed
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content