పాటతో పరమార్ధం - తీగనై మల్లెలు పూచినా వేళ - ఆరాధన - చిరంజీవి, రాధిక, సుహాసిని, రాజశేఖర్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,765; 104 తత్వాలు (Tatvaalu) and views 226,445.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Theeganai mallelu - Aradhana - Chiranjeevi, Radhika, Suhasini, Rajasekhar

మోహాలు, వ్యామోహాల లోనికి వెళితే, ఎలా ఉంటుందో ఈ పాట పదాలలో చూడండి. సినిమాలో అర్ధం వేరు, మన నిజ జీవితములో ఆధ్యాత్మిక పరముగా అర్ధం వేరు సుమా. మనసు తెర తీసినా, మోమాటమేనా అని ముందు చిన్న గా బయలు దేరుతుంది మోహం, ఆ తర్వాత మమత కలబోసినా, మాట కరువేనా అంటుంది వ్యామోహం, అక్కడే మొదలు అవుతుంది కన్నీరు.

30 ఏళ్ళ దాకా అలా వ్యామోహము లో ఉంటారు అని అనుకుంటాము, కానీ 70 ఏళ్ళ కు కూడా, బోర్లా పడ్డ వారు చాలా మంది ఉన్నారు.

బంధము వద్దు అని ఎవరూ అనలేదు, ఐతే ధర్మం ముందు దాని తర్వాతే బంధము. కాదు, అధర్మ బంధము ఓకే అనుకున్నా ప్రస్తుతానికి, అది ఎక్కువ కాలము నిలబడదు, ఏదో ఒకరోజు వెన్నుపోటే.

ప్రహ్లాదుడు ఉదాహరణ చూపించాడు కదా? ముందు ధర్మం, తర్వాతనే తండ్రి మాటలకు విలువ. క్రిష్ణుడు కూడా, భార్య మాటకన్నా, ఉత్తమురాలైన తులసి మాటకే విలువ ఇచ్చి, తులాభారములో, తులసి ఆకు బరువుకే తను సమానం అయ్యారు, అప్పటి దాకా ఎన్ని నగలు వజ్ర వైఢూర్యాలు పెట్టినా ఆయనకు సరి తూగలేదు సుమీ.

ఒకసారి మోహ బంధములో పడ్డాక, అది తెలిసీ తెలియందా, అది తెలియక జరిగిందా? ఎపుడో జరిగిందా, అది ఇపుడే తెలిసిందా అని, మన మీద మనకే అనుమానం వస్తుంది, బ్రాంతిలో. ఆశపడ్డా అందుతుందా మనశ్శాంతి అని అనిపిస్తుంది, మరి అర్హతైనా ఉందా? అదే చూడాలి కదా? ఒకవేళ ప్రస్తుతానికి, అందుకున్నా, పొందికుందా, పొత్తు కుదిరేదా? తెలీదు, నిత్య గందరగోళమే.

ప్రేమకన్నా, పాశముందా? పెంచుకుంటే, దోషముందా? వారే చెప్పారు కదా, అది పాశం అని, దోషము అని కూడా అనుమానం అప్పుడే వచ్చేసింది. మరి ఒకసారి గుంటలో పడ్డాక, బురద తేలికగా వదులుతుందా? మనకు మరలా స్నానం చేయనిదే? తెంచుకుంటే, తీరుతుందా? పంచుకుంటే, మరిచేదా? బరి లో దిగేంత వరకే, మన మాట. దిగినాక, అంతా వ్యామోహం మాటే మిత్రమా.

ముందు కలలో మెదిలిందా, ఇది కథలో చదివిందా, అన్న బ్రమలకు లోను అవుతాము. బంధము కుదిరితే, అది మెరుపై మెరిసిందా, అది వలపై మన తలపై కురిసిందా, అన్న మాయలో చిక్కుతాము.

మరలా వేదాంతము ఏమిటి అన్నా/ అక్కా? కావాలని బురద గుంటలో మనసారా దూకి? రాసి ఉంటే, తప్పుతుందా? తప్పు నీదవునా? ఏమిటీ పిచ్చి ప్రశ్నా? మనము బురదలో దూకినప్పుడు మనదే తప్పు కదా? దూకక ముందు, అడగకుండా, దూకినాక, ఈ ప్రశ్న ఏమిటి? మారమంటే మారుతుందా, మాసిపోతుందా? ఎక్కడా మాసి పోదు, అతుకుల బొంతే. అందుకే అడుగు వేయక ముందే జాగ్రత్త పడాలి సుమా. అడుసు తొక్కనేల కాలు కడగనేల అని మనకు సామెత ఉంది కదా?

ఒకసారి దెబ్బ తగిలి, బుద్ది వచ్చాక, చేసుకున్నా పుణ్యముందా, సమస్యలనుంచి బయటకు చేరుకునే దారి ఉందా? అని చేదుకునే చేయిఉందా, చేయి చేయి కలిసేనా? అని ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తాము. కాబట్టి, ముందే మెలుకువ తో ఉండ, మాయలో అంటే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో పడకుండా ఉంటే మంచిది కదా?

తీగనై, మల్లెలు, పూచినా, వే..ళ
ఆగనా, అల్లనా, పూజకో, మా.ల
మనసు తెర తీసినా, మోమాటమే..నా
మమత కలబోసినా, మాట కరువే..నా ||తీగనై||

తెలిసీ తెలియందా, ఇది తెలియక జరిగిందా..
ఎపుడో జరిగిందా.., అది ఇపుడే తెలిసిందా..
ఆశపడ్డా., అందుతుందా., అర్హతైనా ఉం..దా
అందుకున్నా., పొందికుందా, పొత్తు కుదిరే..దా
ప్రేమకన్నా.. పాశముందా., పెంచుకుంటే.. దోషముందా
తెంచుకుంటే.. తీరుతుందా., పంచుకుంటే.. మరిచేదా

కలలో మెదిలిందా., ఇది కథలో చదివిందా..
మెరుపై మెరిసిందా., అది వలపై కురిసిందా..
రాసి ఉంటే.., తప్పుతుందా, తప్పు నీద..వునా
మారమంటే. మారుతుందా, మాసిపోతుం..దా
చేసుకున్నా.. పుణ్యముందా, చేరుకునే.. దారి ఉందా
చేదుకునే.. చేయిఉందా, చేయి చేయి కలిసేనా.. ||తీగనై||

Music :Ilayaraja; Lyrics-Veturi; Singers :Sp Balu, Janaki
Producer:Allu Aravind; Director:Bharathiraja; Year: 1987  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,765; 104 తత్వాలు (Tatvaalu) and views 226,445
Dt : 16-Aug-2023, Upd Dt : 16-Aug-2023, Category : Songs
Views : 252 ( + More Social Media views ), Id : 1877 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Theeganai , mallelu , Teeganai , Tiganai , Aradhana , Chiranjeevi , Radhika , Suhasini , Rajasekhar
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content