పాటతో పరమార్ధం - శ్రీరస్తు శుభమస్తు - పెళ్ళిపుస్తకం - రాజేంద్ర ప్రసాద్, దివ్య వాణి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,662; 104 తత్వాలు (Tatvaalu) and views 226,497.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Srirastu Subhamastu - Pelli Pustakam - Rajendra Prasad, Divya Vani

అబ్బా రోజూ ఇంట్లో గోలకి, ఉద్యోగం వ్యాపారం లో బాదుడికి తల పగిలిపోతుంది, అప్పులు గొడవలతో తలనొప్పి పుడుతుంది, ఈ ఒత్తిడి ఎలా తట్టుకోవాలి, ఆసుపత్రి లో ఖర్చు తో ప్రశాంతత పొందాలి అనుకుంటున్నారా? అక్కడే పప్పు మరియు తప్పు లో కాలేసారు. ఇలాంటి పాటలు పద్యాలు శ్లోకాలు మనస్పూర్తిగా పాడండి గాలి ఎగ బీల్చి గొంతు ఎత్తి, ఇంటి కప్పు అదిరేలా, అంతా ప్రశాంతము. ఇందాకే, అమ్మను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి, రక్త పరీక్ష ఫలితాలు తెలుసుకుని వచ్చాము, ఆయుర్వేదం దాని పని అది సక్రమముగా చేస్తుంది. నమ్మకం నమ్మకం నమ్మకం అనే పాట గుర్తు ఉంది కదా. సరే పాటలోకి వచ్చేద్దాము.

పెళ్ళి ఎందుకు? చాలా మందికి తెలీదు. పెళ్ళి అనేది రెండు అవసరాల, అవకాశాల, ధనాల, ఆస్తుల, పదవుల, అధికారాల, విదేశీ వీసాల లాంటి అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ ఆలోచనలతో జరిగేది అని, 80 శాతం మంది ఆలోచన.

ఈ రోజు వారు నరకం అనుభవిస్తున్నా కూడా, మరలా తమ పిల్లలకు కూడా అదే అవసర అవకాశ ఆలోచనతో, నరక కూపములో కి నెట్టి, తోలు బొమ్మలాటలు చూస్తున్నారు. తమ ముదుసలి తనములో, గతి లేని ఒంటరి లేదా అనాధాశ్రమ బతుకు, భారముగా సాగదీస్తున్నారు. తమ గత పాపాలను తలచుకుంటూ, కన్నీరు మున్నీరు తో, శిక్షణ అనుభవిస్తున్నారు.

అందుకే ఇప్పుడు పోలీసు స్టేషన్లు, లాయర్లు, కోర్టులు విడాకుల సమస్యల తో, కళకళ లాడుతున్నాయి. ఎంత కట్నం తీసుకున్నారో అంతకు మించి లేదా అసలు తీసుకోకపోయినా, వీరి సంపాదన ఆస్తిలో సగము ఎగరవేసుకుని వెళుతున్నారు, వారి బలా బలగాలను బట్టి.

తర్వాత వారి నుంచి ఇంకొకరు, అలా దురాశ సంపద చేతులు మారుతూ, వీరి గొయ్యలు పెద్దది చేస్తూ పోతుంది. కలసి ఉన్నా కూడా, స్వార్ధము తో, సంతనాన్ని కనీసం తమకు కూడా పనికి రాకుండా పెంచుతున్నారు, ప్రాపంచిక వ్యామోహములో. 80 శాతం పాపం పెరగడానికి, వీరే కారణం.

పెళ్ళి అనేది, ఇద్దరు గుణవంతులు కలసి సాగే 100 ఏళ్ళ పయనం. రాముడు మరియు సీత లాంటి, ఉత్తమ లోక ఉద్దరణ సంతనాన్ని, పెంచి పోషించడం కు, ఒక వారధి.

వారి మంచి పనులతో, లోక కళ్యాణముతో, అటు 7 తరాలు ఇటు 7 తరాలకు ముక్తిని ప్రసాదించడం. మరలా వారు, లవ కుశలు లాంటి ఉత్తములకు జన్మ నివ్వడం, లోకానికి శాంతిని అందించడం. ఒంటరివారిని, ముదుసలి వారిని సేవించడం, అండగా ఉండటము.

శ్రీరస్తు శుభమస్తు అంటూ, మంచి పెద్దల ఆశీస్సులతో, మంచి బంధముతో శ్రీకారం చుట్టుకుంది, ఆ కొత్త గుణ దంపతుల పెళ్ళి పుస్తకం. ఇక ఆకారం దాల్చుతుంది, మనశ్శాంతి తో వారి కొత్త జీవితం.

పెళ్ళి జరిగే తంతులో, ఒకరి తలమీదా చెయ్యివేసి ఒట్టు పెట్టినా, తాళిబొట్టు మెడనుకట్టి, బొట్టు పెట్టినా, తలంబ్రాలు పోసినా, సన్నికల్లు తొక్కినా, సప్తపదులు మెట్టినా, ఇద్దరి మనసు మనసు కలపడమే, ఆ వేద మంత్రం పరమార్ధం.

ప్రతి రోజూ అడుగడున, తొలి పలుకులు ప్రమాణాలు బాసలు, గుర్తు చేసుకో. అందుకే మూలము/ గతము మరువకూడదు, అని పెద్దలు చెప్పారు. కొన్ని సార్లు మాయలో మత్తులో, తడబడితే పొరబడితే, తప్పు దిద్దుకోవాలి. ఒకరినొకరు పూర్తిగా, దాపరికము లేకుండా, మంచి చెడు తెలుసుకుని, జీవితములో ఎదురు అయ్యే, ఒడిదుడుకులు తట్టుకుని, మసకేయని పున్నమిలా, మనసు నింపుకోవడమే, ఆ పీట ముడికి పరమార్ధం.

శ్రీరస్తు.. శుభమస్తు.., శ్రీరస్తు.. శుభమస్తు.. 2
శ్రీకారం చుట్టుకుంది, పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది, కొత్త జీవితం - 2 సార్లు 2 లైన్లు
శ్రీరస్తు.. శుభమస్తు.., శ్రీరస్తు.. శుభమస్తు.. 2

తలమీదా చెయ్యివేసి, ఒట్టు పెట్టినా.
తాళిబొట్టు మెడనుకట్టి, బొట్టు పెట్టినా .. - 2 సార్లు 2 లైన్లు
సన్నికల్లు తొక్కినా, సప్తపదులు మెట్టినా 2
మనసు మనసు కలపడమే..., మంత్రం పరమార్ధం ||శ్రీరస్తు||

అడుగడున తొలిపలుకులు, గుర్తు చేసుకో
తడబడితే పొరబడితే, తప్పు దిద్దుకో - 2 సార్లు 2 లైన్లు
ఒకరినొకరు తెలుసుకుని, ఒడిదుడుకులు తట్టుకుని 2
మసకేయని పున్నమిలా మనికి నింపుకో..||శ్రీరస్తు||

Directed by Bapu And Produced by Mullapudi  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,662; 104 తత్వాలు (Tatvaalu) and views 226,497
Dt : 19-Dec-2023, Upd Dt : 19-Dec-2023, Category : Songs
Views : 751 ( + More Social Media views ), Id : 1971 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Srirastu , Subhamastu , Pelli , Pustakam , Rajendra , Prasad , Divya , Vani
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content