ప్రేమంటే తెలుసా నీకు Parody తెలియందే ప్రేమించకు, రావణుడే రాముడైతే ANR Jayachitra - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,876,885; 104 తత్వాలు (Tatvaalu) and views 225,868.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*ప్రేమంటే తెలుసా నీకు Parody ప్రేమంటే తెలుసా మీకు, తెలియందే ప్రేమించకు, రావణుడే రాముడైతే ANR*

మనకు తెలిసి, రాయడం, స్పష్టముగా పలికే పాట ప్రయత్నం చేయడం, సత్యం పలకడం చెప్పడం ఇతరులను ప్రోత్సహించడం, ఆచరించడం, చేస్తున్నవారు ఎవరన్నా ఉన్నారా? ఒకవేళ ఇంకొకరు ఉంటే, మనము ఎందుకు ఆ ప్రయత్నం చేయలేము, కనీసం 30 ఏళ్ళ తర్వాత? మన అమ్మా నాన్న ఏమి తక్కువ చేసారు మనకు? చదువా, ధనమా, సంస్కారమా? ప్రహ్లాదునిలా, మనకు సొంత ఆత్మాభిమానము ఆత్మబలము ఆత్మశక్తి లేదా, ఇతర దేవుని సంతానం పై జాలి దయ కరుణ లేదా? లేకపోతే, దేవుని పుజ నటన వలన ప్రయోజనం?

తూనీగ తూనీగ ఎందాక, ఎంత తొందరగా మన పయనం/ పతనం అంటూ, ఉత్తమ సంస్కార నిర్మాత దర్శకుల కుటుంబ మరియు వారి పిల్లల పతన మార్గం, ఇతరులకు అలవాటు చేయడానికి, 10 ఏళ్ళకే ఇలాంటి ఉత్తమ పాటలు పెట్టడం సినిమాలలో చూస్తున్నాము, కనీసం 20 ఏళ్ళు అయినా తమ జీవితం సంతోషముగా గడపకుండా. తా చెడ్డకోతి వనమెల్లా చెరచింది అంటే ఇదే.

మరి బలహీన మనసులైన, మనము ఆ మాయలో పడతాము, అదే నిజమని బ్రమలో ఉంటాము. గుణం గురించి మనకు తెలీదు, పిల్లలకు అసలే అర్ధం కాదు, చిరాకు. చీ పాడు గుణాలు బాధ్యతలు సేవ త్యాగం ఎవరికి కావాలి అని. ధనం ఆస్తులు ముద్దు ముచ్చట్లు పతనం చాలు అంటారు.

60 ఏళ్ళ వారికే, ప్రేమ కు అవసరం అవకాశం కు తేడా తెలీక, తలలు బాదుకుంటూ, తమను తాము మోసము చేసుకుంటూ, ఇతరులను మోసము చేస్తున్నారు, పతనం అవుతున్నారు. కాషాయం కట్టిన 60 వారు కూడా, మా పిల్లలు మమ్మల్ని చూడటం లేదని, గాలికి వదిలేసారని, 55 ఏళ్ళ వారు వద్దు అని, 30 ఏళ్ళ వారితో ప్రేమలో పడుతున్నారు.

20 లో భగవద్గీత కు ఇది వయస్సు కాదు అంటారు, 60 దాకా ప్రేమలు అంటూ తిరుగుతూ, రోగం తో పోయాక, కాసెట్ వేసి, వచ్చిన జనానికి వినిపిస్తున్నారు. వాళ్ళు కూడ విని అర్ధం చేసుకుని ఆచరించకుండానే, మనం పోయినాక, మన వారు ఇతరులకు వినిపిస్తారులే అని, అదే పతన దోవ.

ఇక 20 ఏళ్ళ లోపు వారికి ఏమి అర్ధము అవుతుంది. త్యాగం, సేవ, బాధ్యత అంటే తెలీదు. 20 నెలలు తెలిసిన వారికోసం, 20 ఏళ్ళు పెంచిన వారిని, మీరు మూర్ఖులు మా చావు తెలివి తేటలను అర్ధం చేసుకోరు అంటారు.

మీ పేరెంట్స్ ను నువ్వు వదిలేయి, మా పేరెంట్స్ ని నేను వదిలేస్తాము అంటారు ఒకరు. ఇప్పుడే కాదు, ముదుసలి వారు అయ్యాక కూడా, ఆ సంస్కారం క్రుతజ్ఞత నేర్పని, ధన వర్గ అవసర అవకాశ పిచ్చి ఉన్న వీరిని, వదిలేద్దాము అంటారు ఇంకొకరు. తపన తీరాక, మన ఇద్దరం కూడా వదిలేసుకుందాము అంటారు, ఇంకొందరు.

వీరంతా, ప్రేమ గురించి మాట్లాడేది? సరే, ప్రేమ విలువలు తెలియని పిల్లలు వదిలేసిన, ఈ తల్లి దండ్రుల బాధ వినండి

Parody -

ప్రేమంటే తెలుసా మీకు, తెలియందే ప్రేమించకు ..
మనసిచ్చామని.., ఎదురే లేదని..
పిచ్చిగా.., మత్తులో పడకు
ప్రేమ ను, వ్యాపారంగా మార్చకు..

మీమనసు మీదిరా, మరి
పెంపకం సేవలు ఖర్చులు అన్ని గాలికేనా
కన్నవాళ్ళ మనసు గాయంకు, మీరెవ్వెరు?

ఎవరుకాని ఎవరినో, ప్రేమ బిక్ష అడిగారు 2
మిమ్ము పోషించిన కన్నవారు, పిచ్చివాళ్ళని వదిలారు ||ప్రేమంటే తెలుసా||

మీలో మీరే అనుకున్నారు
ఏదేదో ఊహించారు
మీదేనని కలగన్నారు
కలలొకరివి కళ్ళొకరివి
ఎలా కుదురుతుందిరా, ఏం మిగులుతుందిరా, అవసర అవకాశవాది, బుద్ది తెచ్చుకో విశ్వసనీయత పెంచుకో

ప్రేమ మార్గ మెన్నడూ, ఒకే వైపు దారి కాదు 2
మీరు మీతలుపులు తెరిస్తే, కన్న తలుపు తెరుచుకోదు ||ప్రేమంటే తెలుసా||

ఏది త్యాగం, చెయ్యి చూద్దాము, చెయ్యలేరు కదూ
మీరు రమ్మంటే, రాదు రా గుణం
సేవలు చెయ్యలేరు, రుణం తీర్చలేరు
అంతే రా జీవితం అంతే, ఒరేయ్ క్రుతజ్ఞతలేని పశువులా.. కళ్ళు తెరువు, భవిష్యత్ కష్టాలు తగ్గించుకో

కోరుకుంది జరిగితే, దేవుడనేవాడు లేడు 2
మిమ్ము నమ్మిఉన్న వారికీ, మీరేరా దేవుడూ

పోనీ మా పెద్దలు ఇలాగే వారి పెద్దలను మోసము చేసారు అంటావా, మరి వాళ్ళు తప్పుడు వారైతె, మరి మన మంచి ఏమిటి? ప్రహ్లాదుడు కధ చదవరా శుంఠా. ||ప్రేమంటే తెలుసా||

----
Original -

ప్రేమంటే తెలుసా నీకు తెలియందే ప్రేమించకు

మనసిచ్చానని బదులే లేదని
పిచ్చిగా నిందలు వేయకు
ప్రేమ ను చిచ్చుగా మార్చకు..

నీమనసు నీదిరా
ఇచ్చుకో దాచుకో ఏమైనా చేసుకో
ఎదటివాళ్ళ మనసును అడిగేందుకు నువ్వెవరు?

ఎవరుకాని ఎవరినో ప్రేమ బిక్ష అడిగావు
నిన్ను ప్రేమించిన మనిషిని పిచ్చిదనీ అన్నావు

నీలో నువ్వే అనుకున్నావు
ఏదేదో ఊహించావు
నీదేనని కలగన్నావు
కలలొకరివి కళ్ళొకరివి
ఎలా కుదురుతుందిరా
ఏం మిగులుతుందిరా

ప్రేమ మార్గ మెన్నడూ, ఒకే వైపు దారి కాదు
నువ్వు నీతలుపులు తెరిస్తే, ఎదటి తలుపు తెరుచుకోదు

ఏది నవ్వరా నవ్వు చూదాము నవ్వలేవు కదూ
నువ్వు రమ్మంటే రాదు రా నవ్వు
ఇవ్వమంటె ఇవ్వలేరు ఇచ్చామంటే తీసుకోరు
అంతే రా జీవితం అంతే..

కోరుకుంది జరిగితే దేవుడనేవాడు లేడు
నువ్వుకోరుకున్న వారికీ నువ్వేరా దేవుడూ

--ఆత్రేయ,బాలసుబ్రహ్మణ్యం,జికె వెంకటేశ్,1979 రావణుడే రాముడైతే
చిత్రం: రావణుడే రాముడైతే ( 1979), సంగీతం: జి.కె. వెంకటేశ్, సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, గానం: యస్.పి. బాలు

Ravanude Ramudaithe Premante Telusa niku parody anr jayachitra  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,876,885; 104 తత్వాలు (Tatvaalu) and views 225,868
Dt : 23-Sep-2022, Upd Dt : 23-Sep-2022, Category : Songs
Views : 532 ( + More Social Media views ), Id : 1531 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ravanude , ramudaithe , premante , telusa , niku , parody , anr , jayachitra
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content