రాజాధిరాజు పేరడీ - కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ - విజయచందర్, నూతన్, సుమలత, శారద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,887,234; 104 తత్వాలు (Tatvaalu) and views 226,684.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*పాటతో పరమార్ధం- రాజాధిరాజు పేరడీ ఎన్నికలకి - కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ - విజయచందర్, నూతన్ ప్రసాద్, సుమలత, శారద*

Song Spirit - Rajadhi Raju Parody - Kothaa Devudandi - Vijayachander, Nutan Prasad, Sumalatha, Sarada

New Gods.., new boons - for this election, for our downfall
Babu come, come, Pashuva...
Kotha devas and Kongotta devatas

If the elections come, many people are ready to sold themselves for opportunity, need, money or something else, they cast votes foolishly and win tigers, snakes and foxes that suit their qualities, risking the future of their children. Should we tell such people whether they are children or cattle (Pashuva)? Later, unable to pay taxes, they themselves say, Oh, we have burnt our karma, there is no single development work.

ఎన్నికలు వస్తే చాలు, ఎప్పుడెప్పుడు ఎంతకు ఎంతమందితో అమ్ముడు పోదామా, అవకాశం అవసరం ధనం లేదా ఇంకో దానికి, ఓట్లు మూర్ఖముగా వేసి, తమ గుణాలకు సరిపోయే, పులి పాము నక్కలను గెలిపిస్తున్నారు, తమ బిడ్డల భవిష్యత్ ను పణం గా పెట్టి. అలాంటి వారిని, శిశువా అనాలా పశువా అనాలా, మీరే చెప్పాలి? తర్వాత పన్నులు కట్టలేక, వారే అంటారు, అయ్యో మన ఖర్మ కాల్చుకున్నాము, ఒక్క అభివ్రుద్ది పని లేదు అని.

Selling votes for notes, without seeking free quality education, protection and health care for one's own children, is a crime, not a pardon. There are no good people, they don't use NOTA. Even, will they elect leaders like Modi or Yogi, who has low bank balance, no.

సొంత బిడ్డలకు, ఉచిత నాణ్యమైన విద్య వైద్యం రక్షణ కోరుకోకుండా, ఓటుకు నోటు అమ్మడం నేరం, క్షమార్హం కాదు. మంచి వారు లేరు కదా అని, నోటా వాడరు. పోనీ, మోదీ యోగీ లాంటి, బాంక్ బాలన్స్ తక్కువ ఉన్న వారిని ఎన్నుకుంటారా, అదీ లేదు.

కుటుంబ వారసత్వ బానిసత్వమునకే, మా ఓటు అంటారు. 3 దగ్గర ధనం తీసుకుని, ఇంకా పాపం పెంచుకుందాం, అని తెలివి తక్కువగా ఆలోచిస్తారు, ఆత్మాభిమానం మరియు కూతురు లాంటి ఓటు అమ్ముకుని. వారి పిల్లలు, అలాగే అనాలోచితముగా, క్షణిక ఆనందానికి, ఆవేశానికి లోనై, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో పతనము అవుతున్నారు.

పాప భారం తగ్గించే బాధ్యతను, పంచభూతాలకు ప్రక్రుతి విలయాలకు యాక్సిడెంటులకు వదిలేసి, తమ కుటుంబాన్ని, ప్రాపంచిక మాయలో మత్తులో ఉంచుతున్నారు, మంచి చెడు తెలియనీయకుండా.

ఈ పిచ్చి ఓటర్లను ఎలా మాయ చెయ్యాలా అని, వారి లో నుంచి ఎదిగి వచ్చిన నాయకులు, కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అందుకే ప్రజాస్వామ్యములో, మొదటి తప్పు, పాపము, ఓటరుకే. మన పార్టీలు అయినా, సంఘాలు అయినా అవే బుద్దులు, అవే అమ్ముడు పోవడాలు.

మీకు 10 వేలు ఫించన్, సైకిల్, లాప్టాప్, ఇళ్ళు, మత్తు మందులు ఇస్తాము, ఉచిత బస్సు రైలు విమానము, నెలకి అంత ఇంత పంచుతాము, నోట్లో బువ్వ వండి పెడతాము, అంటే చాలు ఓట్లే. డబ్బు ఎక్కడిది అని అడగరు, ఎలా ధనం తెస్తావు అని అడగరు. రేపు పన్నులు పెంచి మన దగ్గరే వసూలు చేస్తారని, తెలిసినా, మానసిక బలహీనతతో, అమ్ముడు పోతారు.

గెలిచాక ఫించన్ మీ జీవితం అంతం వరకు, 100 పెంచుకుంటూ, 5 వేలు కు వెళతాము. నువ్వు పోయాక, తదనంతరం భాగస్వామికి 5 వేలు నుంచి అలా 100 పెంచుకుంటూ 10 వేలు కు వెళతాము అంటే, నోరు మూసుకుని కూర్చుంటారు 5 ఏళ్ళు.

మరలా కొత్త నాయకులు, వినాయకులు వస్తే, మరలా వారి మాటలకు మాయలో పడతారు, బలహీన మనసులతో. చచ్చినా కూడా, ఆవును గెలిపించరు, ఇంకా గేళి చేస్తారు, ఆవూ నువ్వు కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేవు, మా లంటి పాపాత్ముల ఓట్లతో అంటారు. మరలా దైవ పూజలు మొక్కులు అబ్బో, కపటానికి నాటకానికి సినిమా వాళ్ళు సరిపోరు, ఓటరు ముందు.

నేలకు సొరగం దించారండీ, దించిన సొరగం పంచారండీ, నెత్తిన చేతులు పెడతారండీ, నెత్తినెట్టుకొని ఊరేగండీ అన్నా కూడా, అబ్బో మా ఇంట్లో మా వంశములో, ఇంతకన్నా పెద్ద మాయలే చేసాము కదా అని నవ్వుకుంటారు.

కేసులన్ని తప్పించేస్తాం, స్టేలతోనే మరిపించేస్తాం, బినామీలతో నడిపించేస్తాం, 5 ఏళ్ళు మిము మురిపించేస్తాం అంటే చాలు, తమ లాగా పద్దతిగా అబద్దలు చెపుతున్నారు, అని ఆనందముతో భారీ మెజారిటీ.

అప్పులు గొప్పగ చెయ్యొచ్చండి, అసలుకు ఎసరే పెట్టచ్చండి, పీపాలెన్నో తాగొచ్చండి, పాపాలెన్నో చేయొచ్చండి, ఉచితాలు ఎన్నో పొందచ్చండి, రాష్ట్రంను తాకట్టు పెట్టేనండి, పేరు మాత్రం వారిదేనండి, పతనం మాత్రం మనకే నండి అంటే చాలు - ఇక 30 ఏళ్ళు అన్నా నీ పాలనే కావాలి, పధకాలకు మీ పేర్లే ఉండాలి, మీ కుటుంబానికే బానిసలము, కొత్త నీరు రానీయం అంటారు. మీ సొంత కంపెనీల లాభాలు పెరగాలి, రాష్ట్రం అప్పులు కూడా పెరగాలి అని సామూహిక నినాదాలు చేస్తారు. కనీసం అన్నం కూడా దొరక కూడదు, 3 పంటల పొలాలను కాంక్రీట్ చెయ్యండి అంటారు. కరోఅనా లాగా రోగాలు వస్తే, పక్క రాష్ట్రాలకు వెళదాము అంటారు. తమ గొయ్యి తామే తీసుకుంటారు.

ఒరేయ్ బాబు రాష్ట్రం ను తాకట్టు పెడితే మనకు నష్టం కదా అంటే, మా ఇల్లు కాదు గా అంటారు, ముందు చూపు లేక? రేపు అన్నం 1000 రూపాయలకు కొనాలి లంక పాక్ లో లాగా, మా పిల్లలు మనుమల సంగతి మాకెందుకు అంటారు.

మన ప్రతి పాటతో పాటుగా ఎన్ని విన్నపాలు జనాలకు చేరుతున్నాయో చూడండి, వారి ముదుసలితనం భవిష్యత్ రాతను బట్టి వారు చదువుతారు/ చదవరు, ఆచరిస్తారు/ చీత్కరిస్తారు, స్పందిస్తారు/ స్పందించరు - 1. మన శని వార సాధనలు 2. గాత్ర వ్రాత నైవేద్యం మీరు పెట్టమని ప్రోత్సాహం 3. ముదుసలి తల్లి దండ్రి అత్త మామలను దగ్గర ఉంచి చూసుకోమని విన్నపం 4. పిల్లలకు సంస్కారం నేర్పితే మనకు ఉండి, మనల్ని ముదుసలి తనములో, దేవతలు గా కొలుస్తారు అని మేల్కొలుపు 5. నాయకులది తప్పు లేదు, వారిని ఎన్నుకున్న మన నక్క, పాము, పులి గుణాల ఓటర్లు దే మొదటి తప్పు, 6. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడండి, లేకపోతే పంచభూతాల శిక్షణ తప్పదు, ఇలా ఎన్నో విన్నపాలు జాగ్రత్తలు కూడా వెళుతున్నాయి, మరువద్దు సుమీ.

కొత్తా దేవుడండీ.., కొంగొత్తా దేవుడండీ (2) ఈ ఎన్నికలకి
ఇతడే దిక్కని మొక్కని వారికి, దిక్కు మొక్కు లేదంటండీ (2)
బాబు రాండీ, రాండీ పశువా...
కొత్తా దేవుడండీ.., కొంగొత్తా దేవుడండీ అండండీ

** నేలకు సొరగం దించారండీ, దించిన సొరగం పంచారండీ
నెత్తిన చేతులు పెడతారండీ, నెత్తినెత్తుకొని ఊరేగండీ
బ్రమలలో మనల్ని ముంచారండీ, వాస్తవం మరిచే పోతామండి
అమ్మకు అయ్యకు తోడొద్దని, మోహాల వెంట పడతామండి. ॥బాబు॥ ॥కొత్త॥

** అంధర్నీ రష్కించేస్తాం అంధాలన్నీ రాసిచ్చేస్తాం
శృంగారంలో ముంచీ తేల్చీ, బంగారంలో పాతేయిస్తాం

కేసులన్ని తప్పించేస్తాం, స్టేలతోనే మరిపించేస్తాం
బినామీలతో నడిపించేస్తాం, 5ఏళ్ళు మిము మురిపించేస్తాం

వీరే మీకు సమస్తా, వీరికే మీ నమస్తా
దుష్ట రక్షణం, శిష్ట శిక్షణం
చేసేయ్ చేసెయ్, మోసేయ్ మోసెయ్ (2) ॥బాబు॥ ॥కొత్త॥

** అప్పులు గొప్పగ చెయ్యొచ్చండి, అసలుకు ఎసరే పెట్టచ్చండి
పీపాలెన్నో తాగొచ్చండి, పాపాలెన్నో చేయొచ్చండి

ఉచితాలు ఎన్నో పొందచ్చండి, రాష్ట్రంను తాకట్టు పెట్టేనండి
పేరు మాత్రం వారిదేనండి, పతనం మాత్రం మనకే నండి॥అప్పులు॥

పాత దేవుడు, పట్టిన తప్పులు, ఒప్పులకుప్పులు చేస్తాడండీ (2)
కొత్త దేవుని కొలిచిన వారికి, కొక్కోక్కో కొదవే లేదండీ ॥బాబు॥ ॥కొత్త॥

చిత్రం : రాజాధిరాజు (1980); రచన : వేటూరి; సంగీతం : కె.వి.మహదేవన్; గానం : ఎస్.పి.బాలు, బృందం; Actor : Vijayachander/ విజయచందర్; Actress : Rajasulochana/ రాజసులోచన, Sumalatha/ సుమలత  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,887,234; 104 తత్వాలు (Tatvaalu) and views 226,684
Dt : 23-May-2023, Upd Dt : 22-Mar-2024, Category : Songs
Views : 381 ( + More Social Media views ), Id : 1760 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Kottaa , Devudandi , Rajadhi , Raju , Parody , Kothaa , Vijayachander , Nutan , prasad , Sumalatha , Sarada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content