పాటతో పరమార్ధం - పూచే పూలలోనా(భక్తి పేరడీ) - గీత - ప్రసాదబాబు, లీలారాణి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2140 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2175 General Articles and views 2,221,636; 104 తత్వాలు (Tatvaalu) and views 245,428.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Pooche Poolalona(Bhakti Parody) - Geetha - Prasadababu, Leelarani

- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
- Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వలన, అంటే రజో తమో గుణాల లాభనష్టాలు, మన పెద్దలు ఎప్పుడో ప్రత్యక్షంగా నిరూపించారు. ఆనాడు జగనన్న అనుచరులు చెడు కార్యాలు చేస్తుంటే, నేడు చంద్రన్న అనుచరులు అదే బాటలో వెళుతున్నారు, మాదే రాజ్యం అని, పవనన్నకు చెడ్డపేరు తెస్తూ.

నిన్న వార్తలలో కూడా చూసాము, ట్రంప్ ను హత్య చేయడానికి ప్రయత్నించారు. వాస్తవ వాది లోక విరోధి అని అనేది అందుకే. దానివలన, రజో తమో గుణాలకు కూడా నష్టమే, ఎందుకంటే రేపు వారు మిగలరు ఇలా కాల్చుకుంటూ పతనము చేసుకుంటూ పోతే, ఏ దేశములో అయినా.

ఎదుటి మనిషి బుద్ది/ గుణం మారాలి అనుకోవాలి గానీ, వారికి సాధన మార్గం చూపాలి గానీ, వారిని/వారు పతనము/ నాశనము చేస్తాము/ కావాలి అని అనుకుంటే కేవలం మనసులో అయినా, ముందు మనము మన పిల్లలు మనుమలు పతనము/ నాశనము అవుతారు. మనం ఏది ఇస్తే, భావిస్తే అదే మనకు తిరిగి వస్తుంది అని గుర్తు ఉంది కదా. అందుకే అందరినీ ప్రార్ధించేది, రజో తమో గుణాలను వీడండి సాధనతో, పంచభూత శిక్షణ మీరు భరించలేరు, ఆరోజున సానుభూతితో కనీసం మాట్లాడేవారు కూడా ఉండరు, సొంత ఇంట్లోనే.

అందుకే మానసిక నియంత్రణ ఉండాలి. అందుకే మానసిక పూజ చెయ్యాలి, రూపాయ ఖర్చు లేదు కదా? భౌతిక పూజలు మానసిక బలహీనులకు, 30 ఏళ్ళ లోపు. ఈ పాట ద్వారా అది నేర్చుకుందాము.

పరమాత్మ లేని చోటు ఏది? ప్రతి మనిషిలో ఉన్నారు, మరి ఇంకొకరిని ఎలా దండించాలి, హింసించాలి, పతనం చేయాలి, సహాయం చేయకూడదు అని మనకు ఎందుకు ఉంటుంది? ఈరోజు ఒకరి ఇల్లు పాడుబడితే, రేపు మన ఇల్లు, మన పిల్లల ఇల్లు పాడుబడదా? నోటి మాట సాయం చేయలేమా, రూపాయ ఖర్చు లేకుండా? అలా ఉన్నాము అంటే, మనము రజో తమో గుణ రాక్షసులము అయితేనే కదా?

మరి ఇంకా మన పూజా నటనలు కపటాలతో 2 నాల్కలతో లాభం ఏమిటి? దాని ఫలితం రేపు మనము, మన పిల్లలు, మన మనుమలు అంతా అనుభవించాలి.

మరి పూచే పూలలోనా వీచే గాలిలోనా, దైవ అంశమే దాగేలే, దైవ అందేలే.. మోగేలే, ఓ దేవా. . . ఓ దేవాధి దేవా అని మనస్పూర్తిగా భావించాలి, అది ఆచరణలో కూడా చూపాలి.

ఓ దేవా, మా ఊహలో మీరు, నిత్యం ఉయ్యాల లూగేరు. మా ఊపిరై మీరు, ప్రతి క్షణం మా లోన సాగేరు. ఎల్లప్పుడూ మీరు మా సర్వమే, మీరు మా స్వర్గమే అని మా రోజూ చేతి పనులతో సేవతో త్యాగాలతో సాధనలతో చూపుతాము. ఆ దైవం లేకున్న, ఈ లోకమే మనకు శూన్యమే.

సత్వ గుణముతో సాధన, 79+ ఏళ్ల అమ్మ సజీవ గురువు సేవ, సామాజిక సేవ, ఆయుర్వేదం, 2000+ కధనాలు, 245+ వారాల 108 ప్రదక్షిణలు, 590+ పైగా పాటలు పద్యాలు శ్లోకాలు, చాపనిద్ర, శాఖాహారం, ఇంకా ఎన్నో ఎన్నెన్నో మన శనివారం లిస్ట్ లో, ఎన్నో జన్మల బంధము మనది కాబట్టే అలవాటు అయ్యింది దేవా.

ఎవ్వరు ఏమన్నా, ఎగతాళి చేసినా, మనకు అండగా నిలబడకున్నా, మన ఆచరణ ప్రచారం ఇతరుల శ్రేయస్సు కోరడం ఆగదు, ఇది వీడనిది. మీరు మా గానమే, మీరు మా ధ్యానమే. ఆ దైవం లేకున్న, ఈ లోకమే మనకు శూన్యమే.

బాలు గారికి మంచి పేరు తెచ్చిన పాటలలో ఇదొకటి. ప్రసాదబాబుకి హీరో గా మొదటి సినిమా అని, లీలారాణి ఈ మూవీ సమయం లో ఆత్మహత్య చేసుకున్నదని అనేవారు.

Bhakti Parody

ఓ..హో..హో.. ఏ..హే..హెహే...
పూచే. పూలలోనా., వీచే. గాలిలోనా.
మీ అంశమే, దాగేలే.., మీ అందేలే.. మోగేలే..- 2 సార్లు
ఓ దేవా. . . ఓ దేవా. .

మా ఊహలో మీరు, ఉయ్యాల లూగేరు 2
మా ఊపిరై మీరు, మా లోన సాగేరు
మీరు మా సర్వమే, మీరు మా స్వర్గమే 2
దైవం లేకున్న, ఈ లోకమే.., శూన్యమే ||పూచే పూలలోన||

ఎన్నో జన్మల, బంధము మనది
ఎవ్వరు ఏమన్నా, ఇది వీడనిది
మీరు మా గానమే, మీరు మా ధ్యానమే 2
దైవం లేకున్న, ఈలోకమే.., శూన్యమే ||పూచే పూలలోన||

Original

ఓ..హో..హో.. ఏ..హే..హెహే...
పూచే. పూలలోనా., వీచే. గాలిలోనా.
నీ అందమే, దాగేలే.., నీ అందేలే.. మోగేలే..- 2 saarlu
ఓ చెలీ. . . ఓ చెలీ. .

నా ఊహలో నీవు, ఉయ్యాల లూగేవు 2
నా ఊపిరై నీవు, నా లోన సాగేవు
నీవు నా సర్వమే, నీవు నా స్వర్గమే 2
నీవు లేకున్న, ఈ లోకమే.., శూన్యమే ||పూచే పూలలోన||

ఎన్నో జన్మల, బంధము మనది
ఎవ్వరు ఏమన్నా, ఇది వీడనిది
నీవు నా గానమే, నీవు నా ధ్యానమే 2
నీవు లేకున్న, ఈలోకమే.., శూన్యమే ||పూచే పూలలోన||

చిత్రం : గీత (21.12.1973)
గీత రచయిత : జి. కృష్ణమూర్తి; సంగీతం : సత్యం ; నేపధ్య గానం : ఎస్.పి. బాలు
రేలంగి, ముక్కామల, కె.వి. చలం Relangi, Mukkamala, K.V. Chalam  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2175 General Articles and views 2,221,636; 104 తత్వాలు (Tatvaalu) and views 245,428
Dt : 14-Jul-2024, Upd Dt : 14-Jul-2024, Category : Songs
Views : 98 ( + More Social Media views ), Id : 2138 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Pooche Poolalona , Puche Pulalona , Bhakti , Parody , Geetha , Prasadababu , Leelarani , balu , lilarani
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content