కొత్తగా పార్లమెంటరీ ఇంఛార్జి మరియు సమన్వయ కర్తలు - ఆంధ్రా టీడీపీ ప్రెసిడెంట్ పేరుతో - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,514; 104 తత్వాలు (Tatvaalu) and views 226,083.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* కళా వెంకట్రావు గారు లేదా కొత్త పేరు మీద
* బీసీ ప్రెసిడెంట్ ని మనమే లెక్క లో
* బాపట్ల పార్లమెంటు ఇంఛార్జి, చీరాల ప్రెసిడెంట్
* స్ధానిక బలమైన నాయకుడు, పబ్లిసిటీ
* ప్రజల నాడి, కరోనా అవకాశం
* బీజేపీ రాష్ట్ర పార్టీ పదవులు లిస్టు
1 min read time.

గౌరవ టీడీపీ జాతీయ అధ్యక్షులకు, సెక్రటరీ గారికి నమస్కరించి వ్రాయునది,

ఆంధ్రప్రదేశ్ కు ఆదివారం కొత్తగా పార్లమెంటరీ ఇంఛార్జి లను మరియు సమన్వయ కర్తలను ప్రకటించారు, నూతనోత్సాహం తో ముందుకు సాగాలని, నూతన సారధులతో. శుభాకాంక్షలు. కానీ, ఆ ప్రకటన ఆంధ్రా టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకట్రావు గారు లేదా వార్తలలో వస్తున్న కొత్త అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి పేరు మీద, రిలీజ్ అయితే బాగుంటుంది.

ఎందుకంటే, ఇతర పార్టీలు కన్నా, మన పార్టీలో క్రమశిక్షణ ఎక్కువ. మన బీసీ ప్రెసిడెంట్ ని మనమే లెక్క లో చూపకపోతే గౌరవించకపోతే, పార్టీ కింద స్ధాయి కార్యకర్తలు నాయకులు గౌరవించరు. లోన మనం ఏ విధముగా ఉన్నా, కనీసం బయట మీడియాలో అయినా గౌరవించాలి.

ఉదాహరణకు, కళా వెంకట్రావు గారి పేరు మీద విడుదల చేస్తూ, జాతీయ అధ్యక్షుడు మరియు సెక్రటరీ గారి తో చర్చల అనంతరం, వారి ఆదేశాలు మేరకు, ఈ కొత్త ఇంఛార్జి లను ప్రకటిస్తున్నామని మీడియాలో పెడితే, పార్టీ పెద్దలు ను కూడా గౌరవించినట్లే కదా, మీరూ వార్తలలో ఉంటారు.

ఎందుకు ఇప్పుడు ఇది అనుకోవాలి అంటే, ఉదాహరణకు బాపట్ల పార్లమెంటు ఇంఛార్జి గా ఏలూరి గారిని పెట్టారు. రేపు మీరే, కదలక మెదలక గమ్ముగా ఉండి స్థానిక సమస్యలు గురించి వదిలేసి, కనీసము తమలపాకు తో నైనా, పైకి కరణం గారిని విమర్శించని, చీరాల పట్టణ ప్రెసిడెంట్ ను మారుస్తున్నాము అని మీడియాలో నేరుగా చెప్పిన, ఏలూరి గారిని, స్ధానికంగా ఎవరైనా గౌరవిస్తారా? ఉత్సవ విగ్రహం గా మిగిలి పోరా? స్ధానికంగా బలమైన నాయకులు మనకు వద్దా?

అంటే చీరాల ప్రెసిడెంట్ ను మార్చే వార్త నిర్ణయం లోన మీదే అయినా, ఇంచార్జ్ ఏలూరి గారి పేరు తో, జాతీయ అధ్యక్షుడు మరియు సెక్రటరీ గారి ఆదేశాలు మేరకు చర్చించి, పార్టీ కి నూతన చీరాల అధ్యక్షుడు ని నియమించాము అంటే, అందరికీ గౌరవం పెరుగుతుంది.

లోన మనకెన్ని సమస్యలు ఎంత గౌరవం ఉన్నా, బయటకు వ్యవస్థ లో మనం రాష్ట్ర అధ్యక్షుడు ని, ఇంఛార్జి లను గౌరవిస్తున్నాము, వారి మాటకు విలువ ఇస్తున్నామని, ప్రజలలో గౌరవం పెరగటానికి, వారి పేర్లు జనం లో నానడానికి, ఉపయోగపడుతుంది అని ఈ ప్రయత్నం. ధైర్యంగా స్ధానిక సమస్యలు ను పైకి తెచ్చి, జనం కు అండగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రజలకు మేలే కదా, ఒక స్ధానిక బలమైన నాయకుడు ఉన్నారు అంటే, తగిన పబ్లిసిటీ తో.

మీకు సలహాదారులు అనుభవజ్ఞులు ఉన్నారు, తెలియదని కాదు, కానీ ప్రజల నాడి పట్టుకోలేక పోతున్నారు. కరోనా అవకాశం ఉపయోగించుకోలేక పోతున్నారు, అని మీ అభిమానుల ఆవేదన. ధన్యవాదాలు

బీజేపీ రాష్ట్ర పార్టీ పదవులు లిస్టు, సోము వీర్రాజు గారి పేరుతో వచ్చింది, కానీ జాతీయ అధ్యక్షుడు పేరు తో రాలేదు, అందరికీ తెలిసిన విషయమే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,514; 104 తత్వాలు (Tatvaalu) and views 226,083
Dt : 28-Sep-2020, Upd Dt : 28-Sep-2020, Category : Politics
Views : 717 ( + More Social Media views ), Id : 729 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : new , in charge , parliamentary , president , coordinators , andhra , tdp , babu , lokesh , atchamnaidu , kala venkata rao
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content