Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Manishiko Sneham Manasuko daham (Parody) - Aathma Bandhuvu - Sivaji Ganesan, Radha
*పాటతో పరమార్ధం - మనిషికో స్నేహం, మనసుకో దాహం (పేరడీ) - ఆత్మబంధువు - శివాజీ గణేశన్, రాధ*
మనిషిగా ఎందుకు పుట్టాము? అని ప్రతి ఒకరు ఆలోచన చేస్తే, తమ స్వస్వరూపాన్ని తెలుసుకో గలుగుతారు. ఎందుకంటే ప్రతి మనిషికో స్నేహం, మనసుకో ధ్యేయం ఖచ్చితముగా ఉంటుంది, అది చెడు కానీ, మంచి కానీ, తన పెంపక సంస్కారం ను బట్టి. అలా లేనిదే జీవం లేదు, మనది జీవితం కానే కాదు. అందుకే భగవద్గీత చెప్పినట్లు సమతనే మధువు లేనిదే, మన జీవితము అంతా చేదు.
మనము ఎంత సాధన చేస్తే, మన మనసును అంత కట్టి వేయవచ్చు. మన మనసు ఒద్దికైంది, దైవ సాధన మచ్చికైంది. బ్రమలేమో మరిచింది, ఆధ్యాత్మికత మనసొకటై కలిసింది. రాతలు మాటలు బాటలు చిత్రములు సాధనలు ఎన్నో ఎన్నో మన నుంచి ఉద్భవించాలి మిత్రమా, సాధన సవ్య దిశలో వెళుతూ ఉంటే.
మన మనసు ధ్యానం దానికి తగిన ఆచరణలు తెలుసుకుంటే, మన ఉన్నది పూరి గుడిసె అయినా అది మనకు రాచనగరు. అప్పులతో పప్పు కూడు అవసరము లేదు. మనందరం ఇచ్చుకోను పుచ్చుకోను, సంస్కారముంటే, స్వార్ధం లేదు కదా? మరి మనకు మనశ్శాన్తి కావాలంటే, పిరికివాడు కారాదు, సాధనలో అడుగు ముందుకు వెయ్యాలి. మరి ప్రయత్నము మొదలు పెడదామా?
Parody
మనిషికో స్నేహం, మనసుకో ధ్యేయం 2
లేనిదే జీవం లేదు.., జీవితం కానేకాదు..
సమతనే మధువు లేనిదే.., చే.దు ||మనిషికో స్నేహం||
మన మనసు.. ఒద్దికైంది.., మరు సాధన.. మచ్చికైంది..
బ్రమలేమో.. మరిచింది.., మనసొకటై.. కలిసింది..
కట్టగట్టి ఆపాలన్నా, గంగ పొంగులాగేనా.
ప్రేమలేని నాడీ నేల, పూవులిన్ని పూచేనా..
మనిషిలేని నా..డు, దేవుడైనా లే..డు
మంచిని, కాచే వాడు, దేవుడికి తో.డు ||మనిషికో స్నేహం||
మనసు ధ్యానం.. తెలుసుకుంటే, పూరి గుడిసె.. రాచనగరు...
ఇచ్చుకోను ..పుచ్చుకోను.., సంస్కారముంటే.. స్వార్ధం లేదు
శాంతి నీకు కావాలంటే, పిరికివాడు కారాదు..
గువ్వ గూడు కట్టే చోట, కుంపటెత్తి పోరాదు..
ఓర్వలేని సం.ఘం, ఒప్పుకోదు నే.స్తం
జాతి మత భేదాలన్నీ, స్వార్థపరుల మోసం ||మనిషికో స్నేహం||
Original
మనిషికో స్నేహం, మనసుకో దాహం 2
లేనిదే జీవం లేదు, జీవితం కానేకాదు
మమతనే మధువు లేనిదే.., చే.దు ||మనిషికో స్నేహం||
ఒక చిలక.. ఒద్దికైంది, మరు చిలక.. మచ్చికైంది
వయసేమో.. మరిచింది.., మనసొకటై.. కలిసింది..
కట్టగట్టి ఆపాలన్నా, గంగ పొంగులాగేనా.
ప్రేమలేని నాడీ నేల, పూవులిన్ని పూచేనా..
మనిషిలేని నా.డు, దేవుడైనా లే.డు
మంచిని, కాచే వాడు, దేవుడికి తో.డు ||మనిషికో స్నేహం||
వయసు వయసు కలుసుకుంటే, పూరి గుడిసె రాచనగరు...
ఇచ్చుకోను ..పుచ్చుకోను.., ముద్దులుంటే.. పొద్దుచాలదు
ప్రేమ నీకు కావాలంటే, పిరికివాడు కారాదు..
గువ్వ గూడు కట్టే చోట, కుంపటెత్తి పోరాదు..
ఓర్వలేని సం.ఘం, ఒప్పుకోదు నే.స్తం
జాతి మత భేదాలన్నీ, స్వార్థపరుల మోసం ||మనిషికో స్నేహం||
Ilaiyaraaja, S. Janaki, S. P. Balasubrahmanyam
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,166; 104 తత్వాలు (Tatvaalu) and views 226,464
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments