మనసే నైవేద్యముగా పెట్టిన, భక్త కన్నప్ప - శివ శివ శంకర - కృష్ణం రాజు, వాణిశ్రీ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1545 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1580 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

గతములో కన్నడ రాజకుమార్ నటించిన, పాత చిత్రం కాళహస్తి మహాత్యం పాటలు మనసారా పాడుకున్నాము. ఇప్పుడు, ఆ శివయ్య పై, నాటి కొత్త తరం నాయకుడు క్రిష్ణం రాజు, కన్నప్ప గా నటించిన రంగుల చిత్రము లో పాట పాడుకుందాము.

చదువుకున్న వారికి, సంస్కారం గల వారికి, నీతి నియమాలు, పద్దతి, సాంప్రదాయం, విధి విధానాలు చెప్పబడ్డాయి.

కానీ చదువు రాని వారికి, మనసే నైవేద్యముగా పెట్టిన వారికి, ఎటువంటి విధానాలు పద్దతి అవసరము లేదు, పాటలు పద్యాలు కూడా అవసరము లేదు. మానసిక భక్తి మాత్రమే ముఖ్యము.

పిల్లలు మన గుండెలపై కొడితే, నవ్వు కుంటాము, కోపము రాదు కదా, దేవునికి అంతే వీరి విషయములో.

ఎందుకంటే, వీరికి కపటము ఉండదు, స్వచ్చమైన మనసు, ఇతరుల కోసం మరియు దేవుని కోసము తమ కన్ను అయినా తీసి ఇస్తారు ఆలోచన లేకుండా. కాలు సివలింగము మీద పెట్టి గుర్తుకు, తన కళ్ళు తీసి, శివునకు అర్పించారు.

శివుడినే అడుగుతున్నారు చూడండి పాటలు, ఏమీ తెలియని నేను, ఏమి తెచ్చి పూజ చేయాలి అని. ఏమి సేవలు చేయాలి అని. మారేడు దళాలు తేవాలా, గంగ నీరు తీసుకుని రావాలా అని అడుగుతున్నారు. అవి అన్ని, అడివిలో వారికి ఉచితము గా దొరుకుతాయి. వాటికే శివుడు వచ్చారు.

మరి మనము 5 వంటకాలతో నైవేద్యం పెట్టి, 1 గంట అష్టోత్తరము చదివి, 100 మందికి భోజనము పెట్టినా, మనకు శివుడు కనపడరు. ఎందుకంటే, ముఖ్యమైన మనసు శుద్ది లేదు కాబట్టి. మనము ప్రాపంచిక సుఖాలకు, అరిషడ్వర్గాలకు, అష్ట వ్యసనాలకు బానిసలము. కాబట్టి, దేవుడు కనపడరు.

కాబట్టి, దేవుడు లేడు అంటారు. మనము వెళ్ళనంత మాత్రాన, చూడనంత మాత్రాన, గురు గ్రహము లేదు అంటే ఎలా?

శివ శివ శంకర, భక్తవ శంకర
శంభో.. హరహర, నమో నమో - 2

పున్నెము పాపము, ఎరుగని నేను.
పూజలు సేవలు., తెలియని నేను. - 2
ఏ పూలు తేవాలి, నీ పూజకు 2
ఏ లీల చేయాలి, నీ సేవలు.. ||శివ శివ శంకర||

మారేడు నీవని, ఏరేరి తేనా
మారేడు దళములు, నీ పూజకు - 2
గంగమ్మ మెచ్చిన, జంగమయ్యవని.. 2
గంగను తేనా, నీ సేవకూ.. ||శివ శివ శంకర||

manase naivedyamugaa pettina bhakta kannappa siva siva sankara krishnam raju vanisri
Bhakta Kannappa Songs - Shiva Shiva Sankara - Krishnam Raju - Vanisree
భక్త కన్నప్ప పాటలు - శివ శివ శంకర - కృష్ణం రాజు - వాణిశ్రీ  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1580 General Articles, 54 Tatvaalu
Dt : 11-Sep-2022, Upd Dt : 11-Sep-2022, Category : Songs
Views : 63 ( + More Social Media views ), Id : 1512 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : manase , naivedyamu , bhakta , kannappa , siva , sankara , krishnam , raju , vanisri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content