Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
2 min read time.
మంచి చదువు చెప్పించి, పెద్ద నగరాలు లేదా విదేశాలు పంపిన తల్లి దండ్రిని అలాగే గతం మరచేవారు, అరిషడ్వర్గాలలో మునిగి ఓలలాడే వారు ఒకరైతే, ఆ కన్న తల్లి తండ్రి క్షేమం బంధం కోసం ఆరాటపడే వారు ఇంకోకరు.
ఆ రెండో కోవకు చెందిన, వ్యక్తి ది ఈ పాట. కన్న తల్లి కోసం వెతుకుతూ, వెళ్ళాడు, తన బాధ వెళ్ళపోసుకున్నాడు.
మంచి వారైన, రెబెల్ స్టార్ క్రిష్ణం రాజు గారికి సద్గతి కలగాలని ఆశిస్తూ, ఈ మన గొంతు పాట వారికి అంకితం.
తల్లి లేని, పిల్లల బాధ ఎలా ఉంటుందో, ఈ పాటలో చూడవచ్చు. కాకపోతే ఇక్కడ, ఇద్దరు తల్లులు ఉన్నారు. జీవం పెంచిన తల్లి, ప్రాణం పంచిన తల్లి. అంటే మన క్రిష్ణయ్య కధ లాగా - పెంచిన యశోదమ్మ, జన్మనిచ్చిన దేవకమ్మ.
కానీ ఈపాట ఆరోజుల్లో, 1981, చాలా ఫేమస్. పదాల అర్ధం జాగ్రత్త గా చూడండి. మన బాధలను, కాశీ విశ్వనాధుడి విశాలాక్షి అమ్మ వారికి పంచి, ఆయన నే సాక్షిగా చెప్పారు పెట్టారు పాటలో. పూర్తి సినిమా కూడా ఉంది చూడండి.
కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా
నువ్వే తండ్రివైతే నా తల్లే విశాలక్షీ
నువ్వే నాకు సాక్షీ.. కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా
కడుపునవుండి కాలదన్నితే జన్మము ఇచ్చింది, కాళ్ళమీదపడి తల్లీ అంటే కాదు పొమ్మంది 2
పేగును తెంచిన అదే త్యాగం పేమను తుంచిందా
అది అంతరాత్మనే నులిమేసిందా, ఇక సత్యమన్నదే కరువవుతుందా 2 ||కాశీ విశ్వనాధా||
దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి బిక్షా, అన్నెంపున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ బిక్షా
ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డకు ఇది అగ్నిపరిక్ష
ఒడి చేర్చుకోవా అమ్మా నన్ను, గుడిలోని తండ్రే మనకు తీర్పు 2 ||కాశీ విశ్వనాధా||
శంభో మహాదేవ హరహర శంభో మహాదేవ 2
కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,838,043; 104 తత్వాలు (Tatvaalu) and views 221,657
Dt : 24-Mar-2021, Upd Dt : 11-Sep-2022, Category : Songs
Views : 1264
( + More Social Media views ), Id : 1050
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
kasi ,
kashi ,
vishwanatha ,
tandri ,
amma ,
pulibidda ,
movie ,
krishnam raju
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments