Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
చాలా మంది విదేశాల గురించి, ఏమౌతుందో అని భయపడుతున్నారు. కానీ, ముందు భయపడాల్సింది మన గురించి, మన దేశం గురించి, మన పరిస్థితుల గురించి.
విదేశాల్లో వైద్య సదుపాయాలు ఉన్నాయి. మంచి వైద్యులు, పోలీసులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ప్రెసిడెంట్ లు ఉన్నారు. విదేశాలలో, అన్ని పారదర్శకంగా జరుగుతాయి కాబట్టి, వెంటనే కంప్యూటర్ లో లెక్కలు తేలతాయి. ఆ లెక్కలు ప్రకారం, వెంటనే జాగ్రత్తలు తీసుకుంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కూడా, జనమునకు ఇబ్బంది అవుతుంది, మరణాలు తప్పడము లేదు.
ఉదాహరణకు, అమెరికా అధ్యక్షుడు కు ఇంకో దేశంలో, మందు ఉంది అని తెలిస్తే, నయానో భయానో, అది తన ప్రజలకు అందే ఏర్పాటు చేస్తారు వెంటనే. దేనికైనా వెనుకాడరు, ఎందుకంటే, తన బాధ్యత, తన ప్రజల రక్షణ. ఆ తర్వాత విషయము, చేసింది తప్పా ఒప్పా అనేది.
ప్రజలకు వెంటనే ఈ నెలకు, ఎకౌంట్ లో పడేటట్టు గా తక్కువ లో ఒకరికి వెయ్యి డాలర్లు పైగా, అంటే షుమారు 70 వేల రూపాయలు పైగా, ఇస్తున్నారు. ఒక రాష్ట్రంలో డాక్టర్లు తక్కువగా ఉంటే పక్కన రాష్ట్రం నుంచి పిలిచారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పంచాయతీ, మున్సిపల్, పోలీసులు అందరూ దగ్గర ఊళ్లో ఉండి లేదా ఫోన్, ఈమెయిలు, ఫేస్బుక్ ద్వారా జాగ్రత్తలు చెపుతారు.
ఇప్పుడు మనము ఫోన్ చేసినా, ఎవరో ఒకరు జవాబు చెపుతారు వెంటనే. కేంద్రం తో పోరాడతారు, అసలు కేంద్ర మే ముందు ఉంటుంది సహాయం లో, రాష్ట్రాలను గట్టిగా చేయమని ఒత్తిడి చేస్తుంది. ప్రవేటు ఆసుపత్రిలు అన్ని తెరచి అందుబాటులో ఉన్నాయి. హోటళ్లు ను ఆసుపత్రి గా మార్చారు. ఇంకా ఎన్నో జాగ్రత్తలు వెంట వెంటనే. ఇక్కడ కూడా అజాగ్రత్తగా తిరిగే వారూ ఉంటారు కదా, వారి సంఖ్యలు మ్నము వింటున్నాము.
మరి మన దగ్గర పరిస్థితి ఏమిటి? మన లెక్కలు సరిగ్గా బయటకు వస్తాయా? ఎంతమంది ఎయిర్ పోర్టులో దిగారో లెక్క తేల లేదు, అందరూ దొరకలేదు, ఎక్కడ ఉన్నారో తెలీదు. పెద్ద నగరాల నుంచి, ఊళ్ళో దిగిన, మనుషులు లెక్క తెలియదు, వారిలో ఎంత మందికి కరోనా వచ్చిందో తెలీదు.
కనీసం మన ఎమ్మెల్యే, మన నాయకులు, ప్రతి పక్ష నాయకులు కూడా మన ఊరు లేదా రాష్ట్రంలో ఉన్నారా జనంతో? తెలీదు. మనం ఫోన్ చేస్తే ఎత్తి పలకరిస్తారా? వారి ఫోన్, ఈమయిల్, ఫేస్బుక్, మన కోసం ఘోషిస్తాయా? కనీసం మన మండల పోలీసులు కు ఫేస్బుక్ పేజీ లేదు, లోకల్ గా ఏమి జరుగుతుందో చెపడానికి.
మన బజారు లో, ఓ చిన్న ఆరెంపీ డాక్టర్ దగ్గరకు, జ్వరం దగ్గు జలుబు తో వెళితే, అవి ప్రభుత్వం కు తెలియవు. మనం తొందరగా బయటకు చెప్పము. మొన్న ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి సంగతి ఎప్పుడు తెలిసింది? లేటుగా మాత్రమే.
అలాగే మన పక్కన ఉన్న, వారికి ఉన్నా, చెప్పరు కదా. ఎన్ని కేసులు బయటపడిందాక, పక్కన జనం కు కూడా తెలియదు. కరెక్టు నంబర్ పదివేలు అని చెపితే, ప్రతి పక్షాలు అన్ని విరుచుకుపడతాయి, ప్రభుత్వం విఫలమైందని కట్టడి చేయలేక అని.
ఒకేసారి అందరికీ బయట పడితే, మనకు రక్షణ ఎవరు? అంత ఆరోగ్య లేదా రక్షణ వ్యవస్థ ఉందా మనకు? బయటకు రా వద్దు అని ప్రభుత్వం మొత్తుకుంటున్నా కూడా, రోడ్లు మీద జనం లేరా?
వింటున్నారా మాస్క్లు గ్లౌజులు, 6 అడుగు ల దూరం అంటే? షాపు లు రేషన్ దగ్గర గుమికూడటం లేదా? ఆలోచన చెయ్యండి, బయటకు రావద్దు, ఎవరినీ తాకవద్దు. ఆరోగ్యం జాగ్రత్తలు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,604; 104 తత్వాలు (Tatvaalu) and views 226,093
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments