ఆ పిచ్చి తల్లి, చేతులు కాళ్ళు కదలలేక, తన గోడు వినేవారు లేక, సొంత వాళ్ళే అలా నేలపై ఈడుస్తుంటే - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,370; 104 తత్వాలు (Tatvaalu) and views 226,158.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

ఇంత ఘోరమైన మనుషులు కూడా ఉన్నారా? సమాజంలో ఏరుదాటాక తెప్ప తగలేసే వారు, ఉన్నారు, కానీ సొంత తల్లిని లేదా బామ్మను? పిచ్చి తల్లి బామ్మ ని ట్రాక్టర్ ముందుకు ఈడుస్తున్న బంధువులును వీడియోలో చూడండి.

ప్రాణం లేని బియ్యం బస్తాను లాగినట్లు గా, ఎత్తి కుదేసినట్లు గా, బయట ఎవరో ముక్కు మొఖం తెలియని అనాధను ఈడ్చి నట్టుగా, 7 గురు రాతి గుండె కలిగిన కర్కశ కఠినాత్మక మనుషులు చూస్తుండగానే, పదిమందికి తెలిసే వీడియో సాక్ష్యం తో ఇలా చేస్తున్నారు అంటే, ఎంత ధైర్యం?

ఎంత కృతజ్ఞత, జాలి, దయ, దైవ పాప భీతి?

ఆ పిచ్చి తల్లి, చేతులు కాళ్ళు కదలలేక, తన గోడు వినేవారు లేక, సొంత వాళ్ళే అలా నేలపై ఈడుస్తుంటే, ఏమి చెప్పాలో ఎవరికి చెప్పాలో తెలీక అయోమయంలో,

ఈ రాక్షస సంతానానికా ఇన్నాళ్లు నేను ఊడిగం చేసింది, అంటూ పొంగుకు వస్తున్న ఇంకిపోయిన కన్నీళ్లు తో, లోలోపలే దీనంగా, రోదిస్తూ ఉన్నది కదూ?

మనము ఎక్కడనో ఉండి, మన సోదరులు సోదరీమణులు, మన తల్లి దండ్రులను చూస్తారు అంటే, ఇదే గదా?

అమ్మ కు, నాకు ఆ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు. మనకే, ఇలా ఇప్పుడే జరుగుతుంది, అన్నంత బాధ గా ఉంది.

ఇటువంటి ఉత్తమ సమాజంలో, మన వంశాలను, తర్వాత తరాలను వదులుతూ ఉన్నాము, మనమూ అదే పని చేస్తూ లేదా సరదాగా గమ్ముగా చూస్తూ, మనకెందుకులే, మనల్ని అలా చేయరులే అన్న మూర్ఖత్వము తో.

ఓపిక ఉన్నప్పుడు నటనల ప్రేమలు వేరు, కర్ర పట్టుకుని మంచంమీద ఉన్నప్పుడు ప్రేమలు వేరు.

పాములను రాక్షసులను పెంచిన పాపం, ఎవరినీ వదలదు సుమా.

ఇవే డబ్బులు ఆస్తి బయట వారికి ఇచ్చిన కూడా, వారు ఒకవేళ ఇలాగే చేస్తే, మన కడుపు న పుట్టలేదు మనం సేవ చేయలేదు లే 50 ఏళ్లుగా, ఏం చేస్తాం ఖర్మ, అని సర్ది చెప్పుకుంటాం మనసులో. అది ఓ 1000 రూపాయల బాధ అనుకుందాం ఉదాహరణకు, జనానికి డబ్బులోనే అర్ధము అవుతుంది కాబట్టి.

కానీ నవ మాసాలు మోసి, లక్షలు ఖర్చుపెట్టి చదువు సంధ్యలు చెప్పించి, కట్నం తో పెళ్లి చేయించి, ఉత్తమ సంస్కారం లేని పనికిరాని కూతురు కొడుకు ను పెంచితే, ఉన్న ఆస్తులు పంచితే, వాళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత, ఒట్టిపోయిన గొడ్డు ను, ఈడ్చిన విధంగా, బయట లేదా దూరంగా వదిలేస్తుంటే,

ఆ సంతానం లేదా మిగిలిన సంతానం హాయిగా, ఉన్న ఊళ్ళో, బెంగుళూరు వంటి మహానగరాలలో, లేదా అమెరికా లాంటి విదేశాల్లో ఆనందంగా గడుపుతూ ఉంటే, ఆ కన్నతల్లి దండ్రుల గుండెకోత కు అంతు ఉండదు. అది లక్షల రూపాయల బాధ ఉదాహరణ లో.

ఎవరు ఎవరి సంస్కారం మార్చాలి, ఎవరు మారాలి? మనమా లేదా మన తల్లి దండ్రులా లేదా మన సంతానమా? మనం మారందే మన సమాజం ఎలా మారుతుంది?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,370; 104 తత్వాలు (Tatvaalu) and views 226,158
Dt : 16-Jun-2021, Upd Dt : 16-Jun-2021, Category : General
Views : 754 ( + More Social Media views ), Id : 1207 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mom , mother , arms , legs , pain , relatives , son , daughter
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content