ఎవరబ్బ సొమ్మని ఆస్తులని, కుటుంబ పేర్ల పిచ్చితో, పో(కా)ట్లాడుకుంటున్న నాయకులు? ఓటరు ప్రశ్న - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1545 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1580 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* గతించిన నాయకులకు, ఎందుకు ఈ తలనొప్పి, పాప భారం?
* స్వచ్చందముగా, రాజకీయ నాయకుల పేర్లు అన్ని తీసేయలేమా?
* అది వదిలేసి, తల్లి ఎందుకు కొట్టింది, పిల్లాడు ఎందుకు ఏడ్చాడు?
* చంద్రన్న చేయూత జగనన్న చేయూత గా, లాంటి పధకాలకు పేర్లు
* ముందు ఈ జబ్బు మొదలు పెట్టినవారికా లేక మార్చిన వారికా?
* మిగతావి కూడా మారుస్తారు, మరలా కోర్ట్, మరలా?
* కొత్త కుర్రాడు పోనీలే అనుకుంటే, ఇన్నిసార్లు చేసిన ఆ పిచ్చి ఎందుకు?
* 50 పైన పధకాలకు పేర్లు పెట్టుకుని, తర్వాత ఎన్నికల్లో గెలిచారా?
* పాము, పులినే మనకు నిజమైన నేస్తాలు
1 min read time.

*ఎవరబ్బ సొమ్మని ఆస్తులని, కుటుంబ పేర్ల పిచ్చితో, పో(కా)ట్లాడుకుంటున్న నాయకులు? ధనం, వర్గం, అవకాశం, అవసరం కు అమ్ముడుబోని ఓటరు ప్రశ్న*

రామయ్య, సోమయ్య రచ్చ బండ దగ్గర చుట్ట కాలుస్తూ, మాట్లాడుకుంటున్నారు.

* రామయ్య - సోమయ్య, 10 రూపాయలు దొంగతనము చేసాడు అని తల్లి, పిల్లాడిని రోడ్ మీద కొడుతుంది, వాడు ఏడుస్తున్నాడు. ఇప్పుడు మీడియా, ఓటరులు మరియు పార్టీ పిచ్చి జనం, మాట్లాడాల్సింది దేని గురించి? తల్లి కొట్టడం గురించా? లేక పిల్లాడు ఏడవడం గురించా లేక అసలు విషయం గురించా?

* సోమయ్య - ఆ 2 కాదు కదా, చర్చ 10 రూపాయల దొంగతనము గురించి జరగాలి. అసలు ఎందుకు దొంగతనము చేసాడు, ఆ తప్పుడు బుద్ది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు దిగజారిపోయాడు అనే కదా? అది వదిలేసి, తల్లి ఎందుకు కొట్టింది, పిల్లాడు ఎందుకు ఎలా ఏడ్చాడు గురించి చేసేవాడు, పనికిమాలిన వాడు, ఖచ్చితముగా మన తెలుగు ఓటరు లాంటి వాడు.

* రామయ్య - భలే, భలే. మూలం ఆలోచన చెయ్యాలి అంతేనా? ఉదాహరణకు రామన్న ఆరోగ్యశ్రీ రాజన్న ఆరోగ్యశ్రీ గా, చంద్రన్న చేయూత జగనన్న చేయూత గా, లాంటి పధకాలకు పేర్లు మారినప్పుడు, ఈ పెడ బొబ్బలు ఏవి?

మరి యూనివర్సిటీ కి లేదా ఇంకో 10 కి, పేరు మారిస్తే, ఎందుకు ఏడుపు?

అసలు ముందు మీరు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు వారు ఎందుకు మార్చాలి? అంటే మీకిష్టమైన వారి పేరు మీరు పెట్టుకుంటే, వాళ్ళకు ఇష్టమైన వారి పేరు వారూ పెట్టుకుంటారు కదా? ఇంక ఏడుపులు ఆర్తనాదాలు ఎందుకు?

నీతి నియమం సంస్కారం ఎవరికి ఉంది ఇక్కడ, ముందు ఈ జబ్బు మొదలు పెట్టినవారికా లేక మార్చిన వారికా? పెట్టడానికి మీకెన్ని కారణాలు ఉన్నాయో, మార్చడానికి వారికి అన్ని ఉంటాయి కదా?

వీరు, వారు కోర్టుకు వెళతారు. ఏదో తీర్పు వస్తుంది. మిగతావి కూడా మారుస్తారు, మరలా కోర్ట్, మరలా మార్పు. ఇదేగా వీరు చేసే, ప్రజాసేవ? అభివ్రుద్ది సంగతి ఎవరికి అవసరము లేదు.

అసలు రాజకీయనాయకుల పేర్లు ఎందుకు పెట్టాలి? వారి జేబులో డబ్బులు తీసి, ప్రజల కోసం మిద్దెలు కట్టారా? పోనీ వారి ఆస్తులు పోగొట్టుకున్నారా? త్యాగాలు చేసారా? ఎన్నికల అఫ్ఫిడవిట్ లో ఆస్తులు కోట్లు పెరుగుతున్నాయి కదా? ఇంకా చెప్పలేనంత నల్లధనం, బినామీలు, ఇతర రాష్ట్ర దేశ ఆస్తులు?

ఊళ్ళోళ్ళ సొమ్ముకు, వీళ్ళ పేర్లు ఎందుకు? కనీసం సిగ్గు గా అనిపించదా? జిల్లాలకు, పధకాలకు, మిగతా వాటికి? పేర్లు పెట్టడం లో రిజర్వేషన్ లేదా, బీసీలు ఎస్సీ ఎస్టీలకు? అని గతములోనే కధనము రాశాము.

ఎందుకు అనవసరముగా పై లోకము లో ఉన్న గతించిన నాయకులకు, ఈ తలనొప్పి, పాప భారం పెంచుతారు, వారి పేర్లు పెట్టి, ఇతరులతో ఇంకా తిట్టిస్తూ. పోయాక కూడా, వారిని మనశ్శాంతి గా ఉంచరా? స్వచ్చందముగా, రాజకీయ నాయకుల పేర్లు అన్ని తీసేయలేమా? అంత సంస్కారం నాయకులకు, ఓటర్లకు లేదా? వీరి పిల్లలకు నేర్పే సంస్కారం ఇదేనా, పక్క వారి ధన పధకాలకు, మన పేర్లు పెట్టుకుని శునకానందము పొందడమే, గౌరవమా?

ఆ పేర్ల పిచ్చి కేసీయారు కు లేదే. ఎందుకు చంద్రన్న, జగనన్నకు వచ్చింది, ఎందుకు మైకము లో ఉన్నారు? కొత్త కుర్రాడు జగనన్న పోనీలే అనుకుంటే, ఇన్నిసార్లు చేసిన చంద్రన్న కు ఆ పిచ్చి ఎందుకు? తన ఇంటి గుమ్మానికి, గదులకు, పొలానికి, ఆస్తులకు, రామన్న పొలము అని పెట్టుకోవచ్చు కదా? పోనీ తన పేరు రామచంద్ర గా మార్చుకోవచ్చు కదా?

పోనీ చంద్రన్న 50 పైన పధకాలకు పేర్లు పెట్టుకుని, తర్వాత ఎన్నికల్లో గెలిచారా? 50 సీట్లు కూడా రాలేదు కదా, 23? మరి దేని గురించి పేరు మార్పులు? దేని గురించి కన్నీళ్ళు కంఠశోష?

ఎవరికి నీతి ఉంది ఇద్దరిలో, మీడియాలో, జనములో? పేరు మార్చడమే జగనన్న తప్పు అయితే, అసలు రామన్ననే మార్చిన వారిని, చెప్పులు వేసిన వారిని, అవమానముతో కుంగి క్రుశింపచేసి పతనము చేసిన వారిని, ఏమి అనాలి?

* సోమయ్య - నిజమే రామయ్య, పేరు మార్చినందుకే గొడవ పెడితే, అసలు రామన్న ను మార్చిన వారిని, అవమానించిన వారిని, పతనము చేసిన వారిని, మాత్రం ఏమీ అనము. దొంగే, దొంగా దొంగా అని అరిచినట్లు గా ఉంది. వారిని గౌరవించి సీయెం గా కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు వత్తుతూ, పిల్లను కొడుకు కు ఇచ్చి పెళ్ళి చేసి, పిచ్చివారు అనే సర్టిఫికెట్ పొంది, వారికి అండగా ఉండాలి, అది మన తెలుగు వారి నీతి నియమము.

మన పతనము అవుతున్న విలువలకు అద్దము పడుతుంది. అందరమూ దొంగలమే, మొదటి దొంగ అమ్ముడుబోయిన ఓటరు, తన కొమ్మ తానే నరుక్కుంటూ, తన పిల్లలు ఇలాంటి చిల్లర పనుల గురించి ఆనందముగా మీడియాలో వింటూ, తానూ అలాగే చెడిపోవడానికి ఈ ఓటరు, తన లాంటి తప్పుడు బుద్ది వారినే ఎన్నుకుంటున్నారు.

పాము, పులినే మనకు నిజమైన నేస్తాలు సంస్కారం జీవితం పతన దిశలో అని ఇద్దరూ నవ్వుకుంటూ నిద్రకు వెళ్ళారు.

evarabba sommani aastulani, kutumba perla pichchitoa kaatladukuntunna nayakulu dhanam vargam avakasam avasaram ku ammuduboni otaru prasna  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1580 General Articles, 54 Tatvaalu
Dt : 21-Sep-2022, Upd Dt : 21-Sep-2022, Category : Politics
Views : 66 ( + More Social Media views ), Id : 1525 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sommu , astulu , kutumba , perla , pichchi , govt , schemes , family names , andhra , leaders , jagan , chandranna , nayakulu , voter , otaru , prasna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content