పాటతో పరమార్ధం - దిగు దిగు దిగు నాగ నాగన్న, దివ్యా సుందర నాగో నాగన్న - నాగేంద్ర స్వామి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,942; 104 తత్వాలు (Tatvaalu) and views 226,369.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Digu Digu Digu Naaga - Lord Nagaraja

నాగ పంచమి లేదా నాగుల చవితి కి, అందరమూ భక్తి తో నాగ రాజు, నాగ దేవతలకు పూజలు చేస్తాము. తోటి ప్రాణులకు విలువ ఇచ్చి గౌరవించడము, మన సాంప్రదాయము లో ఉన్నది.

శ్రావణ మాసంలోని పూరీ పంచమి రోజును ప్రతి సంవత్సరం నాగ పంచమి అంటారు. బ్రహ్మ దేవుడు ఆదిశేషుడిని ఆశీర్వదించిన రోజు అన్నమాట. నాగ పంచమి రోజున, నాగదేవుడిని పూజించే వారికి ఏడాది పొడవునా అన్ని పనులు చక్కగా జరుగుతాయి. అంతా సానుకూలంగా ఉంది.

చల్లని చీమల నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు, రాతి-రప్ప, చెట్టు-చెమ, ధార-వరద, నీరు-అగ్నిలో దైవత్వాన్ని చూసే, హిందువుల ప్రత్యేక సంస్కృతి ఉంది. హిందువుల దృష్టిలో, పాము కూడా ఒక దివ్య రూపం.

శివుని మెడలో, విష్ణువు శయనము గా, అలాగే వినాయకునికి ఇలా ఎన్నో రూపాలలో, మనకు నాగ దేవతలు దర్శనము ఇస్తారు. పాములతో చాలా లాభాలు ఉన్నాయి.

విషాణి తస్య నశ్యంతి న టాం హింసంతి పన్నగాః
న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్
- అనే మంత్రాన్ని స్మరిస్తూ పుట్టలో పాలు పోయాలి.

కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు.

మనము, పాముకు విషము ఉన్నది అని అనుకుంటాము. కానీ మనిషికి నిలువెల్లా ఘోరమైన విషమే. అంటే నాగరాజుల కన్నా, ఎన్నో రెట్లు ప్రమాదకరమైన విషపు ఆలోచనల మనుషులు, మన చుట్టూరా ఉన్నారు, అలాగే మన ఇంట్లో నూ ఉన్నారు.

చిత్రము ఏమిటి అంటే, మనము తప్ప మిగతా వారివే, విషపు ఆలోచనలు అంటారు, అనుకుంటారు, బ్రమలలో, మాయలో, మత్తులో. వారి గుణానికి అణుగుణముగా, నక్క పులి పాముల మనస్తత్వాలకు ఓటేసి, వారి చేతిలో పతనము అవుతున్నారు. ఎవరు తీసిన గోతిలో వారే పడాలి కద.

వారి అన్ని ప్రయత్నాలు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో, తమను కాల రాసుకుంటూ, తమ కుటుంబాని కి సమాజానికి చేటు చేస్తూ, చివరకు కలియుగ అంతానికి తీసుకుని వెళతారు.

భజనలలో ఈ పాట ఎక్కువగా వినిపిస్తుంది. బహుశా మీకు వచ్చే ఉంటుంది ఈ పాట, మరి పాడి అందరికీ వినిపిస్తారు కదూ?

దిగు దిగు దిగు నాగ నాగన్న, దివ్యా సుందర నాగో నాగన్న ||
దిగు దిగు నాగ నాగన్న, దివ్యా సుందర నాగో నాగన్న || ||2 సార్లు||

ఇల్లల్లికి ముగ్గు పెట్టి నాగన్న, ఇంటా మల్లెలు జల్లి నాగన్న
మల్లెల వాసన తొ నాగన్న, కోలాట మాడి పోవా నాగన్న || దిగు దిగు

భామా లంత చేరి నాగన్న, బావీ నీళ్ళ కెళితే నాగన్న
బా.విలొ ఉన్నావా నాగన్న, బాలా నాగు వయ్యో నాగన్న ||దిగు దిగు

పిల్లాలంత చేరి నాగన్న, పుల్లాలేర బోతె నాగన్న
పుల్లలొ ఉన్నావా. నాగన్న, పసి నాగు వయ్యో నాగన్న ||దిగు దిగు

స్వామూలంత చేరి నాగన్న, రేవు నీళ్ళ కెళితే నాగన్న
రేవులొ ఉన్నావా నాగన్న, ఆది నాగు వయ్యో నాగన్న ||దిగు దిగు

అటుకొండ ఇటుకొండ నాగన్న, నడుమ నాగుల కొండా నాగన్న
కొండలో వున్నావ నాగన్న, కోడె నాగు వయ్యో నాగన్న ||దిగు దిగు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,942; 104 తత్వాలు (Tatvaalu) and views 226,369
Dt : 18-Aug-2023, Upd Dt : 18-Aug-2023, Category : Songs
Views : 261 ( + More Social Media views ), Id : 1881 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Digu , Naaga , Devotional , Song , Lord , Nagaraja , naga , panchami , nagula , chaviti
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content