వేటపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బందికి చీరాల డీఎస్పీ గారిచే రేషన్ పంపిణి కార్యక్రమం - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,875,230; 104 తత్వాలు (Tatvaalu) and views 225,744.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

కరోనా కోవిడ్ 19 లో భాగంగా, మార్చి 23 నుండి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి, వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధి లోని, ప్రజల కదలికలను నిలువరించుటకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటూ, విధులు నిర్వర్తిస్తూ ఉన్న వేటపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బందిని, ఈ రోజు చీరాల డీఎస్పీ వై. జయ రామ సుబ్బా రెడ్డి గారు, వేటపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించి లాక్ డౌన్ అమలు తీరును పరిశిలించి, నియమాలు ఖచ్చితంగా అమలు జరుగుటకు, పలు సూచనలతో కూడిన ఆదేశాలను జారి చేసారు.

అలానే ప్రజలందరూ కూడా స్వచ్చంధముగా, స్వీయ క్రమ శిక్షణతో, పోలిస్ కు సహకరించి, మే 3 వరకు ఇండ్ల కే పరిమితం కావాలని కోరారు. గత 25 రోజులుగా కుటుంబాలకు దూరంగా ఉంటూ, 24 గంటలు లాక్ డౌన్ విధులలో పాల్గొంటున్న, వేటపాలెం పోలీస్ సిబ్బంది, హోంగౌర్డ్ నుండి ఏఎస్సై స్ధాయి వరకు మరియు గ్రామ మహిళా పోలీస్ సిబ్బందికి, మొత్తం 55 మందికి ఒక్కొకరికి 25 కిలోల బియ్యం, 1 కేజీ కంది పప్పు, ఒక పాకెట్ వంట నూనె, రెండు కేజీల ఉల్లి పాయలు మరియు కూరగాయలను అందచేసారు.

ఈ కార్యక్రమంలో చీరాల రూరల్ సీఐ వెంకటేశ్వర్లు మరియు వేటపాలెం ఎస్సై అజయ్ బాబు గారు పాల్గొన్నారు. డీఎస్పీ గారు సమావేశంలో మాట్లాడుతూ, సహకరించిన దాతలు అందరిని అభినందిన్చినారు.  
Photo/ Video/ Text Credit : Koti Veeraiah Ch., Vetapalem
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,230; 104 తత్వాలు (Tatvaalu) and views 225,744
Dt : 20-Apr-2020, Upd Dt : 20-Apr-2020, Category : News
Views : 1147 ( + More Social Media views ), Id : 509 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Distributed essential commodities , Chirala DSP , Vetapalem SI , Chirala Rural CI , rural CI

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content