ఆంధ్రా ప్రజల ఏకపక్ష గెలుపు తీర్పు - జయహో రాజన్న జగన్మోహనాస్త్రం - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,713; 104 తత్వాలు (Tatvaalu) and views 226,096.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మొదట గా కాబోయే ముఖ్యమంత్రి జగన్ గారికి మరియు వారి అభిమానులకు హ్రుదయపూర్వక అభినందనలు. మార్పు కావాలి, కొత్తదనం రావాలి, కొత్తపాలన చేయాలి. మండుటెండల్లో కూడా ఫాన్ గాలులు భారీగా వీచాయి. నేను చూసా, నేను విన్నా, నేను ఉన్నా - మాటలను జనం విశ్వసించారు. నవరత్నాల పాలను ను, జనం కోరుకున్నారు. ప్రజా తీర్పును గౌరవించాలి.

ఇది మామూలు యుద్దం కాదు, నరాలు తెగే ఉత్కంఠ, ఏమి అవుతుందో, ఏమి జరుగుతుందో ఎవరికీ నమ్మకం లేదు చివరిదాకా. ఎదురుగా 30 యేళ్ళు తెరమాటు రాజకీయాలలో పండిన అపర చాణక్యుడు. ఇంకో వైపు, పవన్ అభిమానుల కోలహలం. అన్నిటిని ఎదుర్కొని, భారీ మెజారిటీ సీట్లు సంపాదించి విజయమాలను వరించారు. ఎవరైనా దీనిని కాదనలేరు, భారీ ఊహించని విజయం.

ప్రజలు మార్పు కోరుకొని, తన మీద పెట్టిన ఆశలను తీరుస్తారు అని, నిజమైన రాజన్న వారసుడిగా, ఇంకా ఎక్కువ పేరు సంపాదిస్తారని ఆశిద్దాము.

జగనోదయం అలాగే చంద్రాస్తమయం. స్వయముగా బాబు చేసుకున్న స్వయంక్రుతాపరాధం. అనుభవజ్ణుడు అని జనం నమ్మి అవకాశం ఇస్తే, అభివ్రుద్ది అంతా గ్రాఫిక్స్ బొమ్మలతో ప్రజలను మత్తెక్కించారు అని అందరూ భావించారు. ఫలితం అనుభవించారు, ఘోరమైన పరాజయంతో అని అనుకుంటున్నారు. మోడీ ని అనవసరం గా తిడుతూ, సీబీయై ని నిషేదించడం చాలా మందికి నచ్చలేదు. ఇంకా ఎన్నో ఇలాంటి తప్పటడుగులు జిమ్మిక్కులు అని ప్రజల భావన.

పవన్ కల్యాన్ తప్పటడుగులు నష్టాన్ని తెచ్చాయి. సరియైన అవగాహన లేకుండా ముందుకి వెళితే ఫలితం ఎలా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ.

ఆంధ్రా ప్రజలకు కొత్త మార్పుతో అంతా మంచే జరుగుతుంది అని ఆశిద్దాము. జగన్ పై చాలా పెద్ద భారం ఉంది, గెలుపుతో బాధ్యతను మరువకుండా, అన్ని వర్గాల ప్రజలతో మరలా ఎన్నిక అయ్యెట్లు గా మంచి పాలన చేస్తారు అని ఆశిద్దాము. ఈ ఎన్నికలలో కులం కార్డు, పని చేయలేదు. అది విశేషము, అభిందనీయం.

పరీక్ష తప్పితే, ఇంకో సంవత్సరం ఉంటుంది, అని సర్దుకోలేము అవమానంలో మన సొంత పిల్ల వాడికి.

ఇందిర రాజీవ్ లేకుండా, రామన్న రాజన్న లేకుండా, దేశం తో పాటూ రాష్ట్రం కూడా ముందుకు పోయింది. ఎక్కడా ఆగదు, ఆగలేదు. మంచే ఆశిద్దాం.

ఇప్పుడు అయినా తప్పులు తెలుసుకుని , అవినీతి స్కాం లు లేకుండా , అందరినీ కలుపుకుని పోతే నే, మరలా అవకాశం వస్తుంది గెలిచిన లేదా ఓడినవారికి లేదా ఎవరికైనా. 175 Assembly Constituencies, 88 seats needed for a majority. 25 లోక్‌సభ స్థానాల్లో 22 వైఎస్సార్‌సీపీకే.

Party 2019 2014
YSRCP 151 67
TDP 23 102
JSP+ 1 0  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,713; 104 తత్వాలు (Tatvaalu) and views 226,096
Dt : 23-May-2019, Upd Dt : 23-May-2019, Category : Politics
Views : 1540 ( + More Social Media views ), Id : 120 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra cm , jagan , ysr congress party , pavan kalyan , ka paul , chandra babu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content