APLatestNews.com top Banner
         
మన లోనే పరమాత్మను చూడగలిగి నప్పుడు, బయట ఎందుకు వెతుకుతున్నాము - శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
గుడికి(ఏ పుణ్య క్షేత్రము అయినా) వెళ్ళటానికి డబ్బులు లేవు, వెళ్ళినా ఆ జనాన్ని తట్టుకోలేను. ఒక్క క్షణము కూడా చూడనివ్వరు. వెళ్ళకపొతే నేను ఏమైన పొగొట్టుకుంటానా? నాకు మార్గము చెప్పండి.

వేమన గారి మాట - శిలను ప్రతిమ జేసి చీకటింటను బెట్టి, మొక్క వలదికను మూఢులార, ఉల్లమందు బ్రహ్మముండుట తెలియుడీ, విశ్వదాభిరామ వినుర వేమ.

ప్రహ్లాద - ఇందు గలడు అందు లేడని, సందేహాంబు వలదు, చక్రి సర్వోపగతుండు , ఎందెందు వెదకి చూచిన అందందె గలడు…

మన లోనే పరమాత్మను చూడగలిగి నప్పుడు, బయట ఎందుకు వెతుకుతున్నాము. అన్నమయ్య, ప్రహ్లాదుడు, రామదాసు గుడికి వెళ్ళకుండానే తమలో భగవంతుని దర్శించారు. జంతు బలులు, ఉరెగింపులు చెయ్యలేదు. దైవం కోసము ఎంతో ఆరాట పడ్డారు. ఆ తర్వాతే గుడికి(ఏ పుణ్య క్షేత్రము అయినా) వెళ్ళారు. అవునా?

అలా అందరు చెస్తే ఎంత బాగుంటుందో? తిరుపతి, షిర్డి, మక్కా, వాటికన్ ల లో అప్పుడు నిజమైన జ్ఞాన భక్తులు మాత్రమే వుంటారు. చేదు దోసకాయను ఎన్ని గుడులు తిప్పిన, చేదు పొతుందా? ముందు నీలోని మలినాల్ని తొలగించి, పరిశుద్దుడివి కా. నీ ఆత్మ లొ నే దేవుడిని చూడొచ్చు.


Dt : 28-Aug-2017, Upd Dt : 21-May-2019 , Category : Devotional, Views : 847 ( id : 8 )
Tags :
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.