APLatestNews.com top Banner
         
కర్మ ను తప్పిచలేను. కాని తీవ్రత తగ్గించానా? - శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
దేవుని తో అమెరికా లో ఉన్న అమ్మ వాదన, దేవుడు అండగా ఉండి కష్టాలను తీసెయ్యలేదన్న బాధతో. ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత. ఇక్కద ఇచ్చింది వాస్తవ ఉదాహరణ, మీ జీవిత సంఘటనలతో అన్వయించుకొని అర్దము చేసుకోండి. అబద్ధం, నిజం, తత్వం, జ్ఞానం అన్ని ఉన్నాయి అందులో.

అమ్మ : అయ్యా, ఇలా యాక్సిడెంట్ చేయొచ్చా?

దేవుడు : మీ ఊరి నుంచి ఢిల్లీ, బొంబాయి అంత దూరం 110 కిమీ వేగంగా వెళ్లి వచ్చారు క్షేమంగా కారులో అమెరికా లో ఎన్నో సార్లు. కాపాడానా? ఇప్పుడు కూడా ఎటు వంటి గాయం, పెద్ద నష్టం లేదుగదా?

అమ్మ : అవును

దేవుడు : కర్మ ను తప్పిచలేను. కాని తీవ్రత తగ్గించానా? ఇబ్బంది లేకుండా చేసానా.

అమ్మ : అవును

దేవుడు : అమెరికా లో వైద్యం ఇప్పించానా, కొడుకు తో ఉంచి అన్ని సమకూర్చానా?

అమ్మ : అవును. మరి కొడుకు ను ఇలా వదిలేశావు

దేవుడు : కర్మ ను తప్పిచలేను. ఇబ్బంది లేకుండా చేసానా. అమెరికా లో అన్ని సమకూర్చి పెట్టానా. తోడు నిన్ను పెట్టానా. మీ ఊరి ఇబ్బందులకు దూరం గా ఉంచానా. ఇన్ని ఇస్తే నీ కొడుకు కు సిగరెట్, మాంసం, మందు, మత్తు లేవు. నేల పై పడుకుంటాడు. కోర్కెలు లేవంటాడు. యోగా, ద్యానం అంటాడు. వేప/కాకర/వెల్లుల్లి రసం, ఉప్పు/కారం తక్కువ అంటాడు. నన్ను ఒక్కటి అడగడు. మూర్కుడు. నేనేమి చేసేది. అడగ కుండా ఇస్తే, రేపు ఈ నరక కూపంలో పడేశానని, నన్నే నిందించడా. మాయలో చిక్కినపుడు, నన్ను అడుగుతాడు, ఇస్తాను. బాధలు మొదలయ్యాక నువ్వు కుడా అంటావు కష్టాలు తగ్గించమని మరలా.

అమ్మ : కొడుకు వల్ల ప్రయోజనం లేదా?

దేవుడు : ప్రతి ఒక్కరితో ప్రయోజనము ఉంది అర్దము చేసుకుంటే, మనకు కావొచ్చు లేదా వేరే వాళ్ళకు కావచ్చు. అందరూ నావాళ్ళే గదా. నీకు తోడుగా, అండగా ఉండాలి. కష్తాలలో, బాధలలో ఉన్నవారికి ఓదార్పు మాటలు చెప్పాలి. ఆలోచింప చెయ్యాలి. మాయలో ఉన్న వారికి దాని స్వరుపాన్ని వివరించి చెప్పాలి, ముందు చూపు తో ఆలొచింప చెయ్యాలి.

దేవుడు : మీ పని మీరు చెయ్యండి మనస్పూర్తిగా బాధలు‌ , అవమానాలు ఎదుర్కొంటు. పాత తప్పులు మార్చ లేము. కొత్తవి చెయ్యొద్దు. నేను ఉంటా ఎవరు మీతో లేకున్నా.
ఎవరికి ఎంత వరకు అవసరమో అంత ఇస్తున్నాను.

అమ్మ: అలాగే న య్యా


Dt : 20-Aug-2017, Upd Dt : 22-May-2019 , Category : Devotional, Views : 795 ( id : 7 )
Tags :
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.