ఏమిటీ ఈ అరాచకం, వెన్నుపోటు లేని ఇల్లు ఉందా? బందిపోటులేని గ్రామం ఉందా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,835; 104 తత్వాలు (Tatvaalu) and views 224,991.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

What is this anarchic, home without backstabbing? A village without bandits? Political situation of yesteryear and today

ఏమిటీ ఈ అరాచకం, ఆ గోల ఏమిటో చూడండి. అమెరికా తో అన్ని విషయాలలో పోల్చుకుంటాం, ఎన్ని అప్పులు చేసినా, ఎన్ని 3 పంటల పొలాలు కాంక్రీటు చేసినా, ప్రజా ధన పధకాలకు కుటుంబ పేర్లు పెట్టినా, ఎన్ని కొత్త పన్నులు వేసినా, ఆహారపు రేట్లు పెరిగినా, పాత కుటుంబ వారసత్వ నాయకులు ను వదలి, కొత్త నాయకులు కు వెళ్ళము, వెళ్ళలేము.

రామరాజ్యాన్ని తెచ్చే శక్తివంతమైన, రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ను, ఆత్మాభిమానం వదలి, అమ్ముడుబోయి, కుటుంబ రాచరికపు వ్యవస్థను కాపాడుతున్నాము. ఫలితాలు మనము, మన పిల్లలు, మనుమలు అనుభవిస్తున్నారు.

ప్రజల మనసుల్లో బానిసత్వం వదలనిదే, మంచి వారు కొత్త వారు, మనకు నాయకులు గా రాలేరు. 2019 లోని పాట వినండి.

ఇది ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత, మన లో అలాగే మన నాయకుల లో, పాము నక్క ఎవరో, పులి ఎవరో, ఆవు ఎవరో వివరించి చెప్పాలి కదా, మీరు మీ కుటుంబానికి?

బురదలో పొర్లాడుతూ ఉంటే, ఆ సువాసన అలవాటు పడిన తర్వాత, దానిని వదలి బయటకు రావాలంటే బాధే కదూ? అయినా తప్పదు, మన బిడ్డల భవిష్యత్ బాగుండాలి అంటే, ప్రక్రుతి ప్రళయాలు ఆపాలంటే.

అవ్వ, ఆ బానిసత్వ మత్తులో, గంధం వాసన కూడా, దుర్గంధం లాగా ఉంటుంది కదూ. మంచి మాటలు ఎక్కవు. మరి, మన బతుకులు మారవు ఎన్నటికి.

* * *

ఏమిటీ ఈ అరాచకం,

** వెన్నుపోటు లేని ఇల్లు ఉందా? బందిపోటు లేని గ్రామం ఉందా?
మేము ఇన్నాళ్ళు మగ్గలేదా, మా వాళ్ళు ఇంకొన్నాళ్ళు మగ్గవద్దా,
ఒప్పుకోము ఒప్పుకోము కొత్త నాయకత్వం, మగ్గుతాము మగ్గుతాము మా జీవితాంతం

** మాకు లేని సంతోషం మా పిల్లలకు ఇవ్వాలా? మాకు లేని విజ్ఞానం మా పిల్లలకు రావాలా,
అందరు తప్పుడు వాళ్ళైతే, తక్కువ తప్పు వారిని ఎన్నుకోవాలి అని,
ఒప్పుకోము ఒప్పుకోము కొత్త నాయకత్వం, మగ్గుతాము మగ్గుతాము మా జీవితాంతం

** చిన్న చదువుకు కట్టాము వేలు, పెద్ద చదువుకు కడతాము లక్షలు,
ప్రవేట్ విద్యకు అమ్ముతాము ఆస్తులు, ప్రభుత్వ బడి కాలేజీ మాత్రం బాగుపడవు
ఒప్పుకోము ఒప్పుకోము కొత్త నాయకత్వం, మగ్గుతాము మగ్గుతాము మా జీవితాంతం

** జబ్బుకు పోతాము భాగ్య నగరం, కాదంటే వెళతాము చెన్న పట్నం,
ప్రవేట్ ఆస్పత్రిలో ప్రాణం పోయినా సరే, ప్రభుత్వ దవాఖాన బతుకు మాత్రం ఇంతే
||ఒప్పుకోము||

** పక్కనోడు ఆక్రమించినా కొంత, బయటోడు కబ్జా చేసినా అంతా,
పలుకుబడి ఉన్నొడికే న్యాయం, మంచివాడికే ఎన్నేళ్ళైనా అన్యాయం,
||ఒప్పుకోము||

** రౌడీలు వీధులు ఏలినా, గుండాలు ఊళ్ళు ఏలినా,
రక్షణ న్యాయం అధికారం కాపు కాచినా, మా బతుకులు చింద్రం అయినా,
||ఒప్పుకోము||

** ఉచిత నాణ్య విద్య వైద్యం మా కొద్దు, సామజిక రక్షణ మాకొద్దు
5 ఏళ్ళకు ఒక్కసారి 5 వేలు బిర్యాని మజ్జిగ చాలు మా ఖర్చులకు ,
||ఒప్పుకోము||

** చవక బారు ఉచిత పధకాలతో, ప్రభుత్వ ఆస్తులు తాకట్టో తెగనమ్మో
దోచి విదేశాల బాంకుల్లో దాస్తుంటే, మా బిడ్డలు బలి అవ్వాలి బానిసలు గా
||ఒప్పుకోము||

** ఫీజ్ వెనక్కితో కాలేజీకి లాభం, అనారోగ్యశ్రీతో కార్పొరేట్ కి లాభం
సెజ్ తో తమ వ్యాపారికి లాభం, ఖజానాకి జనానికి మాత్రం నష్టం
||ఒప్పుకోము||

** పించను కు మూడేలిస్తే చాలు, నిరుద్యోగికి ఐదేలిస్తే చాలు,
చేయి చాపి, ఎదురు చూసే మా పరాధీన బతుకులు, మాత్రం ఎదగకూడదు ఎన్నడూ
||ఒప్పుకోము||

** ఊరికి నీళ్ళు లేకపోయినా సర్దుకుంటాం, మందు లేని ఊరు ఉంటే రచ్చచేస్తాం
సినిమా రాజకీయ ప్రేమ కోసం ప్రాణాలిస్తాం, తల్లి దండ్రుల ను అనాధలుగా వదిలేస్తాం
||ఒప్పుకోము||

** మా కులపోడు వస్తే మాకు లాభం, వాళ్ళ వర్గం వస్తే వాళ్ళకు లాభం
మరి మోదీ లా ఎవరు వస్తే లాభం, మన రాష్ట్రానికి, జిల్లాకి, ఊరికి
||ఒప్పుకోము||

** బడుగు సన్న రైతుకు అండలేదు, పిండుకోని వ్యాపార దళారి లేడు
బువ్వ కూర రేటు ఆకాశం కెగిరినా, అన్ని వస్తువుల రేట్లు అందకుండ పోయినా,
||ఒప్పుకోము||

** రామన్న, చంద్రన్న, రాజన్న, జగనన్న, కుటుంబాలేనా పాలక నేతలు,
మా అన్న, మీ అన్న, చిన్నన్న, నేతలు కాకూడదు ఎన్నడూ
||ఒప్పుకోము||

** కులం పేర పదవులు ఇచ్చినా, వర్గం పేర వరాలు పంచినా,
అయిన వాళ్ళకు అన్ని ఇచ్చి, కాని వాళ్ళకు సున్న మేసినా,
||ఒప్పుకోము||

** అనుభవం కావాలి వెన్నుపోటులోనూ, ఫ్యాక్షన్, రౌడీ, కేసుల రాజ్యం లోనూ
కుల, ధన, వర్గ, మత వర్గీకరణలోనూ, సమాజానికి వీలైనంత చెడులోనూ
||ఒప్పుకోము||

** లంచం లేనిదే ఏమీకాదు, తిండి నిద్రా ఎటూ లేదు, పిల్లల భవిష్యత్ కానరాదు
అవినీతి, అక్రమాలు, అన్యాయం పోకుండా, అమెరిక బతుకులా ఆశలేదు
||ఒప్పుకోము||

** రామన్న రాజ్యంలో అధర్మం ఎంతో, చంద్రన్న పాలనలో అధర్మం అంతే
రాజన్న పాలనలో అన్యాయం ఎంతో, జగనన్న రాజ్యంలో అన్యాయం అంతే
||ఒప్పుకోము||

** నాయకుడంటే వెన్నుపోటు పొడవాలి, కుల జాడ్యం తో నిండాలి
నాయకుడంటే కేసులతో కోర్ట్కు పోవాలి, ఫ్యాక్షన్ బాగ్రౌండ్ తో ఉండాలి
||ఒప్పుకోము||

** కాంగ్రెస్ చెయ్యి విరిచి, కమలం తో వెలుగుతున్నాం,
మాసాని కో స్కాము నుండి, ఏడాది కో స్కాము వెతుకుతున్నము,
||ఒప్పుకోము||

తక్కువ అవినీతి, కేసులు, మోసాలు, వెన్నుపోటులు గల వారు ఎవరు? ఎవరూ లేకపోతే, నోటా ఉంది కదా?

గుండెల మీద చెయ్యి వేసుకోని, మన పిల్లలు, మనుమల కోసం ఆలోచించి, వాళ్ళ బంగారు భవిష్యత్తు ను, మన చేత్తో మనం రాస్తున్నాం, గుర్తు ఉంచుకుందాం, ఓటు వేసేటప్పుడు.

కుల, వర్గ, ధన, అవకాశ, అవసరాల ను కాసేపు పక్కన పెట్టి, ఆత్మాభిమానముతో, తప్పక ఓటు వేద్దాం. మన దేశ, రాష్ట్ర, జిల్లా, పట్టణ, గ్రామ సౌభాగ్యం కోసం, బాధ్యతతో కూడిన రుణం తీర్చుకుందాం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,835; 104 తత్వాలు (Tatvaalu) and views 224,991
Dt : 22-Mar-2019, Upd Dt : 17-Mar-2024, Category : Politics
Views : 2210 ( + More Social Media views ), Id : 64 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra election , jagan , pavan , chandra babu , paul , arachakam , oppukomu , nayaktvam , maggutamu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content