APLatestNews.com top Banner
Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
Latest Telugu(AP and Telangana) News VideosLatest India(English) News VideosLatest India(Hindi) News VideosLatest USA(English) News Videos Press Releases/Note - News/Events/Pictures Latest Telugu Serials and Shows Videos Telugu Devotional Videos Telugu Movie News and Comedy Videos Telugu Full Length Movie Videos Indian/Andhra/Telugu Recipes(Cooking) Latest Sports News Latest Telugu/English News feed(Short Text Version) Telugu/English - India/USA Newspapers Polls - vote/share your thoughts? Live Streaming - Watch News Online(Telugu/ English/ Hindi/ Tamil/ Kannada/ Malayalam/ Bengali) - Live TVs Live Streaming - Listen Radio Online(Telugu/ English/ Hindi/ Tamil/ Kannada/ Malayalam/ Bengali) - Live Radio APLatestNews.com on Social Media Network
             
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వాలు కుడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, ప్రశ్నలు సంధించండి.
తత్వం 4 - ఆత్మ ను అంతరంగలో చూడటానికి చిన్న గా ప్రయత్నం చెయ్యి(517 Views)
ఆత్మ ను అంతరంగలో చూడటానికి చిన్న గా ప్రయత్నం చెయ్యి. నువ్వు ఎదుర్కొంటున్న, ఎదుర్కొన్న కష్టాలు , బాధల కన్నా అది చాలా తేలిక మనస్పూర్తిగా పట్టుదలగా సాథన చేస్తే. మనము, మన సమాజం చల్లగా ఉంటాం.

ఆది శంకరాచార్యుల వారు అన్నారు – దేహో దేవాలయో ప్రోక్తః జీవోద్దేవో సనాతనః అంటే, దేహమే దేవాలయం: జీవుడే సనాతనమైన దైవం అని అర్థం.

దేహం లోనే ధ్యానం చేయాలి, దేహం లేకపోతే ఎక్కడి ధ్యానం? మరో జన్మ కోసం నిరీక్షణ ఒక్కటే. ధ్యానం వల్లనే జీవుడు దేవుడు అవుతాడు.

దేవతావిగ్రహాలను(తిరుపతి, కాళహస్తి, లేదా ఎక్కడైనా యాత్రకు వెళ్ళినప్పుడు కూడా) దర్శిస్తున్నప్పుడు, కళ్ళు మూసుకొని నమస్కరిస్తాం. అంటే మనకు తెలీకుండానే మనలోన ఉండే దేవుని అంశ కళ్లు మూతపడేటట్లు చేసి నేను బయట లేను నీలోనే ఉన్నాను అని అంతర్ముఖ స్థితికి పో అని చెప్పినట్లు కాదా. ఆ దేవుని అంశ మనలోనే ఉన్నట్లు రుజువు కాదా!


ఏ వంక మనస్సు కలిగిన, నావంకకు ఇంద్రియంబులన్నియు జేరును
నీ వంకకు మనస్సు కలిగిన, నే వంకకు ఇంద్రియంబు లేగవు వేమా

మనస్సు యొక్క ఆలోచనలు ఎటువైపు వెళతాయో, ఇంద్రియములన్నియు మనస్సుతో బాటే ఉంటాయి. ఎందుకంటే, మనస్సు ఇంద్రియములకు రాజు. కావున భగవంతుని వైపు మనస్సును మరల్చగలిగితే, మనస్సుతో బాటుగా ఇంద్రియములన్నియు, సూర్యుని యెదుట దీపము వలే, వాటి సహజ గుణములను కోల్పోవును.
Dt: 2017-08-10


గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
Facebook Comments