APLatestNews.com top Banner
         
సాత్విక్ , తామస్ మాట్లాడుకుంటున్నారు 2000 రూపాయల నోటు గురించి - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
సాత్విక్ , తామస్ మాట్లాడుకుంటున్నారు 2000 రూపాయల నోటు గురించి, ఉంచుతారా , తీసేస్తారా అని.

సాత్విక్ చెప్పారు నాకు నష్టం లేదు, నా డబ్బులు బాంక్ లో ఉన్నాయి. అన్నిటికీ ఏటియం కార్డులు, పేటీ ఎమ్ వాడుతుంటా, టాక్స్ కడతా. ఓ లక్ష దాకా కాష్ ఉన్నా మార్చుకోవడం కష్టం కాదు. మామూలు మధ్య తరగతి వాడికి ఇది ఇబ్బంది కాదు, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ నెట్ ఉంది , టెక్నాలజీ తో. ఆఖరికి పని అమ్మాయి, ఇస్తిరీ బండి దగ్గర. అంగన్ వాడీలలో కుడా వాడుతున్నారు. అంతా వాట్సాప్ లో నే నడుస్తోంది, అని అన్నాడు. మోడీ, బాబూ కుడా ఇదే చెప్పారు, అన్నాడు.

దొంగ నోట్లు గుర్తు పట్ట లేము. నోట్లు లేక పొతే ఇంటి దొంగలుకు, పాక్ లాంటి బయట దొంగలకు ఉద్యోగాలు పొతాయి దొంగ నోట్లు పని లేక. అవినీతి, ఓటు కొనటము, అమ్మటము తగ్గుతుందేమొ, మన బతుకులు బాగు పడుతాయెమో మంచి నాయకులు వచ్చి, అన్నాడు.

తామస్ చెప్పాడు , మాకు వడ్డీ , చీటీ లేదా కాష్ తో నడిచే వ్యాపారం ఉంది. మా స్నేహితులు కు కూడా వేరు వేరు వ్యాపారాలు ఉన్నాయి. టాక్స్ కట్టం లేదా తక్కువ కడతాం , చాటు వ్యవహారాలు ఎక్కువ , అన్నీ కాష్ తో నే అయిపోతాయి, లాభం కానీ రిస్క్ అని.

మరి ముందే జాగ్రత్తగా ఉండాలి, మొన్న నోటు రద్దు చూసాక కూడా మారరా అని అడిగాడు సాత్విక్ నవ్వుతూ. మొన్నే కదా మీ అమెరికా చుట్టం కూడా చెప్పారు చేతులో చిల్లర కూడా ఉండదు అంతా గీకుడే అని. అమెరికా లో నోటు రద్దు అంటే ఎవరూ పట్టించుకోరు పెద్ద దొంగలు తప్ప .మరి అమెరికా లాగా మనం ఎదగాలని అంటారు, మరి చాటు మాటు వ్యవహారాలు, అవినీతి తగ్గకుండా, అభివృద్ధి అంటే ఎలా.

పెళ్లికి డబ్బులు తెస్తూ ఉంటే పోయింది బాంక్ దగ్గర, పెళ్లి ఆగింది. బస్సు దోపిడీ , రైలు, ఇల్లు దోపిడీ లు, హత్యలు తగ్గవా డబ్బు చేతిలో, ఇంట్లో ఉండకపోతే. వాట్సాప్ వాడటం వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది ఏమిటి సమచారం లేదా టెక్నాలజీ పెరిగాక? అన్నాడు సాత్విక్.

తామస్, మరి దానికి టాక్స్, ఏదో కంపెనీ కి లాభం అంటా అన్నాడు. విదేశాల్లో ఎప్పుడు నుంచో ఉంది, మనకు తప్ప. మనకు గీకుడు వల్ల 50 లాభాలు, రక్షణ , నీతి. నష్టాలు 10 ఉండవచ్చు, కానీ లాభాలు ఎక్కువ.

ఇకనైనా మారదాం అన్ని ప్రభుత్వం కి తెలిసేటట్టు చేద్దాం, మోస పోవడం లేదా మోసం చెయ్యడం తగ్గిద్దాం. టాక్స్ కడదాం , మనకు రావాల్సిన అభివృద్ధి ని గట్టిగా అడిగే హక్కు సంపాదిద్దాం. చెడ్డ విషయాలలో పాశ్చాత్య దేశాల ను అనుసరించే మనం, మంచి విషయం లో ఎందుకు పాటించము మిత్రమా అన్నాడు.

పేపర్ చూస్తే నీకు కొత్త విషయాలు తెలుస్తాయి, మనము ఎంత ఎదిగామో. కార్డు లే డూప్లికేట్ చేస్తున్నారు, సమచారం లాగేస్తున్నారు, జాగ్రత్త గా వాడాలి . ఇంకా డబ్బులు లెక్కెట్టాలి చినిగే నోట్లు అంటావు అని అన్నాడు సాత్విక్ నవ్వుతూ. అంతే కాదు, ఓటుకు నోటు కు చూసాక అంతా ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ లే.

Dt : 03-Jan-2019, Upd Dt : 15-Mar-2019 , Category : General, Views : 220 ( id : 32 )
Tags : 2000 note
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments