APLatestNews.com top Banner
         
ధర్మం, న్యాయం ప్రకారం అన్న గారి రెండవ పరిణయం. - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
రమేష్, సురేష్ ని అడిగాడు అన్న గారి వివాహం ధర్మం, న్యాయం పరంగా వివరంగా చెప్పు. బయోపిక్ ల తో ఇప్పుడు అందరు మరలా గతం గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మోహం లో అన్ని ఒప్పే అనిపిస్తుంది, ఫలితము వచ్చేసరికి నిస్సహయతగా ఉండిపొవాలి.

మా ఇంటి దగ్గరలో 80 ఏళ్ళ పై వ్యక్తి ఒక్కడే పాపము ఒంటరిగా అడుగులో అడుగు వెసుకుంటూ అన్ని పనులు చేసుకుంటున్నారు.

ఇక్కడ తప్పులు ఒప్పుల గురించి వద్దు, కేవలం మోహం గురించి మాట్లాడదాం. ముందు కొన్ని విషయాలు తెలియాలి , నాకు తెలిసినంత వరకూ ఆమెకు భర్త, కొడుకు ఉన్నారు ఆల్రెడీ.

చట్ట న్యాయం ప్రకారం, విడాకులు ఇచ్చి అన్నగారిని ఆమె పరిణయం చేసుకున్నారు. ఇక్కడ ప్రశ్న ధర్మం, మోహం.

1. వేరే వారి భార్యను , ఏదో ఒక కారణం గా , దగ్గరగా ఉండేటట్లు అనుమతించ వచ్చా అన్ని రోజులు పరిణయం ముందు ?

2. ఉన్న భర్త కు విడాకులు ఇచ్చి, తనను చేసుకోవాల్సినంత అవసరం ఉందా ?

మామూలు వ్యక్తి విషయంలో ఇవి ఆలోచన చెయ్యం. కానీ సంఘం లో పెద్ద మనిషి ఉన్నత స్థాయి లేదా 60 ఏళ్ల పై న బాధ్యత గల మనిషి(కాషాయము కూడా కట్టి ) అందుకు అవకాశం ఇస్తారా. తోడుగా కావాలి అంటే ఇంక వేరే మార్గాలు, జనాలు లేరా. ధర్మం అవునో కాదో మీరే అనుకొండి చాలు.

అన్న గారు తెలుగు వారి ఆరాధ్య దైవం, ప్రజల కోసము, తెరిచిన పుస్తకం అన్నారు, అందుకే ఈ మాట అయినా మోహం గురించి చెప్పాలని. తర్వాత జరిగిన అన్ని విపత్కర పరిణామాలకు మూలం ఈ సంఘటనే. ఫలితము అందరము చూసాము.

మోహం తో జాగ్రత్త. అందుకే అరిషడ్ వర్గాలను జయించాలని గీతలో క్రిష్ణయ్య చెప్పారు.

Dt : 02-Jan-2019, Upd Dt : 18-Mar-2019 , Category : General, Views : 266 ( id : 29 )
Tags :
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments