APLatestNews.com top Banner
         
ఎంతమంది గురువు లు ఉండొచ్చు. ఒకరే అని విన్నా కానీ - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ఎంతమంది గురువు లు ఉండొచ్చు. ఒకరే అని విన్నా, కానీ, మీరు అందరూ గురువు లే అంటున్నారు.

తల్లిదండ్రులు మొదటి గురువులు, వారిని మించిన గురువులు ఇలలో లేరు. వారినే మనము అనాధలు గా వదిలివేస్తున్నాము. ఆధారపడిన అత్త మామలు ఉంటే, వారు తల్లి దండ్రులతో సమానమే. ఇంక గురువుతో, మనకు పని ఏముంది, విలువ ఏముంది, ప్రయోజనము ఫలితము శూన్యం. గురువు గురించి మాట్లాడే హక్కు కూడా లేదు. తర్వాత చదువు నేర్పిన వారూ గురువులే. అప్పటికే కనీసము 3 అయ్యారు. ఈ రోజులలో భగవంతుని తప్ప, వేరే వాళ్ళని, ఆధ్యాత్మిక గురువులు గా నమ్మలేని పరిస్థితి.

ఒక్కరు అనేది దాటి పొయింది గదా. కావాలి అనుకుంటే మంచి గురువులలో ఒకరిని, ప్రధాన గురువు గా అనుకోవచ్చు.

కనపడే ప్రతి వ్యకి మనకు గురువే. ఒకరు మంచి నేర్పుతారు, ఇంకొకరు చెడు లో మునిగి, మనకు అది చేయకూడదని, ఉదాహరణతో సహా తెలుపుతారు. మత్తులో, జూదములో లేదా వ్యసనాలలో, గుల్ల అయిన వారు కూడా, మమ్మల్ని చూసి బుద్ది తెచ్చుకోండి అని, ప్రాక్టికల్ గా చేసి, ఋజువు చేసి చూపుతున్నారు. వారూ గురువులే, ఆచరణాత్మక(ప్రాక్టికల్) గురువు లు అనొచ్చు, ఎందుకంటే మిగతా వారు నోటితో, అనుభవముతో చెపితే, వీరు చేసి చూపిస్తారు.

భగవద్గీత 7 వ అధ్యాయములో, క్రిష్ణయ్య కూడా ఇలా చెప్పారు - సూత్రమున మణులు గుచ్చబడినట్లు ఈ జగమంతయు నాలోనే కలదు, నేనే ఈ జగమంతయు నిండి ఉన్నాను. కాబట్టి అందరిలోనూ దేవుడు గురువు ఉన్నట్లేనా. అది తెలుసుకొవటమే పెద్ద పని. అది ఆత్మ శోధన, సాధన,ధ్యానం లోనే బయటపడుతుంది. బయట వెతకాల్సిన పని లేదు.

గుడి గోపురాల చుట్టూ తిరిగి పూజలు చెయ్యల్సిన పని లేదు. బావాజి గుర్తు ఉన్నారా, వెంకన్నే వచ్చి పాచికలాడారు. ప్రహ్లాదుడు, నారాయణుడినే ఇంటికి రప్పించారు. రామదాసు, రామయ్య నే డబ్బు కట్టేటట్టు చేసారు రాజు దగ్గరకు వెళ్ళి.

Dt : 02-Jan-2019, Upd Dt : 22-Mar-2019 , Category : Devotional, Views : 162 ( id : 28 )
Tags : guruvu , krishnayya , parents , teacher
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments