APLatestNews.com top Banner
  
భీష్ముడు అంపశయ్య మీద ఉండి క్రృష్ణయ్య నేను కూడా కారణజన్ముడినే గదా - శ్రీ స్వామి తత్వాలు(Sri Swami Tatvaalu) 25
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
             
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
భీష్ముడు అంపశయ్య మీద ఉండి క్రృష్ణయ్య నేను కూడా కారణజన్ముడినే గదా , ఏందీ దుస్థితి నాకు అని. అప్పుడు భగవంతుడు చెప్పాడు , అవును, ఆఖరికి నేను కూడా నిన్ను ఏమి చేయలేను, నువ్వు అంత గొప్ప వాడివి. అందుకే శిఖండి ని వాడాను. ఎందుకంటే ధర్మం ను రక్షించు అది నిన్ను రక్షిస్తుంది అని నీకు తెలుసు కదా అన్నాడు. భీష్ముడు, పరంధామా ఇప్పుడు ఏ గదా పొగిడావు మరలా నన్ను తప్పు ఎందుకు పడుతున్నావు అని అడిగాడు. నాకు తెలిసీ ఎవరికీ అన్యాయం చెయ్యలేదు గా అన్నాడు.

అందరూ ఇలాగే అనుకుంటూ నటనతో మోసం తో మోహం తో బతుకుతారు కలియుగంలో. గతం గుర్తు చేస్తా , పశ్చాత్తాపం చెందు , లేదంటే స్వర్గ ప్రాప్తి ఉండదు అని ఇలా చెప్పారు.

ద్రౌపది వస్త్రాపరణ అప్పుడు నువ్వు ధుర్యోధనుడికి చెప్పావు తప్పు అని. వాడు వినలేదు, ఏమి చేశావు. అక్కడే కూర్చుని జరిగేది చూసావు. నువ్వు తలచుకుంటే వాడి నడ్డి విరిచి కూర్చోపెట్టగలవు. ఇందాకే చెప్పా, నేను కూడా నిన్నే మి చెయ్యలేను. అంటే శక్తి ఉండి గమ్ముగా ఉన్నావు. పోనీ సభవిడిచి వెళ్ళావా పాపానికి దూరంగా. లేదు. అక్కడే ఉన్నావు. సభలో ఉన్న దుర్మర్గులు ఎవరూ బతకరు ఈ యుద్ధం లో. ఎందుకంటే వాళ్ళ పాపం మే ఇక్కడ పడుకోబెడుతుంది. అందుకే నీకు ముళ్ళ బాణం పై 6 నెలలు ఉన్నావు. కలియుగంలో రోగాలు రొప్పులతో మోసాలతో సగం నరకం ఇక్కడే చూస్తారు. పశ్చాత్తాపం పడు , శిక్ష అనుభవించు స్వర్గం పొందు అన్నాడు.

మన రామాయణ భారతాలలో లేని మంచి, చెడు , కుట్రలు, కుతంత్రాలు, మారణాయుధాలు , విమానాలు , దూరదర్శని , దూరశ్రవణం , గాలి ప్రయాణం, క్షణ కాల దర్శనం ఏ ఇతర గ్రంధాలలో లేవు. అలాగే సొంత గ్రంధాలను , సొంత తల్లి దండ్రుల ను అవమానించేవారు కూడా మనవారే.

ధర్మం ను రక్షంచు అది మనల్ని రక్షిస్తుంది.

Dt : 16-Dec-2018, Upd Dt : 19-Jan-2019 , Category : Devotional, 180 Views, Tags : Bheeshma , krishnayya
Top Views . . .

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
Facebook Comments