APLatestNews.com top Banner
  
దైవ ప్రార్దన - శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు - కరుణా మూర్తియగు దేవా - శ్రీ స్వామి తత్వాలు(Sri Swami Tatvaalu) 23
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
             
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ప్రతి రోజు ఉదయం, అందరూ దీనిని అర్దము చేసుకోని, దేవుని ప్రార్ధిస్తే(వారి భాషలలో వారి దేవుని), ఎటువంటి తప్పులు చేయము. బాధలను ఆనందముతో ఎదుర్కొంటాము. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దేవుని క్రుప ఉంటుంది. పక్క వారితో(పని లో, ఇంట్లో, ఊరిలో,రాష్ట్రం లో, దేశం లో, ప్రపంచం లో) సమస్యలు ఉండవు. అందరమూ, ఆనందము గా ఉంటాము.

కరుణా మూర్తియగు దేవా! మా చిత్తము/మనస్సు సర్వకాల సర్వావస్థలయందును, మీ పాదార విందముల యందు లగ్నమై, అచంచలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపుము.

పరమదయానిధీ, ప్రాతః కాలమున నిద్రలేచినది మొదలు, మరల పరుండువరకు, మనోవాక్కాయములచే మా వలన, ఎవరికినీ అపకారము కలుగకుండునట్లును, ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చెయులాగునను, సద్బుద్దిని దయచేయుము.

సచ్చిదానందమూర్తి! నిర్మలాత్మా! మా యంతఃకరణములందు, ఎన్నడును ఏ విధమైన దుష్ట సంకల్పము గాని, విషయవాసనలు గాని అజ్ఞానవ్రుత్తి గాని, జొరబడకుండునట్లు దయతో అనుగ్రహింపు.

వేదంతవేద్యా! అభయస్వరూపా! మా యందు భక్తి, జ్ఞాన వైరాగ్య బీజము లంకురించి, శీఘ్రముగ వ్రుద్దిచెందు నట్లు ఆశీర్వదింపుము. మరియు ఈ జన్మము నందే కడతేరి, మీ సాన్నిధ్యమున కేతెంచుటకు, కావలసిన శక్తి సామర్ద్యములను, కరుణతో నొసంగుము.

దేవా! మీరు భక్తవత్సలురు! దీనుల పాలిటి కల్పవ్రుక్షస్వరూపులు! మీరు తప్ప నాకు ఇంకెవరు దిక్కు! మిమ్ము ఆశ్రయించితిని. అసత్తు నుండి సత్తునకు గొనిపొండు! తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొండు, మ్రుత్యువు నుండి అమ్రుతత్వమును పొందింపజేయుడు!

ఇదే మా వినతి. అనుగ్రహింపుడు, మీ దరి జెర్చుకొనుము, పాహిమాం! పాహిమాం! పాహిమాం! పాహిమాం! పాహి! - ఓం తత్ సత్

Dt : 07-Nov-2017, Upd Dt : 19-Jan-2019 , Category : Devotional, 456 Views, Tags : Vidya Prakashanandagiri , Shukra Brahma ashramam , Srikalahasti , God Prayer
Top Views . . .

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
Facebook Comments