APLatestNews.com top Banner
         
శని మహార్ధశ మనకు 7 న్నర ఏళ్ళు ఉంటుంది, అమ్మ,కారు ప్రమాదం - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
శని మహార్ధశ మనకు 7 న్నర ఏళ్ళు ఉంటుంది, నమ్మినా నమ్మక పోయినా. మొదటి 2 న్నర ఏళ్ళు, పొయ్యి కింద మంట మొదలు పెట్టినట్టు. తర్వాత 2 న్నర ఏళ్ళు అన్నం మధ్యలో కుతకుత లాడుతున్నట్టుగా, వేపించి తిత్తి తీసి వదులుతుంది భారత కోట్ల కోటీశ్వరుడు విజయ మాల్యా ని అయినా.

తర్వాత 2 న్నర ఏళ్ళు, పొయ్యి ఆర్పితే చల్ల బడ్డట్టుగా తగ్గుతూ ఉంటుంది. తల్లి దండ్రులు పక్కన ఉంటే కొంత ఉపశమనం ఉంటుంది. ఎవరూ తప్పించుకోలేరు, శివయ్య తో సహ. నాకు చివరి 2 న్నర ఏళ్ళు మొదలు అయింది అక్టోబర్ లో.

5 ఏళ్ల చివరి దశలో శని పెద్ద దెబ్బ కొట్టాలి కారు ప్రయాణం లో. అమ్మ ను తీసుకుని బొంబాయి అంత దూరం తిప్పా గుళ్ళు, ఊళ్ళు ఆమెకు మోకాళ్ళ నడుము నొప్పి ఉన్నా కూడా. ఎక్కడా చిన్న ప్రమాదం జరగలేదు. ఎందుకంటే, వెంకన్న చెప్పారు శని తో , వాడిని ఏమన్నా చేసుకో, కానీ తల్లి కి ప్రమాదం జరగకుండా. శని , నా బొంద , వాడు విడిగా దొరకడం లేదు. కారు లో అమ్మ తో, రైలు లో జనం తో. ఎలా అమలు చెయ్యాలి స్వామి, అని నవ్వుతూ అడిగి , సరేలే అన్నారు.

ఇంక స్పాట్ రెడీ అయింది, హైవే తప్పించేశారు , లోకల్ రోడ్డు రెడీ, 2017 చివర్లో అనుకుంటా. ఇంటికి కేవలం 3 మైళ్ళ దూరంలో షాప్ నుంచి వస్తుంటే , ఒక బండి వచ్చి గుద్దినది తక్కువ వేగంతో. వెనకే పోలీసు ఉన్నారు ఆ టైంకి. అమ్మ, ఎందిరా ఆ శబ్దం అంది. అమ్మా , ఏమి లేదు గమ్ముగా ఉండు అన్నా. ఆమె కు , ఇప్పటికీ ఏం జరిగింది తెలీదు పూర్తిగా.

కారు పక్కన ఆపాం. వాళ్లు, వాళ్ళ వివరాలు ఇవ్వ బోయారు. తప్పు వారిదే. వద్దు, వెళ్ళండి అన్నా. వింతగా చూసారు. పోలీసు వచ్చారు, మీ ఇద్దరు కు లేని బాధ నాకెందుకు అని తను వెళ్ళారు.

కారు చుట్టూ తిరిగి చూసా , గీతలు పడ్డాయి. పెయింట్ పోయింది. మాది 1K ఖర్చు, మీది 60K. నవ్వుకుంటూ వెంకన్న కు , శనయ్య కు దండం పెట్టా. మా ప్రాణాలు కాపాడారు , భరించ గలిగే నష్టాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు.

తల్లిదండ్రుల ను మనం చూడం, వాళ్ళే మనల్ని చూసి కాపాడతారు. తెలీక చాలా మంది వదులుకుంటారు, బతికి ఉన్న దేవుళ్ళ ను , పడతారు రాళ్ళ వెంట అజ్ఞానంతో.

Dt : 30-Dec-2018, Upd Dt : 15-Mar-2019 , Category : Devotional, Views : 133 ( id : 23 )
Tags : Shani , venkanna , car , mom
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments