
1. మనసులోనే పుట్టే మాయసంసారము, మనసు విరిగెనేని మాయ తొలగు
మనసు నిల్పెనేని మహి తానే బ్రహ్మము, విశ్వదాభిరామ వినురవేమ.
మనసునుంచే సంసారపు మాయ పుడుతుంది. మనసు విరిగి పోతే మాయ తొలగిపోతుంది. మనసు నిశ్చలముగా పెట్టుకొన్న వాడే బ్రహ్మం.
2. మనసులోని ముక్తి మరియొక చోటను, వెదుక బోవువాడు వెర్రివాడు
గొర్రె చంకబెట్టి గొల్ల వెదికినట్లు, విశ్వదాభిరామ వినురవేమ.
గొర్రెపిల్లను చంకలో పెట్టుకొని గొల్లవాడు వెతికినట్లు మోక్షం కోసం వెర్రి వాని వలె మనసుకు ఆవల వెదుకుతున్నాడు.
3. బ్రహ్మ మనగ వేరే పర దేశమున లేదు, బ్రహ్మ మనగ తానె బట్ట బయలు
తన్ను తానెరిగిన తానె పో బ్రహ్మoబు, విశ్వదాభిరామ వినురవేమ
బ్రహ్మ పదార్ధం మరెక్కడో లేదు. తానే బ్రహ్మమని బట్ట బయలుగా తెలుసుకోవాలి. తన్ను తాను తెలుసుకున్న వాడే బ్రహ్మం.
4. నొసలు బత్తుడయ్యె నోరు తోడేలయ్యె, మనసు భూతమట్లు మలయగాను
శివుని గొల్తు ననగ సిగ్గెట్టు రాదురా, విశ్వదాభిరామ వినురవేమ
నోరు తోడేలు లాగా, మనస్సును భూతం లాగా ఉంచుకొని నుదుట విభూది ధరించి శివున్ని కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా?
Dt : 04-Oct-2017, Upd Dt : 22-Feb-2019 , Category : Devotional, Views : 538 ( id : 21 )
Tags :
vemana
Facebook Comments