APLatestNews.com top Banner
         
భాగం 2 - బాబా శోధన - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
బాబా గారు ఇంకా అడిగారు, గురువు లు ఎప్పుడూ శోధన చేస్తారు. మన సమాధానం లో నే , మన సత్వ గుణం బయట పడుతోంది. రజో , తామస గుణాల వారు మోహంధకారం లో తమ అజ్ఞానం ను ఎలుగెత్తి చాటుతారు.

బాబా చెప్పారు, వెంకన్న కు శనివారం, ఏసయ్య కు ఆదివారం, నాకు గురువారం అనేది ఉంటే మాకు, మీకు తేడా ఉండదు. ఎల్లప్పుడు మేము అందుబాటులో ఉంటాము , మీ హ్రృదయం లో నే.

సరే అమ్మ ను తెచ్చావా గుడికి అని నవ్వుతూ అడిగారు. బాబా నా కూతురు తో వచ్చాను అని, నమస్కరించాను కోపం రాకుండా. ఏరా , తల్లి ని కూతురు అంటా వేంది రా, పిచ్చా నీకు అన్నారు. బాబా , 60 ఏళ్ళ దాకా నాకు తల్లి, తర్వాత మన బిడ్డలు గా చూడాలి. ఎందుకంటే వారికి శక్తి ఉండదు , ఆసరా కోసం , ఒక మంచి మాట కోసం, ప్రేమ గా నిమిరే చేతి కోసం చూస్తారు. మనం కోటి ఇచ్చినా , ప్రేమను ఆప్యాయత ను పంచలేవు గద బాబా అని తలవంచి చెప్పాను.

అంటే దూరంగా ఉండి , కోట్లు ఇస్తే వ్రృధా అంటావా అన్నారు, నేను అనను. వారే దీనికి జవాబు చెపితే , వారికే అర్థం అవుతుంది.

ఏమిటంటే ప్రశ్న, 5 ఏళ్ల వయస్సు లో , మన పేరున కోటి వేసి , మా సుఖాలకు అడ్డు అని లేదా డబ్బు ఇచ్చాం కదా అని , మమ్మల్ని మా తల్లి వదిలేసి ఉంటే ఈరోజు న ఎక్కడ ఉండే వాళ్ళం మేము? బహుశా రోడ్లు మీదో , దొంగలు గానో ఉండే వాళ్ళం. ఆ వయస్సు లో కావాలసింది డబ్బు గాదు , ప్రేమ , చేయి పట్టుకుని మంచి దారిలో నడపడం.

శీనయ్యా, ఎంత మందికి ఇది అర్థం అవుతుంది రా ఇది. అర్థం కానీ వారు , రేపు ఇంకా ఎక్కువ ఎదుర్కోవాలి. అంతే గాదు ఆస్థి ఉన్న, డబ్బులు వచ్చే అమ్మ ను చూడటం గొప్ప కాదు, రూపాయ లేని తల్లి దండ్రుల ను చూడటం గొప్ప, అంతే కాదు క్రతజ్ఞత మరియు బాధ్యత అన్నారు.

Dt : 30-Dec-2018, Upd Dt : 17-Mar-2019 , Category : Devotional, Views : 135 ( id : 20 )
Tags : baba
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments