APLatestNews.com top Banner
  
చెప్పేది మంచి గా , బాగున్నట్టుగా ఉంది , కానీ అర్థం కావడం లేదు - లోకం తీరు(Loakam Teeru) 18
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
             
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ఒకరు, అబ్బాయి, నువ్వు చెప్పేది మంచి గా , బాగున్నట్టుగా ఉంది , కానీ అర్థం కావడం లేదు. అని అడిగారు.

నమస్కారించి గురువు గారు, గీత , రామాయణం, భారతం, భాగవతం, గురు గీత, బ్రహ్మం గారి కాలజ్ఞానం, వేమన పద్యాలు ఎప్పడైనా చదివారా , వాటిని జీర్ణం చేసుకుని , అర్థం చేసుకున్నారా? ప్రశాంతంగా, మనశ్శాంతి తో ఉన్నప్పుడు చదవండి, అర్థం అవుతుంది. లేదా కనీసం తల్లి దండ్రుల పాద సేవ చెయ్యండి.

మొన్న ఒకలైను లో , ధర్మ రాజు గమ్ముగా ఉంటే కౌరవ సామ్రాజ్యం తుడిచి పెట్టుకుని పోయింది అన్నా. దీని అర్థం, మా చాగంటి గురువు గారు కనీసం వారం రోజులు అనర్గళంగా వివరించగలరు. అంత అర్థం ఉంది అందులో.

గీతా చార్యుడు, అంటే క్రృష్ణయ్య, మన గుణాలను 3 భాగాలుగా విభజించారు వయసు తో సంబంధం లేకుండా. సత్వ , రజో , తామస. సత్వ గుణం గల వారికే ఇవి అర్థం అవుతాయి. మిగతా వారికి ఇవి అర్థం అయి కానట్టు , లేదా పరభాషా సాహిత్యం లాగా ఉంటుంది. ప్రహ్లాదుడు, మార్కండేయుడు బాల్యంలో నే సత్వగుణ సంపన్నులు.

భగవంతుని లేదా గురు క్రృప ని పొందగోరే వారు , సత్వ గుణాన్ని అలవరచుకోవాలి. అది ఒక రోజున వచ్చే ది కాదు. అందుకే కృష్ణయ్య అన్నారు. కోటి కి ఒక్కరు మాత్రమే అలా నన్ను మనసులో ధ్యానం చేస్తారు ఆత్మ జ్ఞానం కోసం. అలాంటి కోటి వారిలో ఒకరు మాత్రమే నన్ను చేరతారు.

మీకు అర్థం కానిది , స్పష్టంగా లైన్ తో అడగవచ్చు. నేనూ ఒకటో మెట్టు దగ్గరే పడి ఉన్నా, ఆ కూసింత జ్ఞానం కూడా మీతో మాట్లాడుతూ ఉంటేనే వస్తుంది.

మీరందరికి , నమస్కారించి ప్రార్థిస్తున్నా , అర్థం కాకపోతే అడగండి, తప్పు సరిదిద్దండి , మంచి ని ప్రోత్సహించండి. మీ లాంటి మంచి వారు, గమ్ముగా ఉంటే అధర్మం అందలం ఎక్కితే , నష్ట పోయేది మన అందరమే.

భగవంతుడు మనల్ని క్షమించడు , తిని ఊరక పడుకుంటే. ధర్మ రక్షణకు ఆయన వస్తే, మనం నిజమైన భక్తులమా , మనం ఏమీ చేయకుండా.

Dt : 30-Dec-2018, Upd Dt : 18-Jan-2019 , Category : Devotional, 23 Views, Tags :
Top Views . . .

Facebook Comments