APLatestNews.com top Banner
         
భాగం 1 : బాబా శోధన - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
మొన్న ముక్కోటి కి గుడి కి వెళ్ళనపుడు, బాబా గారు మరాఠీ లో పలుకరించారు. బాబా, నేను తెలుగు బిడ్డను అని పాదాలకు నమస్కరించా.

అదేమిటి, నా 4 హరతులు పాడతావు గదా 20 ఏళ్లుగా, అన్నారు తెలుగు లో. అవును బాబా , కొంత అర్థం తెలుసు , అందులో ఎక్కువ మాటలు రామ, క్రృష్ణ, నారాయణ కాబట్టి ఇబ్బంది లేదు. నవ్వారు ఆయన.

అందరూ, గురువారం వచ్చి ఊపిరి ఆడకుండా నన్ను ఇబ్బంది పెడుతుంటే, నువ్వు ఆ రోజే ఎగనామం పెడతావు. ఎందుకు? పాత రోజుల లో తప్పులో ఒప్పులో పుస్తకం చూసి మనస్పూర్తిగా గొంతుతో పాడే ప్రయత్నం చేశేవారు. ఇప్పుడు ఏమిటి రా , ఆ గోల సౌండ్ లు. అంతే గాదు , మీడియా ప్లేయర్ మైకు లో పాడుతుంటే వీళ్లు గమ్ముగా చూస్తున్నారు నోరు తెరవకుండా.

అయ్యా , కోప్పడకండి ,అందరికీ ఇంట్లో అరచి అరచి , మందిరం దగ్గర ఓపిక ఉండటం లేదు. అందుకే మైక్ లు , గమ్ముగా ఉండటం.

20 ఏళ్ల క్రితం,భాగ్యనగరం బల్కంపేట పూజారీ అడిగారు బాబా ఇదే మాట. రోజూ సాయంత్రం వస్తావు , కానీ గురువారం రావు ఎందుకు అని.

పూజారి గారు మీకు అంతా తెలుసు ఏదో నా నోటి తో పలికించాలనీ. రోజూ, అంటే గురువారం కాకుండా, బాబా నేను ఒంటరిగా మాట్లాడుతూ ఉంటాము. నా బండ గొంతుతో పెద్దగా పాడిన, ఆయన ఓపిక గా వింటారు. నన్నే చూస్తున్నారు, గుర్తు పడతారు. అలాంటి భాగ్యం నాకు గురువారం దక్కుతుందా?

గుడికి వచ్చే ది ప్రశాంతంగా కూర్చుని కొంత ధ్యానం కి. అది గురువారం సాధ్యం కాదు.

ఏ గురువు కైనా , వార భేదం ఉంటుందా స్వామి అని అడిగాను. మాకు లేదు, మీ వాళ్లు అవసరానికి పెట్టారు అన్నారు.

ఆయన నవ్వుతూ, నిజం , స్నేహితుడి పెళ్ళి లో , అతను పలకరించలేడు బిజీ లో. అలాగే గురువారం, వేలమంది లో , నీ వంతు కొంచెం. అదే మిగతా రోజుల లో నువ్వు నేను మాత్రమే. బాగుంది రా .


Dt : 30-Dec-2018, Upd Dt : 10-Apr-2019 , Category : Devotional, Views : 160 ( id : 17 )
Tags : baba
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

All best news at one place for NRIs
Multiple source NEWS from 6 yrs
No Ads or Spam, free Content