APLatestNews.com top Banner
  
ఇది చాలా ఇళ్ళు లేదా కొట్లు లేదా ఖాళీగా ఉన్న ప్రాంత దగ్గర సమస్యలు - లోకం తీరు(Loakam Teeru) 16
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
             
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ఒకరు అడిగారు. ఖాళీగా ఉంటే కారు లేదా బండి పెడితే నష్టం ఏమిటి మీ ఇంటి దగ్గర?

మిత్రమా పేపర్ లేదా వార్తలు చూస్తున్నారా. అప్పుడప్పడు అన్నారు. జాగ్రత్తగా చూడండి. అర్థం అవుతుంది.

ఉదాహరణకు మా బజారులో DSP office వద్దో లేదా శివాలయం వద్దో లేదా అపార్ట్మెంట్ లోనో దొంగతనాని కో లేదా ఇంకో పాడు పనికో ప్లాన్ వేసే వాళ్లు, దానికి దగ్గరగా ఎవరూ కారు పెట్టరు బుద్ధి ఉంటే.

దూరంగా , జనం లేని లేదా ఓనర్ లేని స్ధలం దగ్గర, షాపు దగ్గర, కారు పెట్టి గమనిస్తారు పరిసరాలను పరిస్థితులను. టైం వచ్చినపుడు , వాళ్ళ పని కానిస్తారు. పోలీసు వారితో పాటుగా ఇది మన అందరి బాధ్యత, మన ప్రాంత భద్రత. తోటి వాడిగా మీకు నష్టం కలిగిన, నాకూ నష్టమే. మీరు చల్లగా ఉంటే , మేము చల్లగా ఉంటాము.

ఎక్కడైనా ,జనం లేని చోట, ఓనర్ లేని చోట , కారు లేదా బండి పెడితే , చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి , బండి పెట్టనివ్వక , ఫోటోలు తీసి పెట్టుకోవాలి బాధ్యత గల పౌరులు గా. ఎందుకంటే వాళ్ళ ప్లాన్ ఆ బజారులో ఎవరిమీద ఉందో ఎవరికి తెలుసు.

ఎవరికి వారు ఆ కారు అపార్ట్మెంట్ దో లేక బాబాయ్ దో లేదా ఓనర్ దో అని భ్రమపడి గమ్ముగా ఉంటారు. చివరకు నష్టపోయేది, మనం అందరం. ఇంకా మనకు తెలియని చెడు సంఘటన లు చాలా ఉంటాయి, జరిగాక ఏమీ చెయ్యలేము. మనకు ఎగష్టాగా , కల్యాణ మండపం పెళ్లి కార్ల తలనొప్పి ఎటూ ఉంది. సందట్లో సడేమియా అనే దొంగలు లేదా తప్పుడు వారు ఎప్పుడూ ఉంటారు.

మా బజారులో వారికి బాధ్యత గా చిమ్ముతూ, శుభ్రం చేస్తూ బండి పెట్టకోమన్నాను , ఎందుకంటే డబ్బులు పెట్టి చిమ్మతే , వారు బాధ్యత గా ఇంక ఎవరినీ పెట్టనివ్వరు అక్కడ.

అప్పుడు అందరికీ అర్థం అవుతుంది, ఫలానా ఇంటి వారు పని మనిషి తో శుభ్రం చేయించి ఒక బండి పెట్టుకుంటున్నారు బాధ్యత గా అని.

ఇతరుల మీద పడి బతికే వారికి , శుభ్రం చేసి పెట్టుకోవాలంటే కష్టమే , కానీ మన అందరి భద్రత ముఖ్యం కదా.

నిజమే మిత్రుడా , ఈరోజు ల లో ఎవరినీ నమ్మలేము అన్నారు నవ్వుతూ.

Dt : 30-Dec-2018, Upd Dt : 17-Jan-2019 , Category : General, 34 Views, Tags :
Top Views . . .

Facebook Comments