APLatestNews.com top Banner
         
స్టీలు బాక్స్ పౌర్ణమి రోజున పంచితే బతికున్న వాళ్ళ కు , అమావాస్య కు పంచితే - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
రామ మిట్టల్ అని పెద్ద స్టీల్ కంపెనీ యజమాని తెలుగు ప్రజలకు ఎంతో ఋణ పడి ఉన్నారు అంట , వీలైతే తెలుగు రాష్ట్రాల్లో కంపెనీ పెడదాం అని ఆలోచన చేస్తున్నారు అంట. విపరీతమైన లాభాలతో, సరుకు రవాణా కష్టం వల్ల భవిష్యత్ అవసరాలతో. ఎందుకు సార్ ఇక్కడే పెట్టాలి అనుకుంటున్నారు అని అడిగాడు విలేఖరి.

ఆయన , మిత్రుమా మా వాళ్లు ఎవరో ఒకరు పుకారు లేపారు, దినానికి , పెళ్లికి, పేరంటానికీ స్టీలు బాక్స్ , గిన్నెలు, చెంబు , స్పూన్ పంచితే వేరే వాళ్ళ ఇళ్ల లో పడి ఉంటాయి అదీ పేరు వేసి.

పేరు వేయకపోతే అవే మార్చుకుంటారు గదా, మాకు నష్టం కొత్త గా కొనరు. అది ఎక్కడ దాకా వచ్చింది అంటే డబ్బు ఉన్న వాళ్లు బిందెలు, బక్కెట్లు కూడా పంచుతున్నారు.

అది సరే సార్, చాలా రోజులు నుంచి జరుగుతుందే గదా ,మరి ఇప్పుడు ఫాక్టరీ ఎందుకు కట్టాలి అనుకుంటున్నారు ఇక్కడే.

చెప్తా ఉండు బాబు, ఈ పంచే జబ్బు ఇంకా ముదిరితే, రేపు పిల్లాడు యూనిట్ పరీక్ష కి , లేదా మధ్యలో లేదా చివర పరీక్షలు రాసాడని, పాస్ అవ్వాలంటే గిన్నెలు పంచాలనీ చెప్తాము. చిన్న పిల్లలు పుడితే , ప్రతి నెల గిన్నెలు పంచితే కలెక్టర్ అవుతాడు అంటాము లేదా అద్రృష్టం వస్తుంది అంటాము. పౌర్ణమి రోజున పంచితే బతికున్న వాళ్ళ కు , అమావాస్య కు పంచితే, పోయిన వాళ్ళ కు మంచిది అంటాం. జనం ఇక పరుగులే పరుగులు. అందుకే ఇక్కడే ఫాక్టరీ పెడితే, పిచ్చి డిమాండ్ ని కాష్ చేసుకోవచ్చు. జనాలకు ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నంతకాలం వ్యాపారస్తులకు అమ్మకాలు 3 పూలు 6 కాయలు.

మొన్న మీ పెద్దలు చనిపోతే మీరేమి పంచారు సార్ అని అడిగాడు విలేకరి. ఈరోజుల్లో బతికి ఉంటేనే ఏమి పెట్టడం లేదు, ఉన్న వారు పట్టించుకోవడం లేదు. పోయాక వేరే వాళ్ళకి గిన్నెలు ఇస్తే ఏమొస్తుంది. నేను దానధర్మాలు చేస్తా. అన్నదానం చేస్తా. స్కూలుకు డొనేట్ చేస్తా. ముఖ్యమంత్రి సహయనిధి కి ఇస్తా. లేదా

ఏ కార్యక్రమంలో అయినా నేను పూల చెట్లను పంచుతా. స్టీల్ బాక్స్ 70 రూపాయలు. మా ఊళ్లో చెట్టు 25 రూపాయలు. భూమి పచ్చగా, వర్షం వస్తుంది, ఎండ తగ్గుతుంది. ఒక ప్రాణం పోసినట్టు.

ఇప్పుడు అయినా మేల్కొందామా , సమాజానికి పని కొచ్చే పని చేద్దామా , వ్రృధా దండగ ఖర్చు తగ్గిద్దామా? ఎవరో సవరు బంగారం పంచితే మంచిది అంటే చేస్తామా? ఆలోచన చెయ్యాలి, మీరే గురువులు. మనమే ఇలా ఉంటే , ఇంక పిల్లల కు జ్ఞానం ఎలా నేర్పుతాం.

Dt : 30-Dec-2018, Upd Dt : 20-Mar-2019 , Category : General, Views : 147 ( id : 15 )
Tags : steal box
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments