APLatestNews.com top Banner
         
ఏంది రా ఈ పిచ్చి జనాలు నాకే 10 కోట్లు ఇచ్చా, కిరీటం చేయించా అంటారు - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
తిరుపతి వెంకన్న రాయలసీమ స్వచ్ఛమైన మనసు కు ప్రతీక. వెంకన్న అంటేనే మన ఇంటి పక్కన ఉన్న మంచి పెదనాన్న అన్నంత దగ్గర. దైవం గురించి ఎంతైనా ఊహించుకోవచ్చు, అదీ ఆరాధనే. మనసు పులకించాలి , నెమ్మది పడాలి.

రాత్రి నిద్ర లో , ఏరా అబ్బాయి అమ్మ ను తీసుకుని రాకపోతే ఏం మునిగింది, నాకు తెలీదా మీరు మనసులో చేసేది.

ఊరుకో స్వామి మరీను, 4am లెగిచి తలంటు కొని కూర్చుని, ఉత్తర ద్వారం అంటే ఎక్కడ తెచ్చేది నేను, వాళ్ల అమ్మ ఎప్పుడో చెప్పినది అంట , తప్పలేదు, మా ఇంటిదేమో పశ్చిమ ద్వారం ఇక్కడ.

మీరు తిరుపతి రాకుండా నే మా తమ్ముడు ని తెనాలి లో పలకరిస్తున్నారు. ఎక్కడైనా నేను ఒకటే , కొంచెం తిరిగి నట్టు ఉంటుంది అని అక్కడ కు వెళుతున్నారు. అందరూ ఎక్కడికక్కడ తగ్గితే కాస్త నిద్ర పోతాను. చూడరా , 3am కి పడుకోబెట్టి 4am కి సుప్రభాతం అంటారు.

శీనయ్యా , నా వంటి మీద నగలు చూసి, మా ఆవిడ లక్ష్మీ అని తెలిసి , ఏంది రా ఈ పిచ్చి జనాలు నాకే 10 కోట్లు ఇచ్చా, కిరీటం చేయించా , లక్ష హూండీ లో వేశా అంటారు. పాస్ అయితే, పదవి వస్తే, వ్యాపారం బాగుంటే , పిల్ల పుడితే , . . . నన్నే మోహం లోకి లాగుతారు. నేను పద్దతి గా ధర్మ వడ్డీ కడుతుంటే , అసలు ఎగ గొట్టే వాళ్లు అంతా ఇక్కడి కి వస్తున్నారు.

నేను చెప్పనది ఏంది మీరు చేస్తున్న ది ఏమిటి. పాపాలు , వదిలి, పుణ్య వంతులై ఒక్క రూపాయి మీరు వేస్తే చాలు. మా లక్ష్మీ మాచింగ్ గ్రాంట్ కింద దాన్నే కోటి చేస్తుంది. పాపపు మనసు తో పాపపు డబ్బు తేకండి రా బాబు.

అందరూ తల్లి దండ్రుల ను దూరం పెడుతున్నారు. కష్టాలు లో లేదా శని దశలో వాళ్ళ ఉపయోగం తెలిస్తే ఇలా చెయ్యరు. ఇంతకీ మీ అమ్మ పక్కన ఉండటం వల్ల, ఎలా కారు ఆపద తప్పిందో నీ మిత్రులు కు చెప్పు. సుప్రభాతం టైం అయింది తర్వాత మాట్లాడదాం.

అలాగే స్వామి, సాయంత్రం చెబుతా. వీళ్లు ఆఫీసు లో పని చేయాలి , వాళ్లు నిద్ర పోవాలి. పరమాత్మా , ఆనందభాష్పాల తో

Dt : 30-Dec-2018, Upd Dt : 17-Mar-2019 , Category : Devotional, Views : 144 ( id : 14 )
Tags :
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments