మనసున్న మంచి పాట - విధాత తలపున ప్రభవించినది, మెరిసే తారలదేరూపం (సిరివెన్నెల) - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,875,381; 104 తత్వాలు (Tatvaalu) and views 225,752.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

సిరివెన్నెల శాస్త్రి గారి నాద పద గుళికలకు, బాలు సరిగమల సుస్వరమాల, ఈ అద్భుత గీతం - విధాత తలపున. సంగీత ప్రియులకు అమ్రుతం ఈ గీత గానం, ఆస్వాదించండి ఆ విశ్వనాధుని అభిరుచి. బెనర్జీ, సుహాసినీ ల అభినయం వర్ణనాతీతం. సామాన్య సంగీత రసికులకు, భావం అర్ధము కాకపోయినా, గాత్రం మరియు పదాలను ఆస్వాదించవచ్చు.

4 నిమిషాల శ్వాస ప్రక్రియ ప్రాణాయామమునకు మంచి పాట, ప్రయత్నము చేయండి. మనలో సాత్వికత ఉందో లేదో, అంత సేపు జీర పోకుండా, నాభినుంచి నాదం కనీసం వస్తుందేమో చూడండి.

సాత్వికత అంటే ఏదో పెద్ద పదం కాదు - జాలి దయ కరుణ సంస్కారం క్రుతజ్ఞత ఉన్న తడి హ్రుదయం - దైవానికి నిలయం. దేవుని శ్లోకాలు రావు అనేవారు, కనీసం ఈ విధాత తలపున గీతం ప్రయత్నం చేయవచ్చు. ఎవరూ వినకపోయినా మేము వింటాము, గాత్ర మాధుర్యం కన్నా ప్రయత్నం ముఖ్యం మిత్రమా, మొదటి అడుగు వెయ్యి, మంచి వైపు దేవుని వైపు అరిషడ్వర్గాలకు దూరముగా.

మెరిసే తారలదేరూపం అంటూ తను వర్ణించిన తీరు, అత్యంత మనోహరం. సినిమా చూడకుండా, ఉత్త పాట వింటే మధ్యలో మాటలు లేకుండా, ఇది దేవత పై పాట లాగా ఉంటుంది. మనకు దేవత కనపడదు కదా. ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా అంటూ వేదాంతాన్ని తెలిపారు. అంతే కదా? గానాన్ని గాత్రం చూడలేదు.

1) విధాత తలపున

విధాత తలపున ప్రభవించినది, అనాది జీవన వేదం - ఓం
ప్రాణ నాడులకు స్పందననొసగిన, ఆది ప్రణవ నాదం- ఓం
కనుల కొలనులో ప్రతిబింబించిన, విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం

సర సుస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం

ప్రాగ్దిశ వీనియపైన దినకర మయూఖ తంతృల పైన, జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా, విశ్వకావ్యమునకది భాష్యముగ ||విరించినై||

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాదతరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా, సాగిన సృష్టి విలాసమునే ||విరించినై||

నా ఉచ్చ్వాసం కవనం, నా నిశ్వాసం గానం
సరసుస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం, విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

2) మెరిసే తారలదేరూపం, విరిసే పూవులదేరూపం, అది నా కంటికి శూన్యం
మనసున కొలువై, మమతల నెలవై, వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం, నీ రూపం అపురూపం

ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో, పులకరించి, పురివిప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు, గుణగణాలకై, నెమలి వెదుకులాడేనా ||నా కన్నులు చూడని||

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా.., గానం పుట్టుక గాత్రం చూడాలా..
వెదురును మురళిగ మలచి, ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవన నాదం పలికిన నీవే..
నా ప్రాణ స్పందనా.., నీకే నా హృదయ నివేదనా..

merise taraladerupam virise puvvuladerupam
Banerjee, Suhasini, Moon Moon Sen, Meena, Samyuktha
LYRICS - SIRIVENNELA, MOVIE - SIRIVENNELA, SINGER - SP BALU, 1986
Director: K. Viswanath, Music: K. V. Mahadevan
Producer: Ch. Ramakrishna Reddy, N. Bhaskara Reddy, U. Chinaveerraju  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,381; 104 తత్వాలు (Tatvaalu) and views 225,752
Dt : 20-May-2019, Upd Dt : 20-May-2019, Category : Songs
Views : 4232 ( + More Social Media views ), Id : 115 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sirivennela , vidhata , talapuna , merise , taralade , rupam , Banerjee , Suhasini , Moon Moon Sen , Meena , Samyuktha , Viswanath
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content