ఉద్యోగం పెళ్ళి భాగస్వామ్యం లో తప్ప, మిగతా విషయాలలో కలసి పని చేద్దాం. స్నేహితులం విలువలు లేకుండా - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2181 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2216 General Articles and views 2,481,545; 104 తత్వాలు (Tatvaalu) and views 266,460.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Lets work together in all other matters, except in the matter of Job, Marriage and Partnership. We are friends like others with need and opportunity but no values. ఉద్యోగం పెళ్ళి భాగస్వామ్యం విషయం లో తప్ప, మిగతా విషయాలలో తప్పకుండా కలసి పని చేద్దాం. మనం స్నేహితులం అవసర అవకాశవాదముతో అందరిలా విలువలు లేకుండా.*

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
- ఉచిత ఉద్యోగ సమచార పంచుకునే సేవ Free Job information sharing seva

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు

- - -

పర్లేదు అబ్బాయి, అలా ఓపెన్ గా ఉండాలి, తప్పు లేదు. ఆల్ ద బెస్ట్. నిజమే ఈరోజుల్లో ఎవరూ అలా లేరు, అంత సంస్కారం నీతి నియమాలతో అంటావు. అది ఓకే, మన ఇంట్లో కూడా అలా లేరు అని ఒప్పుకున్నావు చూసావా, అది గ్రేట్. దాని పర్యవసానం తెలిసే, ఆ దోవ వీడను ఉద్యోగం రాకపోయినా అంటున్నావు, కొత్తవి గుణాలు నేర్చుకోను అశక్తుడను అంటున్నావు, అంతేనా? మరి ఇంత అప్పు తో పంపిన అమ్మా నాన్నకు ఇదే మాట చెపుతావా? వారు మన మీద పెట్టుకున్న ఆశలకు ఇదే జవాబా?

మరి సాఫ్ట్ స్కిల్ల్స్ లేకపోతే, మరి హార్డ్ స్కిల్ల్స్ మాత్రం ఉన్నాయని, ఉద్యోగం ఎలా వారు నమ్మాలి, రేపు పెళ్ళి వారు ఎలా నమ్మాలి, చెప్పు? ఎలా కష్టపడి నేర్చుకుంటావు? ఎలా నమ్మకం కలిగిస్తావు? ఇదే మాట ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్న స్టోర్ లో చెప్పగలవా? చెపితే, వారు ఉంచుతారా? పోనీ నీకు క్రుతజ్ఞత, విశ్వసనీయత, నీతి నిజాయితీ ఉన్నాయని ఎలా నిరూపిస్తావు, పోనీ నువ్వే చెప్పు సాఫ్ట్ స్కిల్ల్స్ లేకుండా?

సత్వగుణం, సంస్కారం, మర్యాద, నీతి నిజాయితీ తో, క్రుతజ్ఞత విశ్వసనీయతతో, అలాగే తెలుగు రాయడం అంటే మానసిక నియంత్రణ ఉండాలి అంటే కష్టమే. ఇవి ఎవరూ దొంగిలించలేని సుగుణాలు అని మీ పెద్దలు నేర్పలేదా? మరి గుడి కి ఎందుకు ఇంతమంది వెళుతున్నారు, ఆత్మ ద్రోహం తో? పిల్లలకు భాగస్వామికి, ఏమి సంస్కారం నేర్పుతున్నారు? ముదుసలి తనం లో ఒంటరి తనానికే వీరే బాధ్యులు కదూ? దేవుడు కు సంబంధం లేదు కదూ? కపటం, నటన అంటున్నావు, శబాష్.

ధనం, అందం, అధికారం, వెన్నుపోటు గుండెపోటు తో దగ్గర దోవలో వెళ్ళి పతనం అవ్వడమే బెస్ట్ అంటావు. నిజమే రేపు మీరు కూడా పెద్ద నాయకులు ధనవంతులు అవ్వవచ్చు ఇంకో దోవలో. మరి వారికీ చివరకు పతనము తప్పలేదు కదా ఎన్ని అందలాలు, అధికారం, బలగం, సంపదలు ఉన్నా? మనశ్శాంతి ఉన్నదా వారికి?

మరి బయట ఇంత నిరుద్యోగం ఎందుకు ఉంది? అందరూ విలువలు లేని వారేగా, ఎందుకు ఇతరులకు సహాయం చేయరు? అందరూ ఈ దోవలో వెళ్ళవచ్చుకదా? మరి రేపు పెళ్ళిలో అలాగే వెళితే, విడాకులేగా, టీవీ, పేపర్ చర్చలేగా?

నీతి గురించి అనుకోవడం, టైం వేస్ట్ ఇద్దరు కూ కదా, అటు వారికీ ఇటు మీకు, నువ్వు అన్నట్లే చేద్దాం. రేపు మీ ఇంట్లో పనిమనుషులను, వ్యాపారం లో భాగస్వామిని, పెళ్ళికి వ్యక్తులను, నీతి నిజాయితీ లేకపోయినా, మీరు తీసుకుంటారు, అంతేనా?

మనం స్నేహితులం, అవసర అవకాశవాదముతో అందరిలా, విలువలు లేకుండా. సరే, ఉద్యోగం పెళ్ళి భాగస్వామ్యం విషయం లో తప్ప, మిగతా విషయాలలో తప్పకుండా కలసి పని చేద్దాం, ఎందుకంటే ఆ రెండో వ్యక్తి గుణాలు మనకు సరిపోవాలి కదా. వారూ మనలాగా నీతి నిజాయితీ లేనివారు దొరకాలి కదా? అలాంటి వారు దొరికితే, తప్పక మిమ్మల్ని వారికి కలుపుతాము.

సహనం, ఓర్పు, బాధ్యత, స్పందన, నేర్పు, లౌక్యం, అవసర అవకాశ వాదం లేకపోవడం, తన మన, విశ్వసనీయత క్రుతజ్ఞత, పెద్దల గౌరవం, జీవిత కష్టాలను నవ్వుతూ ఎదుర్కునే ధైర్యం, ఉద్యోగం పెళ్ళి అలాగే ఇతరుల భాగస్వామ్యం లో ఇతరుల సాత్విక అభిప్రాయాలను మన్నించడం ఉండాలి. లేదంటే ఇరువురు, ఎల్లకాలం అక్కడ కలసి సాగలేరు, వెన్నుపోటు గుండెపోటు లేకుండా. దానికి మానసిక నియంత్రణ సామర్య్ధ్యం ఉండాలి.

మనల్ని నమ్మిన వారిని మనం మోసం చెయ్యకూడదు కదా. 10 మంది పైగా ఉద్యోగాలు లో, మనకు ఎందుకు ప్రత్యేక స్థానం ఉన్నది, ఇస్తారు, ఇచ్చారు? ఆ స్తిర ఓపెన్ గుణాలకే కదా? రేపు మీ ఇంట్లో వారికే, ఈ గుణాలు లేని వారిని ఉద్యోగం/ పెళ్ళి/ అద్దెకు/ వ్యాపారం కు తెస్తే, మీరు మమ్మల్ని నిందించరా. పర్లేదు అండీ అంతా మనలాగే మోసమే కదా అని ఆనందముగా అభినందిస్తారా?

నీలో నచ్చే గుణం అది, కనీసం కొన్ని సార్లు అయినా, వాస్తవం, చాటుగా ఒప్పుకుంటావు. చాలా మంది కి తమ తప్పు, తమ గుణం ఒప్పుకోవాలి అంటే కష్టం, భయం, పిరికి పందలు, ఆత్మ ద్రోహం తో పతనం అవుతారు. దానికి వంద జన్మలు కావాలి. తర్వాత సాధన వంద జన్మలు. కానీ నువ్వు కేవలం సాధన జన్మలు చాలు, లోపం ఒప్పుకున్నావు కాబట్టి. శభాష్, అభినందిస్తున్నాము.

- - -

ఇప్పుడు నే ఒకరు చూపించిన అబ్బాయి, నిన్న ఓ గంట మాట్లాడిన తర్వాత, మన 6 ఉద్యోగాల సాఫ్ట్ స్కిల్స్ వివరాలు చదివాక, అర్ధం అయినాక, నిన్న అన్నిటికీ నేర్చుకుంటాను ఏడాది ప్రయత్నం చేసి తన నిత్య పనులతో అని ఒప్పుకున్నాక, ఈరోజు ఆలోచన చేసి మా వలన కాదు సాఫ్ట్ స్కిల్స్ అని స్పష్టం గా చెప్పారు. అలా ఓపెన్ గా ఉండాలి అని అభినందించాం, ఎందుకంటే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్టూరం మేలు కదా, ఉద్యోగం ఇచ్చే వారికి అలాగే తీసుకునే వారికి, పెళ్ళి అయినా అంతే. మన గుణ కర్మల వడపోత బాగానే ఉపయోగం అని అర్థం అయింది.

బయట ఫేక్ బయోడేటాలు, ఫేక్ కాల్స్, ఫేక్ పని చేయడాలు, ఉత్తుత్తి ఫోన్ కాల్స్, అభ్యర్ధుల సమాచారం దొంగిలించడం, ఆశ చూపడం, మోసం చెయ్యడం, 6 నెలల జాబ్ అని చెప్పి 1 నెలలో తీయడం, జీతాలు సరిగ ఇవ్వకపోవడం, మానసికముగా శారీరకముగా వాడుకోవడం, ఇంకా ఎన్నో మోసాలు.

మొన్న ఒక పెళ్ళి వారికి కూడా, మీ ఇద్దరి గుణాలు కలవవు అని స్పష్టముగా, వారి జవాబుల నుంచే, ఉదాహరణలతో చెప్పాము/ నిరూపించాము. 2 వ ఆప్షన్/ దోవ కూడా చెప్పాము. మీరు వీసా, ధనం, పదవి, అధికారం, అవసరం, అవకాశం కోసం పెళ్ళి చేసుకుంటే/ చేసుకోవాలి అనుకుంటే, మా సలహా పట్టించుకొనవసరం లేదు అని.

వారు నవ్వి అన్నారు, 2 వ ఆప్షన్/ దోవ అయితే, మీతో అసలు చెప్పము కదండి. 5+ ఏళ్ళుకు పైగా, గుణ కర్మలు నేర్పారు. ఆ విడాకులు, టీవీ పేపరు, తగవులు, అరుపులు, తన్నులు, కేసులు ఎందుకు తలనొప్పి అన్నారు. అది ముందు చూపు అంటే.

సత్వ, రజో, తమో గుణాల గుణ కర్మలను బట్టి సాగితే, ఆ ఇరువురికి గొడవలు రావు కదా.

- - -

అందరికీ ఏళ్ళుగా విన్నవించాము - మావి మీరు లేదా ఇంకొకరు చదివారా చదవలేదా, ఒక్క రోజు లేదా నెల లోనే చదవకుండా, మీ ఇంటి పెంపక సంస్కారం బట్టి డిలీట్ చేశారా మూలన పడేసారా, అనే దాని వలన మాకు మరియు మీకు ఉపయోగం లేదు.

మరి ఎందుకు ఈ సందేశాలు? మీలో గుణవంతులు, మీ కుటుంబ సుగుణాల దుర్గుణాల, తప్పు ఒప్పు ఏదైనా సరే, ఎంతవరకు ధైర్యంగా ఓపెన్ గా పంచుకున్నారు, ఒప్పుకున్నారు, సరిచేసుకున్నారు అనేది మాత్రమే, మీకు మరియు మాకు ఉపయోగం మిత్రమా.

ఎందుకంటే, పంచభూతాల శిక్షణ మన కుటుంబానికి వద్దు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వంలో. ఇన్ని రోజులు మీరు పారిపోకుండా ఉన్నారు అంటే, స్పందిస్తూ ఉన్నారు అంటే, ఎక్కడో మీలో సత్వ గుణం వైపు నడవాలి అనే చిరు కోరిక ఉంది. అది పెరిగి పెరిగి పెద్దది అయితే, మీరూ అశాంతి నుంచి బయటపడతారు.

అంటే మీ కుటుంబ మానసిక నియంత్రణ సామర్థ్యం మాత్రమే ఉపయోగం, సమ సమాజం కు. మైండ్ కంట్రోల్ టెక్నిక్స్ మీకు ఏళ్ళుగా నేర్పాము, మీతో సవినయముగా పంచుకున్నాము. పంచ ఇంద్రియ నిగ్రహం నేర్పాము. అవి మీకు మాకూ ఎంతైనా సహాయం చేస్తాయి, చేస్తాము. అవి పిల్లలకు, స్కూలులో కాలేజీలో జీవితములో, బయటి ప్రపంచము మాయలు మోహాలలో పడకుండా కాపాడుతుంది.

సత్వ గుణం వెలికి తీయడం కు, మనల్ని మనం తెలుసుకుందాం లో భాగమే, కేవలం అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం మూలమే, ఇన్ని కధనాలు, మిమ్మల్ని మమ్మల్ని కూడా మాయ నుంచి కాపాడటం కోసం, వివిధ పద్ధతుల్లో.

ఈ నెలలో ఒక కంపెనీని, ఒక పెళ్ళి ని, భవిష్యత్ పతనము/ సమస్యలు/ కన్నీరు/ కష్టాలు నుంచి, కాపాడాము అని సవినయముగా తలవంచి మీకు విన్నవించుకుంటున్నాము. ఇంకో తల్లికి, తండ్రికి ద్రోహం జరిగి కన్నీరు రాకుండా, మా ప్రయత్నము మేము చేసాము.

ప్రయత్నం చేసి ఓడినా, మనకు పుణ్యమే. కానీ ప్రయత్నం చేయకపోతే, మహా పాపం, మన పిల్లలకు పెద్దలకు కుటుంబానికి, సాత్విక దైవ అండ దొరకదు. రజో తమో గుణాలతో, మామ తండ్రి తల్లి బాబాయి, వెన్నుపోటు గుండెపోటు తప్పదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2216 General Articles and views 2,481,545; 104 తత్వాలు (Tatvaalu) and views 266,460
Dt : 13-Aug-2024, Upd Dt : 13-Aug-2024, Category : General
Views : 275 ( + More Social Media views ), Id : 2160 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : work , together , matters , except , Job , Marriage , Partnership , friends , others , need , opportunity , values
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content