పూజ ఎందుకు చేయాలి, లాభం? చేయకపోతే? దీపం? శ్లోకం చదివితే? దేవుడంటే ఏంటి? - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,374; 104 తత్వాలు (Tatvaalu) and views 225,061.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* పూజ చేయక పోతే, కళ్ళు లేదా సంపదలు పోతాయా?
* బీదవారు కూడా, కాణీ ఖర్చు లేకుండా, నైవేద్యంగా?
* చైతన్యము పోతే, మనిషి?
* అసలు పూజతో ఎవరికి ఉపయోగము?
* మనసును స్థిరపరచడం?
* ఆత్మహత్యలు, తాగుడు, జూదము, మత్తు
* త్రాటకం?
* నాలిక మొద్దు బారడం? భాష మీద?
* మూఢ విశ్వాసాలకు, బాబాలు, జంతు?
2 min read time.

పై ప్రశ్నలు, చిన్న పిల్లలు అడిగారు అంటే అర్ధం ఉంది, కానీ నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా, ప్రపంచ వ్యామోహము లో మునిగి, అరిషడ్వర్గాలలో తేలుతూ కూడా, ఇదే ప్రశ్న అడుగుతునారు.

మనము వెంటనే, పూజ చేయక పోతే, కళ్ళు పోతాయి లేదా సంపదలు పోతాయి, లేదా చేస్తే సంపదలు వస్తాయి అంటాం. ఎందుకంటే, మనకు కూడా, పూర్తి అవగాహన ఉండదు, పూజ ఎందుకు అని.

మనము పెట్టె ప్రసాదము దేవుడు ఆరగిస్తున్నారా? ఆరగిస్తే, ఇక నైవద్యం పెడతామా, ఆయన కడుపు నిండాలంటే, ఎన్ని గుండిగల ప్రసాదం పెట్టాలి, తిరుపతి వెంకన్న దగ్గర పెట్టిన విధముగా?

అందుకే ఆయన తెలికగా తెలివిగా, బీదవారు కూడా పెట్టగలిగే విధముగా, కాణీ ఖర్చు లేకుండా, మన మనసు నైవేద్యంగా పెట్టాలి అని, ఎప్పుడో చెప్పారు.

దేవుడు నిరాకారుడు నిరంజనుడు, ఈ ప్రపంచమంతా వ్యాపించిన వాడు నడిపిస్తున్నవాడు, నీలో నాలో ఉన్నాడు చైతన్యములా. ఆ చైతన్యము పోతే, మనిషి శవము తో సమానము. కాకపోతే, అది అర్ధం కావడానికి ఆచరణలో సాధన చేడానికి, మనసు నిలవాలి సహకరించాలి. దానికే పూజ మొదటి మెట్టు, మన కోసం.

మనము పూజ చేయలేదని ఆయనకు ఎందుకు కోపము, కళ్ళు పోగొట్టే అంత కసి ఆయనకు ఎందుకు? బిడ్డల మీద తల్లి తండ్రికి, అంత కోపం వస్తుందా?

అసలు పూజతో ఎవరికి ఉపయోగము, దేవునికి అవసరము లేదు. దానివలన మనకే ఉపయోగము, ఇన్ని అవకాశాలు సౌకర్యాలు లేని వారు ఎంతో మంది ఉండగా మనకు మంచి చేసిన దేవునికి క్రుతజ్ఞతలు తెలుపుతూ, ప్రసాదం తింటుంది మనమే, మనశ్శాంతి మనకే కదా?

తెలియని వారికి అలా కళ్ళు పోతాయి అని చెపితే, వారికి దేవునిపై భయం పెరగవచ్చు లేదా మనసు విరిగే ప్రమాదం ఉంటుంది కదా, ఇంకా దేవునికి దూరంగా వెళ్ళే పిచ్చి జనమూ ఉన్నారు.

పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, అంటే మనము మనసు తో చేసే వ్యాయామం, అంటే మానసిక సాధన. మనసును స్థిరపరచుకోవడానికి ఇదొక మార్గము. అందుకే పూజలో భాగం ధ్యానము కూడా మొదట, తర్వాత, ధ్యానం లోనే దేవుని పూజ.

మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి, మన మెదడుని మనమే సక్రమమైన పద్దతిలో పెట్టుకునే, ఓ ప్రక్రియ. మనసు నియంత్రణ లేని వారు, ఎలా పతనమౌతున్నారో, చూస్తున్నారు కదా? ఆత్మహత్యలు, తాగుడు, జూదము, మత్తు మందు, కోపము, తల్లి దండ్రులను తూలనాడడము వదిలేయడము, ఇంకా ఎన్నో విచిత్రాలు చూస్తున్నాము, చూస్తాము.

నూనే లేదా నెయ్యి దీపం వెలుగులు పెట్టడం అన్నది, త్రాటకం అనే ఓ యోగ ప్రక్రియ అంటారు. రోజూ ఓ 3 నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే, కంటి జబ్బులను అరికట్టవచ్చు అని, పెద్దలు అంటారు.

ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే లేదా 108 నామాలు చదివితే, నాలిక మొద్దు బారదు, మాట స్పష్టత వస్తుంది. అది నాలికకు ఓ వ్యాయామము అనవచ్చు కదా? అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా, పలకగలిగే శక్తి వస్తుంది, ఉచ్చారణా అలాగే ధారణ శక్తి పెరుగుతుంది.

భాష మీద పట్టు పెరిగితే, సభా లేదా పదిమంది లో మాట్లాడే, భయం కూడా‌ పోతుంది, ధైర్యం వస్తుంది. బెరుకుగా, గొంతు ఎత్తి మాట్లాడలేని బయటకు చెప్పలేని వాళ్ళను, పదిమంది లో మాట్లాడలేని వారిని, ఎంతో మందిని చూస్తున్నాము కదా?

పూజ అంటే చాదస్తం కాదు. మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పగలరు, మనల్ని మనము సరిగ్గ మార్చుకునే విధానము అని చెప్పగలరు.

మన హైందవ ధర్మాని అనుసరించండి, ప్రోత్సహించండి, మన పిల్లలో. బయట మతాలవారికి, మన దేవుళ్ళ గురించి గొప్పలు చెప్పుకుని, వారిని మన వైపు తేవాల్సిన పని లేదు, మన హైందవ జనాభానే, ఆచరణ లో ముందుకు తీసుకుని వెళ్ళ గలిగితే చాలు.

అదే సమయంలో మూఢ విశ్వాసాలకు, అంటే బాబాలు అలాగే జంతు వధలకు, దూరం గా ఉండే విధంగా, పిల్లలను తయారు చేయాల్సిన బాధ్యత, మనపై లేదంటారా?

సేకరణ సవరణ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,374; 104 తత్వాలు (Tatvaalu) and views 225,061
Dt : 16-Mar-2021, Upd Dt : 16-Mar-2021, Category : Devotional
Views : 1265 ( + More Social Media views ), Id : 1036 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : worship , benefit , issue , god , meditation , speech , talk , mind control , slokam , lamp
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content