వార్త విమర్శ, విజయసాయి లోకేష్ లాగా ఘాటు గా లేదు? RRR చేస్తోంది తప్పు అనరా? - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,217; 104 తత్వాలు (Tatvaalu) and views 224,948.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఏవండీ మీరు వార్త లేదా విమర్శ, విజయసాయి లేదా లోకేష్ గార్లు లాగా ఘాటు గా రాయడం లేదు, ఎందుకు? 2. ఆరారార్ చేస్తోంది తప్పు అనరా?

జవాబు. ముందే చెప్పాము , మనకు అన్ని పార్టీల నాయకులు ఒకటే. అందరినీ పొగడాలి, సుతిమెత్తగా తెగడాలి, తప్పు సాక్ష్యం తో చూపిస్తూ.

2. తెదేపా వంశీ మరియు కరణం, జనసేన రాపాక గార్లు ను, గెలిపించిన జనం ను పిచ్చి వెర్రి వారిని చేసి, ఇటు వైపు తిరగడం, మీరు కరెక్టు అంటారా? నాయకత్వ విశ్వాసం గౌరవం కృతజ్ఞతలు మర్యాద, వీరు చూపించారా? మారి, వారి ఊరికి, లేదా చీరాలకు తెచ్చింది ఏమైనా ఉందా?

మడమ తిప్పని మాట తప్పని, మన జగనన్న కు చెడ్డ పేరు తెస్తుంది, సలహా దారులు, మంత్రులు కాదా? అందర్నీ మేం ఇటు లాగేస్తాం అని? వాస్తవాలు చెప్పి, మోహం లో ఉంచకుండా మార్చవద్దా? ఇప్పుడు మా మాటలకు నవ్వుతారు, సందేహము లేదు.

గతంలో చంద్రన్న ప్రభుత్వం లో కూడా చెప్పాం, లోకేష్ గారికి కి నచ్చిన ఒక నియోజకవర్గం ఇచ్చి, సొంతం గా కష్టపడి తిరిగి ఎమ్మెల్యే గా గెలిచి, మంత్రి పదవి చేపట్టమని. ఓడినా నష్టం లేదు, పదేళ్ల అనుభవం వస్తుంది అని. పిచ్చా అని నవ్వారు తెదేపా వాళ్ళు అప్పుడు, ఆ తర్వాత జనం కూడా నవ్వారు కదా గత ఎన్నికల్లో.

మన 151 ఎమ్మెల్యేల తృప్తి ఎటూ మనకు ఉంది, చాలదా? భవిష్యత్తు లో మరలా మనకు అన్ని వస్తాయా? మిగతా 23 ఎమ్మెల్యేలు లో నచ్చి వచ్చే వారిని, రాజీనామా తో గెలిచాక, మనలో ధైర్యంగా కలుపుకుంటే, మనకు నష్టం ఉందా? వారు ఓడినా, మన 151 తగ్గదు కదా? వారికి కార్పొరేషన్ పదవో ఇంకోటో ఇవ్వవచ్చు.

అసలు వారు అవసరమా? చంద్రన్న కు ప్రతిపక్ష హోదా లాగి, సింపతీ పెంచి, మనం గత చంద్రన్న లాగా నియంత అవుదామా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు తో, సునాయాసంగా విజయం ఇద్దామా? గతంలో వారూ ఇలాగే, భ్రమ లో ఉన్నారు కదా? మన అభివృద్ధి తో దెబ్బ కొట్టాలి కానీ, ఇలాంటి చిల్లర పనులు తోనా? అప్పుడు దొందూ దొందే కదా.

జనం, మూడో నాయకుని కోసం చూడరా? అదృష్టవశాత్తు, స్ధానిక కార్యకర్తలు లేని, బలహీన బీజేపీ జనసేన, నిద్రమత్తు లో జోగుతూ రాజధాని లో, విశ్రాంతి తో సరిపోయింది. లేకపోతే కరోనా సమయంలో, వైద్య మరియు ప్రభుత్వ లోపాలు, అన్ని ఊళ్ళలో ఫోటోలు వీడియోల రూపములో ఎత్తి చూపితే, మన పరిస్థితి ఏమిటి?

ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు అంటే ఆత్మాభిమానం లేకుండా, నాయకుని కి సలాం కొట్టే బానిసలు కాదు, తన ఊరు, రాష్ట్రం, ప్రజల కోసం, తప్పు ఉంటే, ఎవరినైనా ప్రశ్నించాలి. బయట అయినా లోపల అయినా. ఆరారార్ గారు, గమ్ముగా ఉండి, ఇంకో పార్టీ వైపు మొగ్గితే మీకు కరెక్టే నా? మీకు నచ్చనిది ఆయన అరుపులా లేక బయటకు వెళ్ళే / పంపే ప్రయత్నం మా? అసలు ఆయనకు ఇంత పబ్లిసిటి ఇచ్చింది ఎవరు, మనం కాదా?

కాబట్టి ఆయన చేసేది కరెక్ట్ లేదా తప్పు అని అనలేము, మన వైపు కూడా మచ్చ ఉంది కాబట్టి. అన్యాయం గా దూకిన వారు, ఇబ్బంది పెట్టిన వారు ఎవరైనా, భవిష్యత్తు లో ఇబ్బంది పడక తప్పదు.

1. పదవులు సౌకర్యాలు పొందే రాజకీయ నాయకులు లా, మనం అంటే మంచి విలేఖరులం, విమర్శలు ఘాటుగా చేయలేము, చేయకూడదు. పార్టీలు వైపు ఉండే, పత్రికా విలేఖరుల కు, తప్పదు ఎటూ, లేకపోతే ఉద్యోగం ఆదాయము ఉండదు.

మన ఉద్దేశం, నాయకులు ను అవమానించడం కాదు, సుతిమెత్తగా విమర్శలు చేస్తూ, విషయం వివరించి, వారి చేత అంతో ఇంతో, మంచి పని చేయించడం. వింటారా అంటే, వినకపోవచ్చు.

మొన్న మీ జిల్లా కలెక్టర్ లు, ఫేస్బుక్ లు పక్కన పడేశారు అన్నాము. అధికారులు నంబర్లు పారదర్శకంగా వెబ్సైట్ లో, పెట్టలేదు అన్నాము. మరి తమ జిల్లా లలో, ఎంతమంది సరిచేయించారో తెలీదు. పధకాలు కు మన పేర్లు వద్దన్నా, కక్కుర్తి తో, మరి చెప్పారో లేదో తెలీదు.

మన పరిధిలో నే మనం ఉండాలి, సంస్కారం గా. వారి నిర్లక్ష్యం ఫలితాలు, వారు మరియు వారి పిల్లలే అనుభవిస్తారు.

గత ప్రభుత్వం లో, ఆర్భాటంగా తిరిగిన నాయకులు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? చాటుగా ముసుగులో సిగ్గుతో, విశ్రాంతి తీసుకోవడం లేదా విలువ లేకుండా? రేపు వీళ్ళు అంతే, అలాగే ప్రజలు అంటే నిర్లక్ష్యంగా ఉంటే. చేసిన ఖర్మ అనుభవించక తప్పదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,217; 104 తత్వాలు (Tatvaalu) and views 224,948
Dt : 17-Oct-2020, Upd Dt : 17-Oct-2020, Category : Devotional
Views : 746 ( + More Social Media views ), Id : 760 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : write , aggressive , vijayasai , lokesh , rrr , raghu rama , correct , jagan , chandrababu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content