APLatestNews.com top Banner

Social Media links
40 ఏళ్ళకు ఇప్పుడు ఎంత అభివ్రుద్ది చెందామో లేక పతనమయ్యామో అనుభవజ్ఞులు మీరే చెప్పండి? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

1. అప్పుడు, అందరు పిల్లలు కలగాలి అని కోరారు. ఇప్పుడు పిల్లలు అంటే భయపడుతున్నారు. వద్దు బాబోయ్ అంటున్నారు, లేదా ఒక్కరు చాలు అంటున్నారు, గోల మరియు ఖర్చులు భరించలేక.

2. అప్పుడు, పిల్లలు పెద్దలను గౌరవించారు. ఇప్పుడు పెద్దలు, పిల్లలను గౌరవిస్తున్నారు. దండాలు పెట్టి బతిమిలాడి, చదువు తిండి సౌకర్యాలు ఇచ్చి తమ మాట వినేటట్లు చేసుకోవడానికి, నా నా పాట్లు పడుతున్నారు.

3. అప్పుడు, పెళ్ళి తేలిక విడాకులు చాలా కష్టము. ఇప్పుడు, పెళ్ళి చాలా కష్టము, విడాకులు తేలిక.

4. అప్పుడు, చుట్టుపక్కల అందరూ తెలిసే వాళ్ళు. ఇప్పుడు, మనమూ మన ఇరుగు పొరుగు అంతా కొత్త, తెలియని వాళ్ళమే.

5. అప్పుడు, పల్లెటుళ్ళ నుంచి పనికోసము పట్టణాలకు వలస వచ్చేవారు. ఇప్పుడు పట్టణ వాసులంతా పల్లెకు పోతున్నారు, మనశ్శాంతి కోసం.

6. అప్పుడు, ఆనందముగా కనపడాలి అని లావెక్కేవారు, బొద్దు గా ఉండే వారు. ఇప్పుడు ఆరోగ్యముగా ఉండాలని సన్నబడుతున్నారు, చిక్కిపోవడానికి ప్రయత్నాలు.

7. అప్పుడు, ధనవతులు బీదవారిగా నటించేవారు, ఏమీ లేదు అన్నట్లు గా ఉండేవారు. ఇప్పుడు బీదవారు, ధనవతులుగా నటిస్తున్నారు. ఏమీ లేకపోయినా, భాగ్యవంతులుగా ప్రతి పనిలో నడవడికలో, అప్పు చేసైనా నటిస్తున్నారు.

8. అప్పుడు, ఒక్కడు పని చేసి, ఇంటి మొత్తాని పోషించేవాడు. ఇప్పుడు అందరు పనిచేసి, ఒక్క పిల్లడుని పోషిస్తున్నారు.

9. అప్పుడు, జనం కు చదువు కోవడం, పుస్తక పఠనం హాబీ. ఇప్పుడు ఫేస్బుక్ వాట్సాప్ సోషల్ మీడియా అంటే ఇష్టం.

40 ఏళ్ళు అంటే 1980, నిన్న లాగే అనిపుస్తుంది కదూ. కఠోర సత్యాలు, ఇప్పుడు జీవితములో ఇవి. కాదంటారా? మనము ఎదుగుతూ ఉన్నట్లు గా కనిపిస్తూ నటిస్తూ భ్రమలతో, పతనము అవుతున్నాము కదూ.

ఇంగ్లీష్ వాట్సాప్ సందేశానికి అనువాదం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 753 General Articles, 46 Tatvaalu
Dt : 14-Sep-2020, Upd Dt : 14-Sep-2020, Category : General
Views : 50 ( + More Social Media views ), Id : 699 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : veterans , elders , improved , collapsed , 40 years
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content