ఉగాది తెలుగు సంవత్సరాది వారం లో - దీర్ఘకాలిక గ్రహాలు మార్పు - మన బుద్దులు రాతలు గతులు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,872,925; 104 తత్వాలు (Tatvaalu) and views 225,546.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

Ugadi Telugu year change of long-term planets - our mind fate think

ఉగాది తెలుగు సంవత్సరాది వస్తుంది ఇంకో వారం రోజులు లో, ఉత్తమ గురువు లకు, శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు ముందు గా, శిరస్సు వంచి వినమ్రతతో.

లక్షలు కోట్లు తీసుకున్న సొంత పిల్లలే మాకు సందేశాలు వారం వారం పంపరు, కానీ ఏమీ సంబంధం లేని మీరు, మమ్మల్ని ఉచితం గా సంవత్సరాలు గా తలచుకుంటున్నారు అనే, మీ గొప్ప మనసు కు వందనం.

మన మానసిక బుద్దులు మంచి గా ఉంటే, అంతా మంచే జరుగుతుంది, గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు.

ఏప్రిల్ నెలలో దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శని, రాహు, కేతువు లు రాశులు మారుతున్నాయి, అదే తెలుగు ఉగాది గొప్పతనం. అంటే మన బుద్దులు రాతలు గతులు కూడా మారతాయి, జాగ్రత్తలు సుమా. శని దేవర 70 రోజులు అలా ముందుకు వెళ్ళి, మరలా వెనక్కు వస్తారు.

గురువు లలో ఎవరైనా, కాలంతో పాటు మారి, ముదుసలి తల్లి దండ్రులు సేవ, అరిషడ్వర్గాలు సాధన, సనాతన ధర్మం ఆచరణ, సంస్కార పెంపకం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక జ్ఞానం, మాతృభూమి భాష  మూర్తి గురించి, మంచి చదవం వినం ఆచరించం ఆదరించం, అది మా దుర్యోధన రావణ వంశం లక్షణం, మా పిల్లలు స్నేహితులు బంధువులు కూడా అంతే, అని ధైర్యంగా చెబితే, ఇక మీకు పంపము వృధా గా. ఇంకొకరి కి పంపుతాము. పంపింది చదవకపోయినా, జవాబు లేకపోయినా పాపమే

ఎందుకంటే మన బుద్దులు గ్రహాలు తో అహాలతో మోహం లో మారతాయి కదా. గ్రహాలు గుణాలు కాలంతో, నీతి నియమాలు సంస్కారం మారకపోతే స్ధిరంగా ఉంటే, స్ధితప్రజ్ణ్జుడని అంటారు.

మనం ఎంత అజ్ఞానం కుసంస్కారం లో ఉన్నాము అంటే, ప్రజలు పన్నులతో పధకాలకు తమ కుటుంబం పేర్లు పెట్టడం తప్పు అని చెప్పలేని, మంచి వారిని మధ్య తరగతి వారిని నాయకులు గా ఎన్నుకోలేని, సమాజ దుస్థితి.

బ్లాక్ లో లేదా ఎక్కువ ధరలో సినిమా టిక్కెట్లు కొనవద్దు అమ్మవద్దు చూడవద్దని, టీవీ మాయ సెల్ ఫోన్ గేమ్ ల మాయ బిగ్ బాస్ కు దూరం అని, ఇంట్లో చెప్పలేని ఆపలేని దుస్థితి.

మానవత్వం కృతజ్ఞతలు తో, మన తల్లి దండ్రుల పెంపక సంస్కారం తో, వారానికి ఒకసారి అయినా అన్నం పెట్టిన, తెలుగు భాష లో ఒక పేరా రాద్దాం, వాక్సుద్ది తో ఓ శ్లోకం పద్యం పలుకుదాం బతికించుకుందాం, రుణం తీర్చుకుని, మన కన్న తల్లి ని సజీవ గురువు ని గౌరవిద్దాం, మన బతుకు సార్ధకం చేసుకుందాం, స్నేహితులతో ఆ మంచి పంచుకుందాం.

తెలుగు లో ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుదాం. అందరూ దైవ సంతానం అని అంగీకరిద్దాం, అహాన్ని స్వార్థం ను, కుంచితత్వ మనసు ను పక్కన పెట్టి, కాలానికి పంచభూతాలు కు బలి కాకుండా, కాపాడుకుందాం.

కృతజ్ఞతలు లేకుండా తెలుగు ను వదిలితే, మన తల్లి ని వదిలినట్లే, అంటే రేపు మన పిల్లలు వారి ప్రాపంచిక వ్యామోహ పతనం లో, మనల్ని కూడా వదిలినట్లు భవిష్యత్తు లో, కర్మఫలం తప్పదు.

సాఫ్ట్వేర్ లో ఒరాకిల్, జావా, డాట్ నెట్, టెస్టింగ్ లలో కొత్త సర్టిఫికెట్ లు ఉద్యోగాలు పొందే ప్రాపంచిక ధన వ్యామోహ శూరులు, తెలుగు భాష రాయడం కు పద్యం పూజ పలకడం కు, కన్నతల్లి రుణం కు, మూడు చెరువుల నీళ్లు తాగుతున్నారు. మాకు అవసరం లేదు అంటున్నారు.

మొన్న ఒకరు పంపిన వీడియో లో, మెట్రో రైలు లో ఓ కన్నతల్లి తన బిడ్డ కు పాలు ఇస్తూ నేల మీద కూర్చుని ఉంటే, కాలేజీ విద్యార్థులు విద్యార్ధిని లు, ఆమె కు చోటు ఇవ్వకుండా, కుర్చీ లలో దర్జాగా కూర్చుని, తమ తల్లి దండ్రుల వంశ పెంపక సంస్కారం ను, గర్వం గా ప్రపంచంకు చాటారు. ఇలాంటి వారు, సొంత భాష కు, తమ ముదుసలి తల్లి కి తండ్రి కి పిల్లనిచ్చిన అత్త మామకు, ఊరు కు దేశం కు మేలు చేస్తారా?

ఇలాంటి మంచి మాటలు సంస్కారం తల్లిదండ్రులూ చెప్పక, బంధువులూ స్నేహితులూ చెప్పక, మాలాంటి వారు అయినా (, మీరు మమ్మల్ని ఎన్ని తిట్టినా సరే), మరలా మరలా చెప్పకపోతే గుర్తు చేయకపోతే, అది మాకు దైవ మరియు ఆత్మ ద్రోహం అవుతుంది.

వేయి మంది లో ఒకరిగా ఉత్తమంగా ఉండాలి, దేవుని కోరిక కోరాలి అంటే, మోక్షం వైపు అడుగులు పడాలి అంటే, అరిషడ్వర్గాల సాధనతో.

సజీవ గురువు సేవ చేస్తూ, 30 ఏళ్ళు వయస్సు తర్వాత, అరిషడ్వర్గాలు ను జయించే బాట పట్టాలి. రేపు అబద్ధం మనది కాదు, ఈరోజు నిజం.

30 - 50 వయసు దాకా కాలం తో పరుగులు తీసి, లక్షలు సంపాదించి ప్రాపంచిక వ్యామోహం లో, ఆ తర్వాత వయసు ఉడిగి, రోగాలతో ఆ కోట్లు ఖర్చు పెట్టిన పోగొట్టుకున్న లేదా గుండెపోటుతో పోయి గోఫండ్ తో ఆన్లైన్లో వందమంది ముందు, ఆత్మాభిమానం అమ్ముకుంటే తాకట్టు పెడితే, లాభం ఏముంది?

అందుకే కరోనా, అణుయుద్ధం, ప్రకృతి భీభత్సం.

ఈ తెలుగు సంవత్సరం నుంచి అయినా మాతృభూమి, మాతృభాష, మాత్రుమూర్తి (3M) ద్రోహులుగా మిగలకుండా ఉందాం. ఏ ఒక్కటి తగ్గినా, మిగతావి లేనట్లే, దేవుని చేతిలో, శిక్ష తప్పదు.

మనసు లో అనుకుంటే ఆకలి తీరదు, కడుపు నిండదు కదా. అలాగే 3M పై అంటే మాతృభాష పై ప్రేమ ఉందని అబద్ధాలు చెబుతూ, మనల్ని మనం మోసం చేసుకుంటూ పోతే, మన పిల్లలు మన పరిస్ధితులు కూడా మనల్నే మోసం చేస్తుంది.

గుడి కి బొట్టు తోనే పోవాలా అనే వారికి, ఏ చేత్తో అన్నం తింటే తప్పు ఏమిటి అనే వారికి, పేరెంట్స్ కి మా పిల్లల సౌకర్యాలు ఎందుకు ఇవ్వాలి అనే వారికి, రీడ్ రిసీప్ట్ ఆపి దొంగలు గా ఉంటే తప్పు ఏమిటి అనే వారికి, పెద్ద తేడా లేదు. వారి అపరిమిత జ్ఞానం వితండవాదం కు, మనం నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తాం.

రాబోయే కాలం, ఇంకా హీనం గా, కరోనా సమయం లో, 2 ఏళ్ళుగా చదువు సంధ్య లేకుండా ప్రభుత్వ భిక్ష తో పాస్ అయిన, అపర మేధావి డాక్టర్ యాక్టర్ ఇంజనీర్ పొలిటీషియన్ రాబోతున్నారు, మనకు మరింత విజ్ఞానాన్ని పంచడానికి సుమా. ముందుంది ముసళ్ల పండుగ.

పాండవులు లా కష్టాలు పడుతూ, ఎంతమంది హేళన చేసినా, మంచి ఆచరణలో ఉంటే, దైవం ఎప్పుడు మనకు తోడుగా ఉంటారు.

అలా కాకుండా, కౌరవులు లా సుఖపడుతూ, ఇతరుల ను కష్టపడితే, మంచిని హేళన చేసిన, అహంకారం ఆధిపత్యం మూర్ఖత్వం తో మనం మన వంశం ఉంటే, దైవం దూరంగా ఉంటారు. ఛాయిస్ మనదే, ఫలితాలు తప్పవు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,872,925; 104 తత్వాలు (Tatvaalu) and views 225,546
Dt : 26-Mar-2022, Upd Dt : 26-Mar-2022, Category : General
Views : 639 ( + More Social Media views ), Id : 1315 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ugadi , telugu , year , planets , mind , fate , think , thoughts , shubhakrut
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content