APLatestNews.com top Banner

Social Media links
స్వామి భక్తి రకాలు - ఒకరు తమ స్వామి కి, వంశానికి తలవంపులు తెచ్చారు. ఇంకొకరు ఖ్యాతి తెచ్చారు - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఈరోజు పురాణం లోకి వెళదాం, స్వామి భక్తి లో రకాలు చూద్దాం. ఈరోజుల్లో కూడా, అది ఉపయోగమే, మన చుట్టూ ఉన్న వారు ఎలాంటి వారో అర్థం చేసుకోవడానికి. ఒకరు తమ స్వామి కి, వంశానికి తలవంపులు తెచ్చారు, వంశ నాశనము చేసారు. ఇంకొకరు తమ స్వామికి, తమ పరివారానికి ఖ్యాతి తెచ్చారు.

పురాణాల్లో ఇద్దరు మహా భక్తులు ఉన్నారు, అనితరమైన భక్తి వారిది, వారికి సాటి ఎవరూ లేరు. వారిద్దరూ మధ్య తేడా చూద్దాం. ఒకరిది స్వార్థం, ఇంకొకరిది త్యాగం.

ఒకరు రావణ బ్రహ్మ, శివ భక్తుడు. ఇంకొకరు ఆంజనేయుడు రామభక్తుడు. ఇద్దరూ గొప్ప భక్తులు సందేహం లేదు. రావణుడు లో ఎప్పుడూ త్రిగుణాలు మారుతూ, రజో తమో గుణాల ఆధిపత్యం, ఎక్కువగా ఉండి పతనమైనారు. ఆంజనేయుడు లోని, సాత్విక గుణం త్యాగం నిస్వార్ధం, తనని చిరంజీవి గా చేసాయి.

రావణుడు అన్ని నాకు కావాలి అనుకున్నాడు, నేనే పాలించాలి, నామాట సాగాలి. తన బలాన్ని బలగాన్ని, కేవలము తన ఆనందం సౌఖ్యం కోసం వాడారు.

ఆంజనేయుడు ఏదీ నాది కాదు, పరుల కోసమే నా జీవితం అన్నారు. తన బలాన్ని బుద్ధి ని పరుల కోసమే వాడారు.

శివుడు ప్రత్యక్షం కాలేదని, కైలాసాన్ని ఎత్త బోయాడు రావణుడు, అది స్వార్థం. లక్ష్మయ్య ను కాపాడటానికి, సంజీవని పర్వతం ను ఎత్తి తెచ్చారు హనుమయ్య, నిస్వార్ధం.

దంపతులు ను విడతీసాడు రావణుడు, దంపతులను కలిపాడు హనుమయ్య.

తనకున్న అమిత బలంతో, ముల్లోకాలను జయించి అందరినీ అవమానించారు, రావణుడు. తనకున్న బలంతో అందరినీ కాపాడారు, ఆ బలాన్ని కూడా, ఇతరుల అవసరానికి, అవసరమైన అప్పుడు, మాత్రమే వాడారు.

నేను రారాజు ను అనే గర్వం, గొప్ప శివ భక్తుడు నీ, అనే అహంకారం రావణుడు ది. నేను సేవకుడు ని, రామదాసు ని అనే, సాత్విక గుణం హనుమాన్ ది.

శివయ్య ను మెప్పించడం కోసం, పొట్ట లోని పేగులు తో సంగీతం పలికించారు, రావణుడు నిష్టగా. రామయ్య నాలోనే ఉన్నారు అని, గుండె చీల్చి చూపించారు, హనుమయ్య.

పరాయి స్త్రీ మోహం లో పతనమైనారు రావణుడు, సీతమ్మ ను తల్లి గా భావించి, తెచ్చి అప్పగించారు హనుమయ్య.

తన మోహం కోరికలు కోసం వరాలు, వాటి కోసం తపస్సు, రావణుడి ది. ఏ కోరికలు మోహం లేని తపస్సు, త్రికరణ శుద్ది గా, హనుమయ్య ది.

ఇలా ఎన్నో ఉదాహరణలు ఇద్దరు భక్తుల మధ్య తేడాలకు. మనలోని ఆలోచన లు, మన చుట్టుపక్కల ఉండే వారి ఆలోచన లు పోల్చుకుని జాగ్రత్తలు పడుతూ, సాత్విక గుణం పెంచుకోవాలి, మానసిక శాంతి తో బతకాలి, తనువు చాలించాలి అనుకుంటే మిత్రమా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 674 General Articles, 46 Tatvaalu
Dt : 29-Jul-2020, Upd Dt : 29-Jul-2020, Category : Devotional
Views : 64 ( + More Social Media views ), Id : 619 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : types , swami bhakti , one brings shame , swami , family , fame , ravana , hanuman
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content