Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్నికల ముందు ఏమి చెప్పారో, దానికే కట్టుబడి ఉన్నారు. బహుశా ప్రపంచ చరిత్రలో, ఇచ్చిన హామీలు తప్పకుండా కష్టమైనా, నష్టమైనా పూర్తి చేస్తున్నది ట్రంపే నేమో. తనని ఆపటానికి స్వపక్షం(రిపబ్లికన్లు), విపక్షం(డెమోక్రాట్లు) ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసారు, అవి అన్నీ నిష్రయోజనాలు. ఎందుకంటే తర్వాత 2020 ఎన్నికలకు కూడా, ట్రంప్ పొటీ తప్పదు. షుమారు 18 రోజులు మూసి, రోజూ ఒకరి మీద ఇంకొకరు ఆరోపణలు అంతా మీ వల్లనే అని.
ఇప్పుడు డెమోక్రాట్లకు(అంటే ఒబామా పార్టీ) కి కూడా శక్తి వచ్చింది, స్పీకర్ మరియు సభ మెజారిటి ఉంది. రిపబ్లికన్ ల బిల్ పాస్ కాకుండా వీళ్ళూ ఆపగలరు. అలాగే వాళ్ళ బిల్ అమలు కాకుండా ట్రంప్ ఆపగలరు.
మనకు సామెత ఉంది, మొండివాడు రాజు కన్నా బలవంతుడు అని. అదే మొండివాడు రాజైతే, విపక్షానికి నరకమే, నిద్ర పట్టదు, ఏమి చెయ్యాలో తెలీదు. అదే మనిషి అమెరికాకు రాజు అయితే, ప్రపంచానికే దడ దడ. అధ్యక్షుడు ట్రంప్ దానికి సరి అయిన ఉదాహరణ. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం అంటే అన్ని దేశాలకు హడల్, కాని కిం కు కూడా అధ్యక్షుడు ట్రంప్ అంటే హడల్. ఐసిస్ తీవ్రవాద ఉనికి ఎక్కడ ఉందో ఇప్పుడు తెలీదు, వార్తలు లేవు. సౌది అరెబియా మీద కూడా వ్యాఖ్యానించడానికి వెనకాడరు.
అలాంటి పోలికలు కొంచెము ఉన్న మనిషి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్, నోటి మాట కూడా సరిగ్గా సరిపోతుంది. కెసియార్ మాట్లాడితే, ఎదుటి పక్షానికి జవాబులు ఉండవు. కెసియార్ మాటలు ఆంధ్రా వాళ్ళకి లేదా విపక్షానికి నచ్చాయా లేదా ఇబ్బందులు ఉన్నాయా లేవా అన్నది అనవసరము ఇక్కడ, తెలంగాణా ప్రజలకు నచ్చుతున్నాయి. అదే మనకు ముఖ్యం.
ప్రధాని మోదీ కూడా అలాగే చేస్తున్నారు విపక్షానికి గమ్ముగా(సైలెంట్ గా) , కానీ గట్టి మాటలు, దుమ్ము దులపడము లేవు, కెసియార్ లా లేదా ట్రంప్ లా.
అలాగే అధ్యక్షుడు ట్రంప్ పనులు భారత్ కి నచ్చుతాయా లేదా ఇక్కడ అనవసరము, అమెరికా మెజారిటీ ప్రజలకు నచ్చుతాయి. అన్నీ వివరముగా ముందే చెప్పారు, జనము ఆమోదించి అందుకే గెలిపించారు, అవే ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు మాట తప్పకుండా.
డెమోక్రాట్లు అడుగుతున్నారు, గోడ ముఖ్యమా ఎన్నో సమస్యలు ఉంటే అని, దానిని పక్కన పెట్టు విడిగా మాట్లాడుకుందాము, ప్రభుత్వము తెరువు అని, జనాలను విడదీయొద్దు గోడలతో అని. మెక్సికో తో కట్టిస్తాను అన్నావు గదా అని.
దానికి అదే లెవల్లో అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు జవాబు, ఒబామా లేదా స్పీకర్ ఇంటికి 10 అడుగుల ప్రహరి గోడ ఎందుకు ఉంది, అంటే ఆయన ఇరుగు పొరుగు వారిని విడదీస్తున్నారా? కానప్పుడు దేశానికి ఎందుకుండ గూడదు. మెక్సికో తో కొత్త వ్యాపార ఒప్పందము తో మనకు డబ్బు వస్తుంది. గోడ తో పాటు ఇంకా రక్షణ చర్యలు అంటే కెమెరాలు, పోలిసులు, కోర్టులు, జడ్జీలు , చాలా కావాలి. డబ్బు ఇవ్వండి అని కాంగ్రెస్స్(అంటే మన పార్లమెంట్ లాంటిది ) ని నిలదీస్తున్నారు.
ఇలాగే కొనసాగిస్తే, జనాన్ని ఇబ్బంది పెడితే, మాట వినకపొతే, ఎమర్జెన్సీ కి కూడా వెనకాడరేమో అని భయపడుతున్నారు . ఈ ఆట ఎక్కడ ఎలా ముగుస్తుందో, ఆ ప్రభువుకే తెలియాలి. మధ్యలో నలిగేది సామన్య అమెరికా ప్రజలు, వారితో పాటూ మిగతా దేశాల జనాలు.
ప్రభుత్వము తాత్కాలిక మూత అంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు పని చేయవు, ఉద్యొగులకు జీతాలు తగ్గుతాయి లేదా ఉండవు ఆ టైం/కాలాని కి . వీసాలు , పాస్పోర్ట్ పనులు లేటు, పబ్లిక్ పార్క్ లు మూత, ఇంకా చాల ఇబ్బందులు ఉన్నాయి . సాఫ్ట్వేర్ పనులు ఆగుతాయి, తగ్గుతాయి.
ప్రభుత్వ తాత్కాలిక మూత వివరాలు : మొదలు డిసెంబర్ 22, 2 వ లాంగెస్ట్ రికార్డ్ , 8 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు,9 శాఖలు షుమారు గా. ట్రంప్ డిమాండ్స్ $5.7 బిలియన్లు దేశ రక్షణ గోడ కోసము, దాన్ని విపక్షం వ్యతిరేకిస్తుంది.
అమెరికా(యు స్ ఏ) కు మెక్సికో కు సరిహద్దు లో గోడ కట్టాలని అసలు గొడవ. ఎందుకంటే మెక్సికో లేదా ఇతర దేశాల ప్రజలు వలసదారులు గా అక్రమంగా వేరు వేరు దారులలో వస్తున్నారు. దానిని ఆపాలని ట్రంప్ ప్రయత్నం. వారు దొంగలు, దోపిడి దారులు, రేపిస్టులుగా కేసులలో ఇరుక్కుంటున్నారు తలనొప్పి అవుతున్నారు అని. సక్రమంగా వచ్చేవారితో ఇబ్బంది లేదు, తెలివైన వారిని తెచ్చుకుందాం.
ఇండియాకు కూడా గోడ లేదా ఇనుప ముళ్ళ కంచె సమస్య ఉంది. పాక్ మరియు బంగ్లాదేష్ సరిహద్దు లో. అక్కడా మనకు తలనొప్పి ఉంది. మనకు ఇంటి సమస్యలతో లేదా తిక్క రాజకీయాలతో సరిపొతూ, దాన్ని పట్టించుకోవడము లేదు. ముందు మనకు మనవారికి పదవులు ముఖ్యం, దేశ భద్రత తర్వాత.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,837,481; 104 తత్వాలు (Tatvaalu) and views 221,601
Dt : 30-Dec-2018, Upd Dt : 12-Apr-2019, Category : America
Views : 1436
( + More Social Media views ), Id : 11
, Country : USA
Tags :
President Trump ,
Wall ,
Republican ,
Democrats ,
Govt Shutdown ,
USA ,
Mexico ,
Telangana ,
CM KCR ,
PM Narendra Modi ,
India ,
Kim
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments