చీరాలలో పసుపు తమ్ముళ్ల సందడే సందడి, చూడండి ఈ ఆత్మీయ సమావేశంలో - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,404; 104 తత్వాలు (Tatvaalu) and views 224,962.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఎన్నాళ్ళకెన్నాళ్ళ కు, చీరాల తెదేపాలో కదలిక వచ్చింది, స్ధానిక నాయకులు సంక్రాంతి సందర్భంగా, కొత్త సంవత్సరంలో, మెరిసే పసుపు కళ తీసుకుని వచ్చారు, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చేందుకు. కరోనా సమయములో, ఎవరూ కనపడలేదు అన్ని విషయం అందరికీ తెలిసిందే.

చాలా రోజులు తర్వాత, చీరాలలో పసుపు తమ్ముళ్ల సందడే సందడి, చూడండి ఈ ఆత్మీయ సమావేశంలో. మరలా నాయకులు స్ధానికం గా తర్వాత దొరకరు కాబట్టి, ఇప్పుడు హడావుడిగా కార్యక్రమం పెట్టారు అని గుసగుసలు, నిజం అధిష్ఠానం కే తెలియాలి.

ఎవరి మీద పెద్ద గా విమర్శలు గానీ, అలాగే చీరాల సమస్యలు మరియు అభివృద్ధి గురించి, చీరాల జిల్లా లేదా జిల్లా శాఖలు రావాలని, మాటలు ఏమీ రాయలేదు, ఫోటోలు వీడియో తో పాటుగా ఫేస్బుక్ పోస్టులో.

సోషల్ మీడియా లో, మీ పేజీ చూసే పార్టీ అభిమానులు కు అయినా, ఏం జరిగింది, ఎందుకు కలిసారు, ఏమి తీర్మానం చేశారు అని సమాచారం లేదు కదా. వార్తా పేపర్లో చూసుకోండి అంటే ఎలా? అవి గూగుల్ సెర్చ్ లో రావని, గతంలో ఎన్నోమార్లు అనుకున్నాం.

ఈ ఫోటోలు కూడా అధికారిక, చీరాల తెదేపా పేజీలో లేవు, కేవలం నాయకుల పేజీలోన మాత్రమే ఉన్నాయి. ఈ ఫోటోలు జిల్లా, పార్లమెంటు, రాష్ట్ర స్ధాయి పేజీలు లో కూడా పెట్టి, ఈ నియోజకవర్గంలో, ఈ విధమైన తీర్మానం చేశారు అని రాయాలి కదా.

అధికార వైకాపా నాయకులు అయిన ఆమంచి, కరణం, పోతుల గారిని మాట వరుస కు అయినా, సరిగ్గా పని చేయడం లేదు అందుకే ఇకపై ప్రతి వారం చూడండి మా ప్రతాపం అనో లేదా బాగా పని చేస్తున్నారు, కాబట్టి మేము సైలెంట్ గా ఉన్నాము ఇన్నాళ్లు, అనో ఏదో ఒకటి రాయాలి, రాస్తే బాగుంటుంది సోషల్ మీడియా టీమ్.

తెదేపా బాపట్ల పార్లమెంటు, జిల్లా, రాష్ట్ర స్ధాయి నాయకులు, వీరికి ఎందుకు సోషల్ ట్రైనింగ్ ఇవ్వరో, పార్టీ ని సజీవంగా కళ కళ లాడేటట్లు ఉంచరో తెలీదు, కనీసం సోషల్ మీడియా పేజీలు లో అయినా, అన్ని నియోజకవర్గాల్లో.

ఇక నుంచి అయినా, రోజూ లేదా వారం కు, స్ధానిక నాయకులు, బాధిత ప్రజలను కలుస్తూ, సమస్యలు కోసం పోరాడుతున్నట్లుగా, కనీసం ప్రయత్నం చేయాలి. ఆదర్శంగా మన లోకేష్ గారిని తీసుకుని, ప్రజలతో మమేకం కావాలి.

రేపు ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలి అంటే, ప్రతి నియోజకవర్గ తెదేపా ఫేస్బుక్ పేజీలో, రోజూ ఒక స్ధానిక పోస్ట్ ఉండాలి. అన్ని పార్టీలు అధిష్ఠానం, దీనిని అమలు చేయాలి.

ప్రజలు, వచ్చే 2024 ఎన్నికల్లో, వైకాపా లో టిక్కెట్ రాని ఆమంచి, కరణం, పోతుల గార్లు లో ఎవరో ఒకరు మాత్రమే, చీరాల తెదేపా కు దిక్కు అని గుసగుసలు, నిజం నాయకులు కే తెలియాలి. స్ధానిక నాయకులు మేలుకోండి, ప్రజలతో కలసి మెలసి తిరగండి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,404; 104 తత్వాలు (Tatvaalu) and views 224,962
Dt : 11-Jan-2021, Upd Dt : 11-Jan-2021, Category : Politics
Views : 732 ( + More Social Media views ), Id : 920 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : buzz , yellow , tdp , followers , brothers , chirala , soulful , meeting , yadam balaji , lokesh , bapatla
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content