జగన్ అండతో సునీత ఎమ్మెల్సీ, పాత మాయలో కరణం, ఆమంచి తో కలసి 3 అభివ్రుద్ది కై - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,652; 104 తత్వాలు (Tatvaalu) and views 225,088.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

తెదేపా ను వీడి జగనన్న ను, నమ్మి వచ్చిన సునీత అక్క కు తగిన న్యాయం చేసి, అండగా నిలచిన వైకాపా పెద్దలు. ఈ విషయములో, మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. జగన్ మరియు పార్టీ పెద్దల అండతో, మరోసారి సునీతను వరించిన ఎమ్మెల్సీ పదవి.

కరణం గారు, పాత నాయకుల మాటల గారడీ మాయలో పడి, మొన్న బహిరంగ సభలో, సునీత గారిని కసురుకున్న, విషయం అందరికీ తెలిసిందే. అక్కడ అనవసరమైన వాదన. పాత నాయకులు, తమ ఆధిపత్యం తమ పనులు కోసము అధికారములో ఉన్న మనలను పొగుడుతున్నారే కానీ, మన మంచి కోరే వారు కాదేమో అంటున్నారు కొందరు. ఎందుకంటే, యువ నాయకులు వెంకటేష్ గురించి పొగిడింది కానీ, యువ నాయకత్వం రావాలని అన్నది ఎక్కడా లేదు, ఆరోజున లేదా తర్వాత అని గుసగుసలు.

సునీత గారు లేకుండానే కార్యక్రమాలు మమా అని పించారు. ఏదన్నా సమయ ఇబ్బంది ఉంటే, లోన మాట్లాడుకుని, మరలా కలసి పోవాలి, మూడు ముక్కలాట గా నవ్వులు పాలు కాకూడదు. వేసే ప్రతి అడుగు, వెంకటేష్ భవిష్యత్తుకు ఆటంకము కారాదు అని శ్రేయోభిలాషుల అభిప్రాయం.ఎవరు పోటీ పడ్డా, చివరకు తేల్చేది అధిష్టానమే, కాబట్టి ఇప్పుడు గొడవలు అనవసరము.

ఇప్పటికైనా, ఒకే పార్టీలో ఉంటున్న, ఆమంచి కరణం పోతుల గార్లు, చీరాల అభివ్రుద్ది కై స్వచ్చందముగా మనస్పుర్తి గా పాటుపడుతూ, మేము ఉండగా, ఇదిగో జిల్లా తెచ్చాము లేదా జిల్లా శాఖలు తెచ్చాము, ఫిషింగ్ హార్బర్ తెచ్చాము, చేనేత పార్క్ తెచ్చాము అనే పెద్ద పనులు చేసి, ప్రజల మనసు దోచుకోవాలని, అప్పుడే, 2024 లో ప్రజలు గౌరవించి గెలిపిస్తారని అందరూ అనుకుంటున్నారు.

జగనన్న పధకాల లో పాలు పంచుకుంటూ ఫోటోలు తీసుకున్నందు వలన, స్థానిక నాయకులకు వచ్చేది ఏమీ లేదు. ప్రజలకు స్పష్టముగా తెలుసు, నవరత్నాల లో భాగముగా అవి అందుతున్నాయి, మీ కష్టము ప్రయత్నము లేకుండానే అని. కాబట్టి, బాపట్ల ఎమ్మెల్యే కోన గారిని ఆదర్శముగా తీసుకుని, మీరు బాలినేని సాయి సజ్జల జగన్ గార్లను పట్టుకుని సమస్యలు అభివ్రుద్ది విన్నపాలు చేసి, పెద్ద పనులు తెస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. లేదంటే, 2024 లో జనము ఓట్లు కష్టమని అందరి అభిప్రాయము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,652; 104 తత్వాలు (Tatvaalu) and views 225,088
Dt : 12-Jan-2021, Upd Dt : 12-Jan-2021, Category : Politics
Views : 749 ( + More Social Media views ), Id : 921 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sunita , ysrcp , mlc , jagan , karanam , old maya , amanchi , 3 together , chirala , development
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content