Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
*Sitting in the house without doing anything, if one recites the Ashtottaram, food come, curd come, butter come, ghee come?*
మానసిక నియంత్రణ బల సత్సంగం 5 నిమిషాలు - సొంత అనుభవము మాత్రు భాషలో, సత్వ గుణ జనుల సాధన కు అండగా.
*పాలలో పెరుగులో వెన్న ఉన్నది అనుకుంటే, నిరంతరం మనసులో ధ్యానములో, అనుకుంటే చాలదు, సాధన చెయ్యాలి, కష్టపడాలి, కుండ శుభ్రముగా కడిగి లేకపోతే పాలు విరిగి పోతాయి, కట్టెలు/ గాస్ పెట్టి పాలు కాయాలి, పాలు తోడు వేసి రాత్రి అంతా భద్రముగా ఉంచి పెరుగు చెయ్యాలి, నీళ్ళు పోసి కవ్వము తో చిలకాలి మజ్జిగ గా. అప్పుడే వెన్న వస్తుంది. దానిని కాస్తే మంట వేసి నెయ్యి వస్తుంది.*
అంటే వెన్న నెయ్యి కావాలంటే, ఎంతో శ్రమ పడాలి. అలాగే బియ్యం బస్తా దగ్గర కుర్చుని, పూజ చేస్తే అన్నం ఉడికి నోట్లోకి వస్తుందా?
ఊరక ఇంట్లో కూర్చొని, బువ్వ రావే, పెరుగు రావే, వెన్న రావే, నెయ్యి రావే అని అష్టోత్తరము చదివితే, భజన చేస్తే, దీపాలు పెడితే, హుండీలో ధనం వేస్తే, పూజారి తో పూజ చేపిస్తే, చందా ఇస్తే, మాలలు వేస్తే, ప్రదక్షిణలు చేస్తే, పొర్లు దండాలు పెడితే, వెన్న/ బువ్వ వస్తుందా ఆటొమేటిక్ గా వాటంతట అవే? మరి దేవుడు ఎలా వస్తారు మన ఇంట్లోకి ఒంట్లోకి? ఎలా మన హ్రుదయములో నిలబడతారు? కఠిన మానసిక శారీరక సాధన లేకుండా? అరిషడ్వర్గం అష్టవ్యసనం జయించకుండా? స్తిరత్వం స్తితప్రజ్ఞత లేకుండా?
అష్టోత్తరము, భజన, దీపాలు, మాలలు, ప్రదక్షిణలు, పొర్లు దండాలు మంచిదే ఇవన్నీ మానసిక నియంత్రణ బలం కోసం. అవి ఉంటే, ఇంట్లో మంచిగా కల్తీ లేని అన్నం/ వెన్న తింటాము. ధనం తో కొంటాను అంటే, కల్తీ వెన్న/ అన్నం, తర్వాత రోగం తో అదే ధనం పోగొట్టుకుని ఆసుపత్రిలో హీన చావు.
కరెక్ట్ గురువు గారు ఇప్పుడు మీరు కూడా లోతు గా ఆలోచన చేస్తున్నారు అనుభవముతో, అలాగే ప్రతి వారం మీ సాధనలు తెలుగులో చెపుతూ ఉండండి, అది మీకు దైవ బలాన్ని ఇస్తుంది. అందరూ నవ్వుతారు, పట్టించుకోవద్దు, దూరంగా పారిపోతారు, పట్టించుకోవద్దు.
మనం ఇల్లు 6 ఏళ్ళుగా పాడుబడింది, చెట్లు కొట్టాలి, 79+ ఏళ్ళ ముదుసలి అమ్మను చూసుకోవాలి అంటే, 5 ఏళ్ళుగా వందమందికి చెప్పినా, ఎవరైనా జాలి చూపారా 4 రోజులు వచ్చి? దేవుడు దిగి వచ్చారా, తల్లికి 10 ఏళ్ళ సజీవ గురువు సేవ చేస్తున్నారు అని? కానీ మార్గాలు చూపారు కదా?
మరి అసలు మన సత్వ గుణములు కర్మలు ఎవరికీ చెప్పమని, మీరు చాటుగా దాంకుని ఉంటే, ప్రొఫైల్ ఫోటో లేకుండా, వాట్సాప్ రీడ్ రిసీప్ట్ పెట్టుకునే ధైర్యం లేకుండా, బులుగు టిక్ అంటే భయపడితే, ఇంక అసలు దైవ సహాయం అందుతుందా మీకు, దైవ సంతానానికి దూరం గా ఉంటే?
మనం పంపేవి 5 నిమిషాలు చదివి, స్పందనకు సమయం లేని వారు, పోనీ వారు సొంతగా తెలుగు లో సొంత అనుభవాలు సాధనలు వ్రాస్తారా అదీ లేదు, మొన్న నరాల డాక్టర్ దగ్గర 2 గంటలు పడికాపులు కాసి, 10 సార్లు అయినా వస్తాం సార్ అంటూ డాక్టరు కు దండం పెడుతున్నారు, ఆస్తులు అమ్ముతూ. చూడండి అప్పుడు ఎంత ఖాళీ సమయమో, ధన వ్రుధా ఖర్చో?
అదే ముందు సత్వ గుణానికి అండగా ఉండి, సత్వ గుణ పెంపునకు ప్రచారమునకు ధన సహాయము చేసి, వారి అడుగు జాడల్లో నడిస్తే? ఇంత హీన బతుకు ఉండదు కదా?
ఎందుకంటే రేపు వారికి రోగం వచ్చినా కష్టం వచ్చినా, రజో తమో గుణాల జనాలు వారికి సేవ చేయరు, డాక్టరు కూడా చూడరు, ధనం మొత్తము ఇవ్వనిదే. మొన్న వార్త చూసారు కదా, పని మనిషి, యజమానిని లేపేసి, దొరికింది తీసుకుని మాయం. ఇక ఇంట్లో అల్లుడు/ కోదలు వెన్నుపోటు, కన్న పిల్లలతో అలాగే భాగస్వామి తో గుండెపోటు మాములే. ఇంట్లో ఉండలేక భాగస్వామి నస హింస భరించలేక, గుడుల చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు ఇంకొందరు.
చాలా మంది సత్వ గుణ కర్మలు ఒక వారం/ నెల సాధన చేసి, అమ్మో మా వలన కాదు అని రజో/ తమో గుణాలకు దాసులై, బద్దకం నిర్లక్ష్యం చెడు వైపు వెళుతున్నారు పతనం అవుతున్నారు, అనారోగ్యం తో, సొంత ఇంటి వారి చీత్కారాలతో. అందరూ ఉండి అనాధలు గా ఉంటున్నారు. ఎందుకంటే రజో తమో గుణాలు, జంతు స్వభావముతో, క్రుతజ్ఞతలు విశ్వసనీయత లేకుండా, ప్రాపంచిక మత్తులో మానసిక బలహీనతతో ఉంటారు.
Nagula Chaviti - Nagaraja, Naga Devata, Naga panchami Songs
నాగులచవితి కి పంచ పాండవులు గా పంచ పాటలు భక్తి తో, రాగం తానం పల్లవి గాత్రం మంచిగా లేకపోయినా, ఆరోగ్యం కోసం చేశాం, చిన్న ప్రయత్నం. మరి మీ ఇంట్లో కూడా కనీసం ఒక పాటైనా పాడి అందరికీ వినిపించే సత్వగుణం ఉందని నిరూపిస్తారు కదూ. మన గుణం మల్లెపువ్వు లాగా స్ధిరంగా పరిమళించాలి వ్రాత, మాట, పాట, పద్యం, శ్లోకం, కర్మలు అంటే చేతలలో నిత్యం కనపడాలి, హైందవ సంస్కృతి సాంప్రదాయాలు ను రేపటి తరానికి పంచాలి పెంచాలి, మానసిక నియంత్రణ బలం తో. అవి లేనప్పుడు మనం ధర్మకర్తలు గా, ఉపాధ్యాయులు గా, పూజారులు గా, నాయకులు గా, అధికారులు గా, పెద్ద మనుషులు గా, తల్లిదండ్రులు గా ఉండి ప్రయోజనం ఏమిటి? సొంత ఇంట్లో నే ఎవరూ మాట వినరు కదా, ముదుసలి తనం లో మనల్ని పిల్లలు భాగస్వామి ఇంట్లో గౌరవం గా మనశ్శాంతి గా ఉంచుతారా, క్రుతజ్ఞత విశ్వసనీయత లేని పశు పెంపకం బంధాలు తో?
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2216 General Articles and views 2,481,502; 104 తత్వాలు (Tatvaalu) and views 266,457
Dt : 05-Nov-2024, Upd Dt : 05-Nov-2024, Category : General
Views : 127
( + More Social Media views ), Id : 2168
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Sitting ,
house ,
recites ,
Ashtottaram ,
food ,
come ,
curd ,
butter ,
ghee
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments