హీరో ఔదార్యాన్ని, గొప్పతనాన్ని, ఎలా పొగిడారో - బాలీవుడ్, ఒక బ్లాక్ బస్టర్ సినిమా ప్లాన్ - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,908; 104 తత్వాలు (Tatvaalu) and views 225,002.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

బాలీవుడ్ ఇప్పటికే, ఒక బ్లాక్ బస్టర్ సినిమా ప్లాన్ చేస్తోంది అంట, రహస్యము ఈ కధ, ఎవరికీ చెప్పొద్దు సుమా ...

నిర్మాణంలో కొత్త బాలీవుడ్ చిత్రం యొక్క, రూపు రేఖలు లేదా వివరాలు ఇలా ఉండవచ్చు అని, అభిజ్ఞ వర్గాల భోగట్టా:

అమీర్ ఖాన్, ముంబై లోని ఒక యూనివర్సిటీలో విద్యార్థి, సాఫ్ట్వేర్ ఇంజినీర్, అతని స్నేహితురాలు మరియు ప్రియురాలు అనుష్క, చైనాలో సుందర ద్రుశ్యాలు చూడటానికి, గత నెలనుంచి, పర్యటిస్తోంది.

ఆమె అనుకోకుండా, ఒక విపత్కర పరిస్తితిలో, కరోనా వైరస్ బారిన పడి, చైనాలోని హై సెక్యూరిటీ ఆసుపత్రిలో చికిత్స కై, నిర్బంధంలో ఉంది. ఇతరులకు ప్రవేశము ఉండదు కదా.

హీరో కి ఈ విషయము తెలిసి బాధపడి వెంటనే, ఒక స్థానిక కార్పొరేట్ ఆసుపత్రి డాక్టర్ని కలుస్తారు మందు కోసము. మందు ఇంకా కనుగొనలేదు, అమెరికా డాక్టర్ తో కాంటాక్ట్ లో ఉన్నాము, త్వరలో వస్తుంది అంటారు.

అతను ప్రియురాలి మీద ప్రేమతో, గమ్ముగా ఉండలేక ఆదుర్దాతో, ఒక స్థానిక జైజై బాబాను సంప్రదిస్తాడు ఏమి చెయ్యాలి అని, దీనముగా నమస్కరించి వేడుకుంటూ. అతను ఒక ప్రత్యేక ఔషధం ఇస్తాడు, సూత్రం కూడా చెపుతాడు, అది హిందుస్తాన్ కి మిట్టి (భారతదేశం యొక్క మట్టి) చిటికెడు.

దానిని అమ్మాయి నుదుటన పెట్టి, సూత్రము ప్రకారము, మరొక చిటికెడు పసుపు తో, పచ్చి కాకర రసము లో, అల్లము వెల్లుల్లి, కలిపి ఇవ్వమంటాడు.

ఆ రసము వేడికి, భరత మాత మట్టి మహాత్యమునకు, ఎటువంటి వ్యాధి అయినా ఇట్టే తగ్గిపోతుంది, ఎటువంటి వైరస్ అయినా చచ్చి పోతుంది, అని ధైర్యము చెప్పాడు. మీరు వ్యాధి తగ్గిన వెంటనే, అక్కడే 2 డ్యూయెట్ల తో, ఆనందముగా తిరిగి వస్తారు అని చెప్పారు.

తిరిగి వచ్చాక, వారానికొకసారైనా, ఈ రసము తీసుకుంటే, నుదుటన మట్టి భారత దేశము లో ఉండగా అవసరము లేదు, ఇక ఏ వైరస్సు రాదు, అభయము నీకు అన్నారు.

ఈ ఔషధం ను, తన ప్రియురాలికి అందించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, హీరో ఇప్పుడు అనేక, అడ్డంకులను ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు శత్రువులనుంచి, ఇలా

* అసలు ప్రియురాలికి ఈ వ్యాధి ఎలా వచ్చింది, అందులో దాగున్న కుట్ర హీరో కోసం
* ప్రయాణ పరిమితి నియంత్రణ ఉన్నందున, సరిహద్దును దాటడానికి చాకచక్యముగా, చట్టాలను నిబంధనలను ఉల్లంఘించడం
* ఆసుపత్రిలో అత్యంత భద్రత మధ్యలో ప్రియురాలిని కలవడము
* పాకిస్తాన్ కు చెందిన ఒక విలన్ ఔషధం మార్చి, పాకిస్తాన్ కి మిట్టి తో, భర్తీ చేయడం మరియు కాకర రసంలో విషము కలపడము ద్వారా, మిషన్ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాడు.
* హీరో చాకచక్యముగా ఎలా దాన్ని ఎదుర్కొన్నాడు అద్భుతమైన ట్రిక్ ఫైట్ లతో
* ప్రియురాలికి జబ్బు నయము అవడము చూసి, పక్కన ఉన్న మిగతా చైనీయులు, అదే ఔషదాన్ని తయారుచేసుకొని, జబ్బు ఎలా తగ్గించుకున్నారు
* జీవ జంతు హింస వద్దు, శాఖాహారం ముద్దు అని మన హీరో వారికి ఎలా భోదించారు
* చైనీయులు అంతా, భారత దేశము మరియు హీరొ, ఔదార్యాన్ని, గొప్పతనాన్ని, ఎలా పొగిడారో వెండి తెర మీద చూడాలి మరి. జయహో భారత్.

చూడండి - హీరో తన లక్ష్యాన్ని ఎలా నెరవేరుస్తాడు .. మిగిలిన గొప్ప దేశ భక్తి కథ, మన పసుపు, కాకర, అల్లం, వెల్లుల్లి ఘనత.

సినిమా టైటిల్: కరోనా ప్యార్ హై, మిట్టి కా మహాత్య్ హై
సేకరణ మరియు సవరణ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,908; 104 తత్వాలు (Tatvaalu) and views 225,002
Dt : 05-Mar-2020, Upd Dt : 05-Mar-2020, Category : General
Views : 802 ( + More Social Media views ), Id : 382 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bollywood movie corono pyar hai
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content