తిరుపతి 3 ఎంపీ అభ్యర్థులు గురించి మంచి చెడు చెప్పగలరు, అలాగే ప్రచారం మాటలు, గెలుపు ఎవరిది? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,192; 104 తత్వాలు (Tatvaalu) and views 225,130.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మా 2 వ అబ్బాయి తెదేపా, అలాగే 3 వ అబ్బాయి వైకాపా ప్రచారం చూస్తుంటే నవ్వు వస్తుంది. ప్రజలు గొర్రెలు అనే మాట తప్పు ఏమో కానీ, అనుచరులు గొర్రెలు అనే మాట కరెక్ట్ అంటారు, గతములో కరోనా రాకముందు, స్వర్గీయ కాకినాడ కాంతారావు గారు, కాకరకాయ రసము తాగుతూ.

ఇందాకా మోదీ తప్పుల గురించి (ఏవైనా ఉంటే), ఢిల్లీ వీధుల్లో ఆవేశముగా అరిచే ధైర్యం లేని మా పిల్లలు, చాటుగా ఆంధ్రా రోడ్ల మీద, కేకలు ముచ్చట గా ఉంటాయి. మన ఇంట్లో అరుచుకున్నట్లు గా. కాబట్టి కెంద్రం మోసము చేయలేదు, చేస్తే, మా పిల్లలు డిల్లీ వీధుల్లో అరవాలి పంజాబ్ రైతులు లాగా, అంతేనా? ముందు కధనం చదవండి.

సింపుల్ లాజిక్, మోదీ మనల్ని మోసము జేసి, ఏ పిల్లలకు మనుమలకు ధనం ఇవ్వాలి? వాళ్ళ అమ్మ గారు, ఎంత మామూలు ఇంట్లో ఉంటున్నారో చూసాము కదా? వారిని విమర్శించే ధైర్యం, మనవడు కు కోట్లు ఇచ్చిన చంద్రన్న కు, అపరిమిత కోట్లు ఉన్న జగనన్న కు ఉంది అంటే, జనాలు నమ్మడం లేదు.

చంద్రన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వద్దు అనడం, పాల్గొనక పోవడం ఒక విచిత్రం. గెలవమని తెలిసినా, నాయకులను రోడ్ మీద ప్రజలను కలిసే, అలవాటు చేసే తిప్పే, వ్యాయామ, అవకాశం వదులుకోకూడదు కదా. అసలే 2020 కరోనా సమయము లో దాంకున్న మన నాయక తమ్ముళ్ళు, బయట తిరిగి జనాన్ని కలిసే అవకాశం వదులుకోకూడదు.

అధిష్టానం నుంచి ఒకరు, మనల్ని వీడిన దగ్గర నుంచి, తిక్క పనులు ఇంకా ఎక్కువ అయ్యాయి. మిగతా వారు కు పంపే ధైర్యం ఉందో లేదో తెలీదు. కరోనా కష్ట సమయములో, ఇప్పుడైనా తెదేపా నాయకులు ఆంధ్ర ప్రజలకు తోడుగా ఎందుకు ఉండరు? చంద్రన్న ముందు, ఆంధ్రాలో ఎప్పుడు పూర్తి టైం నాయకుని గా ఉంటారో? లేదా కనీసం లోకేష్ ని అన్న ప్రజల మీద దయతో ఉంచుతారో చెప్పడం లేదు.

చంద్రన్న జగనన్న చేసిన అభివ్రుద్ది కి, తగిన ఆసుపత్రి లేక, గుంటూర్ జిల్లా ఎమ్మెల్యే శ్రీదేవి గారు హైదరాబాద్ వెళ్ళారు ఎప్పటి లాగనే.

ఇప్పుడు వకీలసాబ్ ను, అనవసరముగా అంత ఇబ్బంది పెట్టి, నీతులు చెప్పెందుకు, మంత్రి నాని ప్రయత్నం చేసారు. ఓ పక్క ఎలెక్షన్, అదీ పవన్ తో నే, నీతి నియమాలు మొదలు పెట్టాలని చూడటము, మనము భయపడ్డట్టు పవన్ మాటలకు అని, జనాలకు తప్పుడు మెస్సేజ్ ఇచ్చి, వైకాపా సలహాదారులు మరొక తప్పు చేసారు. పవన్ మాత్రమే ట్రెండ్ సెట్ చేస్తారు, ఇక నుంచి బెనెఫిట్ షో లు లేకుండా, అంతేనా?

పవన్ సినిమా తర్వాత వారం రోజులకు, ఆ నీతి నియామలను, ఇంక నుంచి మొదలు పెడతాము అంటే బాగుండేది. ఇంతకాలం, చంద్రన్న ప్రజలను మోసం చేసి, సినిమాల ద్వారా సామాన్యులను దోచి, సినిమా వారికి పెట్టారు అని అయితే మాత్రం, స్పష్టం గా తెలివి గా చెప్పారు. మరి కూరగాయల రేట్లు, సరకుల ధరలు కూడా తగ్గిస్తారా? కేవలం సినిమా వరకేనా, నీతులు?

ఎందుకు ఇన్నాళ్ళు చంద్రన్న బెనెఫిట్ షోలు వేసారు, అంత ఎక్కువ ధనముతో? అలాగే ఈ 2 ఏళ్ళు జగనన్న ఎందుకు చేసారో చెప్పాలి, కాని ఇకనుంచి సరి చేసారు కాబట్టి, శభాష్ జగనన్న. చూద్దాం మిగత సినిమాలు రేట్లు రాబోయే రోజుల్లో. హాల్ లోపల్ దోపిడీ కూడా ఆపుతారా?

రాష్ట్రం లో ఏది జరిగినా, మా చీరాలకు బాపట్ల పార్లమెంట్ కు లింక్ ఉంటుంది అన్నా కదా. అలాగే ఇప్పుడు కూడా ఉన్నది, చూడండి ఈ మాటలలో.

1. తెదేపా ఎంపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి - గతము లో బాపట్ల ఎంపీ గా చేసారు. ఏమి చేసారో, మా పార్లమెంట్ స్థానానికి, మా కైతే తెలీదు. వారు ఒక్కరే కాదు, ఏ ఎంపీ అయినా అంతే మా దగ్గర. గెలిచిన తర్వాత, మాకు ఏదీ తెచ్చింది లేదు ఇచ్చింది లేదు. అలాగే దగ్గుబాటి వారు కూడా. ఏదైనా అభివ్రుద్ది ఎంపీ వలన ఉంది అంటే, మీరే చెప్పగలరు. కాబట్టి, వ్యక్తి గా ఆమె వలన తిరుపతి కి కూడా ఉపయోగము లేదు. తెదేపా తరపున అసలు విలువ లేదు, అక్కడ డిల్లీలో ఇప్పుడు.

2. వైకాపా ఎంపీ అభ్యర్ధి గురుమూర్తి - ఈయన జగనన్న అనుచరుడు డాక్టర్, జగనన్న వైద్యం చేసిన వ్యక్తి. అంతకు మించి ఈయనతో, ఏ విధమైన ఉపయోగము లేదు. అఖరికి నిన్న విలేఖరుల సమావెశం జరుగుతుంటే, నాయకులు మంత్రులు అందరూ మైకులకు ఎదురు కూర్చోని, పార్టీ అభ్యర్ధి ఈయనను ఓ మూలన కూర్చొబెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి అంటే, చాలా వినయంగా ఉన్నారు.

అనుచరుడు గా సహాయం చేయాలి అంటే, ఉదాహరణకు మేము విలేఖరిగా మంచి వారమైతే, ధన సహాయం చేయాలి లేదా దోవ చూపాలి అంతే గానీ, ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఎందుకు మాకు? ఇప్పుడు ఉన్న 20 మందిలో, ఢిల్లీలో నోరు తెరుస్తుంది ఎంత మంది?

మా బాపట్ల ఎంపీ కూడా, కేవలం జగనన్న అనుచరుడే అని ఇచ్చారు. పార్లమెంట్ లోపల నోరు ఎప్పుడు తెరవరు అసలు, బయటకు వచ్చి మాత్రం ఇతరుల మీద అరుస్తారు. చీరాలకు 2 ఏళ్ళు గా తెచ్చింది ఏమీ లేదు, ఇక కూడా ఏమీ తీసుకు రారు.

ఒక్క మంచి పని ఏమిటి అంటే, మా ఎంపీ వలన, జగనన్న భజన మాత్రము, నిజాయితీ గా చేస్తారు. ఇప్పుడు, తిరుపతి ఎంపీగా గెలిచినా, ఆయనా అంతే. కనీసం జగనన్న అన్నా, ఓ బాపట్ల ఎంపీ, ధర్మవరం కేతిరెడ్డి అన్న లాగా, నెలకోసారి అన్నా, చీరాలలో తిరిగి, ఏదన్నా అభివ్రుద్ది ఉంటే, ఫోటోలు పెట్టు, నా భజన వలన ఉపయోగం లేదు అని చెప్పరు.

3. బీజేపీ జనసేన ఎంపీ అభ్యర్ధి రత్న ప్రభ - ఐయేయెస్ అధికారి. ధైర్యముగా గతములో జగనన్నతో, ఏందయ్యా ఈ అవినీతి కేసుల తలనొప్పులు మాకు అని అన్నారు. నీతి నిజాయితీ, ప్రభుత్వం అంటే తెలుసు. ఉన్న అభ్యర్ధులలో, కాస్త మనుషుల గురించి ఆలోచన చేసే, హూందా ఉన్న అభ్యర్ధి. డిల్లీలో కనీసం విలువ ఉంటుంది, బీజేపీ తరపున అడగడానికి.

గెలుపు అందరికీ తెలుసు, మంచి మనము కోరుకుంటామా? కాబట్టి ప్రత్యేకముగా అనుకోవాల్సిన పని లేదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,192; 104 తత్వాలు (Tatvaalu) and views 225,130
Dt : 15-Apr-2021, Upd Dt : 15-Apr-2021, Category : Politics
Views : 919 ( + More Social Media views ), Id : 1098 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : good , bad , tirupati , mp , candidates , campaign , rhetoric , victory , ratna prabha , gurumurthy , panabaka lakshmi , tdp , janasena , bjp , ycp
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content