సంక్రాంతి వేళ ఓ ఆనందము తమ్ముడికి ఇచ్చినందుకు, ఓ బాధ అమ్మ ఆరోగ్యము - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,732; 104 తత్వాలు (Tatvaalu) and views 224,708.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

సంక్రాంతి పెద్ద పండగ తెలుగు వారికి. ఉత్తరాయణ పుణ్యకాలము మొదలు, సూర్య గమనము మకరము లో చేరి, ఇక పగలు పొద్దు పెరగడం మొదలు కూడా. ధాన్యం ఇంటికి వచ్చి రైతు కుటుంబాలు ఇళ్ళు, కళ కళ లాడుతూ ఉంటారు. పండగ దినాలలో ఏ పూజా మరియు దానము చేసినా, అనంత ఫలము అంటారు పెద్దలు. సూర్య మరియు నారాయణ పూజ తో పాటుగా, పిత్రుదేవతలకు కూడా నైవేద్యం పెడుతారు. కళ్ళాపి, ముగ్గులు, జీవాలకు నీళ్ళు గింజలు అన్నము ఎటూ ఉంటాయి.

మీకు తెలుసు అమ్మకు తెల్ల తమ్ముడు ఉన్నారు, ఎప్పుడూ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది 7 ఏళ్ళుగా అని, ఈ కాంప్లెక్స్ లో పని చేసే కనీసము ఇద్దరుకి, వీలు అయితే చుట్టు ఉన్న వారికి కూడా. ఈ సారి పంచె/ లుంగీ మరియు చొక్కా ఇవ్వాలి అన్న సంకల్పము వచ్చింది. ముందు రోజే, అతనికి పంచే అంటే ఏమిటి డెమో ఇచ్చి, ఎలా కట్టుకోవాలి, లేదంటే కనీసము టవల్ లాగా తుదుచుకోవడానికి ఉపయోగము అని చెప్పాము. చొక్కా పట్టకపోతే, కొడుకు కి ఇవ్వమని చెప్పాము. నేను సన్నబడ్డాను పడుతుంది అన్నారు జోక్ చేస్తూ.

ఈరోజు కొబ్బరి ముక్కలు, అరటి కాయలు, ఆపిల్, చక్రాలు, బ్రెడ్ ముక్కలు తో పాటు గా కొత్త బట్టలు పెట్టినట్లు గా పంచె చొక్కా కలిపి, నమస్కారము చేస్తూ మావి స్వీకరించమని అడుగుతూ ఇచ్చాము. మా సంప్రదాయములో, అతిధి దేవోభవ. అంటే తీసుకునే వారే నారాయణుడు అన్న భావనతో ఇవ్వాలి వారిని వేడుకుని, దయచేసి మావి స్వీకరించమని.

తీసుకునే వారు తక్కువ కాదు, మా సాంప్రదాయములో ఎక్కువ అని చెప్పాము. ఆయన నవ్వుతూ కొంత అర్ధము చేసుకుని, బాగుంది మీ సాంప్రదాయము అని తీసుకున్నారు. అలాగే ఇంకో వ్యక్తి కి కూడా ప్రసాదము మీరే ఇవ్వమని ఇంకో పాకెట్ ఇచ్చాము.

అందరమూ మోహములో అనుకునే, దాచుకుంటే ఉన్న లోభ ఆనందము కన్నా, ఇతరులకు సంతోషముగా ఇస్తే ఉండే దాన ఆనందము ఎక్కువ. అది అర్ధము చేసుకుంటే, లోకములో ఇన్ని సమస్యలు రావు.

అలాగే పెద్ద తల్లి దండ్రులు దగ్గర ఉంటే, ఎంత జాగ్రత్త గా ఉండాలో చూడండి. సంక్రాంతి తెల్ల వారు ఝామున 3 గంటలకు అమ్మ నిద్రపట్టక బాధతో, అయ్యా ఒంట్లో అన్ని చచ్చుబడుతున్నాయి అని అరిస్తే, లేపి, మెంతి నీళ్ళు వేడి చేసి తాపించి, బీపీ షుగర్ చూసి, అది లో షుగర్ అయి ఉంటుంది ఏమో అని భావించి, ఖర్జూరము కొంచె తేనే తినిపించాను.

ఉప్పుతో దిష్టి తీసి, ఎందుకంటే ముందు రోజు ముగ్గు చూసి నరద్రుష్టి పడిందేమో అని, మంచము పై పడుకోబెట్టి, కాళ్ళు వత్తుతూ, మరలా నిద్ర పుచ్చితే, దేవుని దయవలన మరాలా పొద్దున్నే అంత మామూలు, సంక్రాంతి పూజ అలాగే తమ్ముడికి వస్త్రాలు ఇవ్వడము జరిగింది. కాబట్టి, తల్లి దండ్రులకు ప్రేమ ఉన్న బిడ్డలు, చివరిలో వారి దగ్గర ఉంటే, పెద్దలకు మనశ్శాంతి సుమా మనకు పుణ్యం శని రాహు కేతు బాధ తగ్గుతుంది, అని పండగ రోజున జరిగిన ఆనంద బాధ విషయాలు సోము, రాము తో చెప్పాడు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,732; 104 తత్వాలు (Tatvaalu) and views 224,708
Dt : 13-Jan-2021, Upd Dt : 13-Jan-2021, Category : General
Views : 810 ( + More Social Media views ), Id : 922 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sankranthi , joy , younger brother , senior mother , health problem
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content