సంఘం - ఈ లోకమే నిదురించెడి భగవానుని, భారత వీర కుమారిని నేనె - ఎన్ టీ ఆర్, అంజలి, వైజయంతిమాల - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,661; 104 తత్వాలు (Tatvaalu) and views 225,089.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*సంఘం - ఈ లోకమే నిదురించెడి భగవానుని, భారత వీర కుమారిని నేనె - ఎన్ టీ ఆర్, అంజలి, వైజయంతిమాల, బాలచందర్*

సామాజిక చైతన్య చిత్రము సంఘము, 1953 లో విడుదల అయ్యింది. ఎన్ టీ ఆర్, అంజలి, వైజయంతిమాల, బాలచందర్, చిత్తూరు నాగయ్య నటించారు. అందులో 2 మంచి పాటలు చూడండి.

మనుషుల్లో ఉండే తేడాలు, కుంచిత మనసు ఎంత బాగా కడిగారో, ఈ పాటలో. భగవంతునికి ఉయ్యాలల జోల, నిరుపేదల ఆకటి గోల. మనకు చేతి నిండా సంపద ఉన్నప్పుడు, పక్క వారికి పంచాలి. అలాగే జ్ఞానం ఉన్నప్పుడు కూడా, ఇతరులకు పంచాలి.

అంటే ఇరుగు పొరుగు తో సఖ్యత గా ఉండి, ఇరువురూ సహాయము చేసుకుంటా ఉంటే, ఇన్ని కష్టాలు కన్నీళ్ళు ఉండవు. కానీ మనకు పిల్లల కోసమే సమయం లేదే? సంస్కారం నేర్పే గుణం లేదే? ఇంక పక్కవారికి ఎలా సహాయం చేయగలం? బిజీ బిజీ కుటుంబ పతనములో?

నరజాతులలో, అధికారపు సంఘర్షణ లేదా? ఈ లోకమే రక్తపటేరుల మునగదు కాదా? అంటూ వాస్తవాన్ని ఎత్తి చూపారు. మనుషుల మధ్య, కులాల మధ్య, పార్టీల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య అసలు సంఘర్షణ లేనిది ఎక్కడ? ఆఖరికి కుటుంబములో భాగస్వామితో, పిల్లలతో కూడా గొడవలే.

ఒక ఉత్తమ మహిళ ఆత్మ గౌరవముతో ఎంత బాగా తన గురించి తన ఆశయాల గురించి చెపుతుందో చూడండి. ఇలా ఈరోజున ఎవరైనా ఉన్నారా? నేను నా కుటుంబం నా పిల్లలు నా సంపాదన మా పతనం అన్న స్వార్ధ మాటలు తప్ప, పక్క ఇల్లు / మనుషులు, సొంత ఊరు, తెలుగు భాష, రాష్ట్రం, దేశం గురించి అసలు ఆలొచన ఉందా?

భారత వీర కుమారిని నేనె, నారీ రతనము నేనె. స్వార్థముతో, కులమత భేదముతో,
సతతము పోరే భరతావనిలో, శాంతి జ్యోతి వెలిగిస్తా, అని దేశం కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం మాట్లాడే మహిళ ఉన్నారా?

అసలు అత్తమామలు, బంధువులు, పక్క ఇళ్ళు జనమే వద్దు మాకు అంటుంటే?

కర్షక సౌఖ్యం, కార్మిక శ్రేయం, కలిగే మార్గం చూపిస్తా - నలుగురికి దోవ చూపించి, సౌఖ్యం శ్రేయం కల్పిస్తా దోచుకోకుండా అనే వారు ఉన్నారా?

రాణీ రుద్రమ, మల్లమ దేవి, రెడ్డినాగమ్మ నేనే. రణ తిక్కన భార్యా, సతి మాంచాల, శౌర్య ధైర్యములు నావే, అంటూ సమాజం లో కుళ్ళు ను, ఇంట్లో జరిగే అరాచకాలను ధైర్యముగా ఆపే మహిళ ఉన్నారా? కనీసం నోటి మాట అయినా అనగలరా? అసలు ముందు వారేవరు, ఏ సినిమాలో నటించారు అని అడిగే దౌర్భాగ్య సంస్కారం లో ఉన్నాము. ఇప్పుడైనా కళ్ళు తెరుద్దాము, పిల్లలను కుటుంబాన్ని సంస్కారం విలువలతో పెంచుదాము.

1) ఈ లోకమే.., భగవానుడు ఆడే చదరంగమా .. .బొంగరమా..

నిదురించెడి భగవానుని, ఉయ్యాల ల జోల.. 2 ఉయ్యాల ల జోల
నిరుపేదల పేగుల రగిలే ఆకటి గోల 2 ||నిదురించెడి||

ధర చిన్నలు పెద్దలు, దేవుని సంతతి కాదా 2
మరి ఎవ్వరు స్రుజియించిరి శ్రమజీవుల బాధా
మరి ఎవ్వరు రచియించిరి శ్రమజీవుల గాధా
ఒకని పానుపులో . . - 2 పువ్వులు, ఒకని కాలికి ముళ్ళు
భగవానునికి ఈరీతిగ, బల పక్షము అదేలా

ఈ లోకపు అన్యాయపు విషహాసము లెల్ల 2
నిదురించెడి భగవానుని ఉయ్యాల ల జోల ఉయ్యాల ల జోల

మన లోకములో, జాతిమత విబేధము లేదా 2
భవనాల వెలుగు, గుడిసెలలో చీకటి లేదా 2
నరజాతులలో .. 2, అధికారపు సంఘర్షణ లేదా
ఈ లోకమే రక్తపటేరుల మునగదు కాదా

పాడిన పాటే పాడుట సంఘపు గోల 2 ||నిదురించెడి||

2) ఒహో, ఒహో, ఆ....లలలాలాలలా లలలాలాలలా
భారత వీర కుమారిని నేనె, నారీ రతనము నే.నె
భారత నారీ అభ్యుదయానికి, నాయకురాలిని నే.నె ||భారత||

స్వార్థముతో, కులమత భేదముతో,
సతతము పోరే భరతావనిలో, శాంతి జ్యోతి వెలిగిస్తా.. 2
కర్షక సౌ..ఖ్యం 2, కార్మిక శ్రేయం
కలిగే మార్గం చూపిస్తా 2

రాణీ.రుద్రమ, మల్లమదే.వి, రెడ్డినాగమ్మ నే.నే. (2)
రణ తిక్కన భార్యా., సతి మాంచా.ల (2)
శౌర్య ధైర్యములు నా..వే. 2 ||భారత||

ఈ పాటను సుశీల పాడగా వైజయింతిమాల అభినయించింది. ఇవాళ విన్నాకూడా బావుండే ట్యూన్ ఇది. ఈ పాటకు మోహనరాగం ఆధారరాగం. ఆ రోజుల్లోని పిన్నలు, పెద్దలు హమ్ చేసుకునేవారు. అంతగా జనంలోకి వెళ్ళిపోయిన పాట ఇది.

Bharata Veera Kumarini (Sangham)

Actor : NTR/ ఎన్ టీ ఆర్, Actress : Anjali devi/ అంజలి దేవి, Vyjayanthimala/ వైజయంతిమాల, Sundaram Balachander/ బాలచందర్

Music Director : Sudarshanam / సుదర్శనం, Lyrics Writer : Tholeti / తోలేటి, Singer : P.Suseela / పి. సుశీల
Movie - Sangham (1953)

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, వాక్సుద్ది కి.

Sangham - e Lokame nidurinchedi bhagavanuni Bharata Veera Kumarini NTR Anjali Vyjayanthimala  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,661; 104 తత్వాలు (Tatvaalu) and views 225,089
Dt : 02-Aug-2022, Upd Dt : 02-Aug-2022, Category : Songs
Views : 527 ( + More Social Media views ), Id : 1482 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sangham , lokame , nidurinchedi , bhagavanuni , bharata , veera , kumarini , ntr , anjali , vyjayanthimala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content